కృష్ణా: మచిలీపట్నంలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొబ్బరితోట ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని మున్సిపల్ అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేశారు. స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించినా అధికారులు చర్యలు కొనసాగించారు. అడ్డొచ్చిన మహిళలను మహిళా పోలీసులు ఈడ్చిపడేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.