ELR: తెడ్లంలో బుధవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను సర్పంచ్ స్రవంతి, రమేష్ రెడ్డి దంపతులు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పనిని బట్టి రోజుకు రూ.307 వరకు వేతనం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు. ప్రతి రోజూ పని ప్రదేశంలో హాజరు నమోదు చేయించుకోవాలని సూచించారు.