AP: మంత్రి నారా లోకేష్ ఇవాళ ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఉ.10:30 గంటలకు పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో ఆయనను కలిసి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు గాను ధన్యవాదాలు తెలియజేయనున్నారు. అలాగే అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులను కలిసి దీనిపై కృతజ్ఞతలు తెలపనున్నారు. ఆపై అమరావతి బిల్లుపై రాజ్యసభలో జరిగే చర్చను గ్యాలరీ నుంచి వీక్షిస్తారు.