TG: HYDలోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలసిందే. కాగా, తొక్కిసలాటలో విరిగిపోయిన గ్రిల్స్‌కు మరమ్మతులు చేస్తున్నారు. అలాగే, థియేటర్ లోపల, బయట మరమ్మతులు ప్రారంభమయ్యాయి. ఇకనుంచి సంధ్య 70MM, 35MM థియేటర్లకు వెళ్లేందుకు ఆయా గేట్లకు ప్రత్యేక సూచికలు బిగిస్తున్నారు. ప్రేక్షకులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన మూవీ ‘పుష్ప 2’. ఇటీవల ఈ సినిమా నుంచి ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’ పాట రిలీజైన విషయం తెలిసిందే. తాజాగా ఆ పాటను యూట్యూబ్ నుంచి తొలగించారు. ప్రస్తుతం టీ సిరీస్ తెలుగు ఛానల్లో ఇది కనిపించడం లేదు. బన్నీ పోలీసులు విచారించిన రోజున(డిసెంబర్) ఈ పాటను రిలీజ్ చేయగా.. కావాలనే దీన్ని విడుదల చేశారని పలువురు నెటిజన్లు విమర్శించారు.
హీరోయిన్ శ్రుతి హాసన్ తన పెళ్లిపై నిర్ణయాన్ని చెప్పారు. ‘జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పెళ్లి చేసుకోను అని చెప్పాను కానీ.. ఎప్పటికీ చేసుకోనని చెప్పలేదు కదా..! నేను రిలేషన్‌లో ఉండటాన్ని ఇష్టపడతాను. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. భవిష్యత్‌లో ఎవరైనా నా మనసుకు దగ్గరైతే వారిని వివాహం చేసుకుంటాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం’ అని అన్నారు.
హీరోయిన్ శ్రుతి హాసన్ తన పెళ్లిపై నిర్ణయాన్ని చెప్పారు. ‘జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పెళ్లి చేసుకోను అని చెప్పాను కానీ.. ఎప్పటికీ చేసుకోనని చెప్పలేదు కదా..! నేను రిలేషన్‌లో ఉండటాన్ని ఇష్టపడతాను. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. భవిష్యత్‌లో ఎవరైనా నా మనసుకు దగ్గరైతే వారిని వివాహం చేసుకుంటాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం’ అని అన్నారు.
దేశముదురు సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ హన్సిక ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆ తరువాత చాలా మంది యంగ్ హీరోస్ సరసన నటించి మెప్పించింది. 2022లో పారిశ్రామికవేత్తను పెళ్లాడింది. కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే హన్సిక బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ ధరించి దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
TG: సీఎం రేవంత్ రెడ్డితో రేపు ఉదయం 10 గంటలకు సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి సీఎం అపాయింట్‌మెంట్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, దిల్ రాజు, అల్లు అరవింద్, పలువురు నిర్మాతలు, దర్శకులు పాల్గొననున్నారు. ప్రభుత్వం నుంచి DY. CM భట్టి, మంత్రులు కోమటిరెడ్డి హాజరుకానున్నారు. సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించనున్నారు.
టాలీవుడ్ నటుడు జగపతి బాబు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా మరో వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. భీమవరం ఫుడ్ ఫెస్టివల్‌లో రోడ్డు పక్కనే ఉన్న బండి వద్ద ఫుడ్ ఆరగించారు జగపతిబాబు. మరికొందరు నటులతో కలిసి రోడ్ సైడ్ ఫుడ్‌ను ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్ ద్వారా షేర్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో సూపర్ హిట్ సినిమా హిట్లర్ రీరిలీజ్ కానుంది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రంభ కథానాయికగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, దాసరి నారాయణ రావు, రామిరెడ్డి కీలకపాత్రలు పోషించారు. సుమారు 28 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీరిలీజ్ అవుతోంది.
TG: జానీ మాస్టర్ కేసులో పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఈవెంట్స్ పేరుతో లేడీ కోరియోగ్రాఫర్‌ను వేరే ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక దాడులకు పాల్పడ్డట్లు నార్సింగి పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు ఛార్జీషీట్ ఫైల్ చేశారు.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ప్రముఖ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా కోసం రామ్ చరణ్ దాదాపుగా రూ.100కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇది సినిమా బడ్జెట్‌లో దాదాపు 22శాతం ఉంది. హీరోయిన్ కియారా అద్వానీ కూడా రూ.5కోట్ల నుంచి 7కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమా బడ్జెట్ రూ.450కోట్లని అంచనా.
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబోలో రాబోతున్న మూవీ ‘డాకు మహారాజ్’. 2025 జనవరి 12న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ రన్ టైం అప్‌డేట్ వచ్చింది. దీని నిడివి 2.24 గంటలు ఉండగా.. టైటిల్ కార్డు, ఎండింగ్ క్రెడిట్స్ వంటివి కలిపి 2.32 గంటల సమయం ఉంది. శ్రద్దా శ్రీనాథ్, చాందినీ చౌదరి, బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
‘అసెంబ్లీ రౌడీ’ సినిమా గురించి సీనియర్ హీరో మోహన్ బాబు ట్వీట్ చేశారు. 1991లో విడుదలైన అసెంబ్లీ రౌడీ చిత్రం తనకు కలెక్షన్ కింగ్ అనే టైటిల్ ఇచ్చిందన్నారు. ఈ సినిమా 200 రోజులు ఆడిందని, భారీ వసూళ్లు రాబట్టడంతో తనకు ఆ టైటిల్ వచ్చిందన్నారు. తన కెరీర్‌లో ఈ మూవీకి ఎంతో ప్రత్యేక స్థానం ఉందన్నాడు.
కామెడీ డిటెక్టివ్ వెన్నెల కిశోర్ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించాడనేది ఈ మూవీ కథాంశం. వెన్నెల కిషోర్ ఏడుగురు అనుమానితులను మార్క్ చేస్తాడు. మర్డర్‌లో చనిపోయింది ఎవరు? వారికి వీరితో సంబంధం ఏంటి? కేసును వెన్నెల కిశోర్ ఎలా ఛేదించాడనేది కథ. నటన, కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్, కామెడీ సీన్స్ ప్లస్. ట్విస్టులు, థ్రిల్లింగ్ మూమెంట్స్ లేకపోవడం మైనస్. రేటింగ్ 2.5/5
రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన రష్మికా మందన్న నటించనున్నట్లు తెలుస్తోంది. విజయ్ ప్రధాన పాత్రలో రాహుల్ సంకృత్యాన్ ఓ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. ఇక 2025 ఫిబ్రవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.