TPT: మంగళం డిపోలో గతేడాది డిసెంబర్ 12 జరిగిన ప్రమాదంలో డ్రైవర్ వి. సుధాకర్ మరణించారు. దీంతో ఆయన నామినీ వి.వి. భారతికి రూ.1.10 కోట్లను SBI అధికారులు బుధవారం DPTO కార్యాలయంలో అందజేశారు. ఇందులో స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ + రూ.20 లక్షలు (ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్) ఉంది. ఈ కార్యక్రమంలో ED(E) కిశోర్, DPTO జగదీశ్, RTC అధికారులు, SBI మేనేజర్లు పాల్గొన్నారు.