పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రభాస్ లుక్, యాక్టింగ్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ హల్చల్ చేస్తున్నారు. దర్శకుడు మారుతి వింటేజ్ ప్రభాస్‌ను చూపించారంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా యేళ్లుగా మిస్ అయిన ప్రభాస్‌లోని కామెడీ కోణాన్ని ఇందులో చూపించారని కామెంట్స్ చేస్తున్నారు.
ప్రభాస్ హీరోగా నటించిన ‘రాజాసాబ్’ మూవీకి షాక్ తగిలింది. టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం నిరారకరించింది. దీంతో సాధారణ ధరలకే టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మూవీ టీమ్ అభ్యర్థనను టీజీ సర్కార్ తిరస్కరించింది.
ప్రభాస్ ‘రాజాసాబ్’ ప్రీమియర్స్‌పై TG సర్కార్ నిర్ణయంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పేలా లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడంతో.. HYD బాలానగర్‌లోని విమల్ థియేటర్లో రాత్రి 10గంటలకు ఓ ప్రీమియర్ షో వేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ షోకు కేవలం మీడియా ప్రతినిధులనే అనుమతిస్తున్నట్లు తెలిపారు. APలో ప్రీమియర్స్ ప్రారంభంకానున్నాయి.
ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ రేపు విడుదలవుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ RTC X రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద అభిమానులు ప్రభాస్ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. దాన్ని 2వేల కిలోల పుష్పాలతో అలకరించారు. ఈ కార్యక్రమం ఆలిండియా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
‘DJ టిల్లు’ సినిమా దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కిస్తున్న సినిమా ‘అనుమాన పక్షి’. ఈ మూవీలో రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీలో బ్రహ్మాజీ భాగమైనట్లు తెలుపుతూ మేకర్స్ టీజర్ అప్డేట్ ఇచ్చారు. ‘బ్రహ్మోస్-ది ట్రేసర్ బుల్లెట్‌ని కలవండి. లక్ష్యాన్ని ఎప్పుడూ కోల్పోకండి. JAN 11న టీజర్ వస్తుంది. ఫిబ్రవరి 2026లో ఈ మూవీ రిలీజ్ కానుంది’ ...
కన్నడ స్టార్ యష్ హీరోగా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమా నుంచి బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. షూటింగ్ డేట్స్ పదే పదే మారడం, పారితోషికం విషయంలో స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. తన సమయానికి విలువ లేని చోట ఉండలేనని, అందుకే తప్పుకున్నానని అతడు పరోక్షంగా వెల్లడించాడు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ‘మెగా-158’ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో చిరు సరసన బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు మలయాళ స్టార్ మోహన్ లాల్ పవర్ ఫుల్ క్యామియో రోల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఓ రస్టిక్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రాబోతుందట.
సోషల్ మీడియాలో అభిమానులతో నటి, యాంకర్ అనసూయ ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘కొందరు నన్ను కొన్ని వివాదాల్లోకి లాగినప్పుడు అది డెస్టినీ అని అనుకుంటా. నేను కారణజన్మురాలినని అనుకుంటా. నేను ఏదైనా పాజిటివ్‌గా తీసుకుంటా. నా అభిప్రాయం తప్పకుండా చెబుతా’ అని తెలిపింది. ఇటీవల తన ఫ్యాన్స్ అసోసియేషన్ అంటూ వస్తున్న వ్యక్తులెవరో తనకు తెలియదని ఆమె పేర్కొంది.
‘రాజాసాబ్’ సినిమా ప్రమోషన్స్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్ బిజీగా ఉంది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ‘పవన్ కళ్యాణ్, ఉదయ్ స్టాలిన్‌లతో మీరు నటించారు. వారిద్దరూ డిప్యూటీ సీఎంలు అయ్యారు. ఇప్పుడు ప్రభాస్‌తో నటించారు. మరి ఆయన ఏమవుతారు?’ అని జర్నలిస్టు అడగ్గా.. ప్రెసిడెంట్ అవుతారని చెప్పింది. ఇక ‘రాజాసాబ్’ జనవరి 9న విడుదల...
షావోమీ అనుబంధ సంస్థ పోకో.. M8 5G పేరిట కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15, 6.76 అంగుళాల డిస్ ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్, వెనక వైపు 50MP,+2MP, ముందు వైపు 20MP కెమెరా, 5,520mah బ్యాటరీ, 45W పాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. 6GB+128GB వేరియంట్ ధరను రూ.21,999గా కంపెనీ నిర్ణయించింది.
నటి శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘చీకటిలో’. తాజాగా ఈ సినిమా OTT అప్డేట్ వచ్చింది. జనవరి 23 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి డైరెక్టర్ శరత్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించాడు.
‘ధురంధర్’ మూవీపై పశ్చిమాసియాలో నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీకి నిర్మాతల మండలి లేఖ రాసింది. ఈ చిత్రాన్ని ఎక్కడైనా రిలీజ్ చేసుకోవచ్చు.. ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిందని తెలిపింది. కానీ అక్కడ ఈ మూవీని బ్యాన్ విధించడం తమ భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేయడమేనని పేర్కొంది.
నటి శ్రీలీల 24ఏళ్లకే ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుని గొప్ప మనసు చాటుకుంది. దీనిపై శ్రీలీల స్పందించింది. దీని గురించి మాట్లాడాలంటే తనకు మాటలు రావని, భావోద్వేగానికి లోనవుతానని తెలిపింది. పిల్లలను పూర్తిగా తన బాధ్యతగా చూసుకుంటున్నానని పేర్కొంది. ‘కిస్’ మూవీ సమయంలో అనాధ పిల్లల ఆశ్రమాన్ని సందర్శించినట్లు, అక్కడి పిల్లలతో ఏర్పడిన అనుబంధమే తన జీవితాన్ని మలుపు తిప్పిందని తెలిపింది.
కన్నడ నటి రమ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. కుక్కల మనసు చదవడం కష్టమనీ, ఎప్పుడు కరిచే మూడ్‌లో ఉంటాయో చెప్పడం కష్టమన్న సుప్రీం వ్యాఖ్యలపై రమ్య స్పందించింది. ‘పురుషుల మనసును కూడా చదవడం కష్టం. ఎప్పుడు రేప్ చేస్తారో, హత్య చేస్తారో తెలియదు. అంతమాత్రాన అందరినీ జైల్లో పెట్టలేం’ అని చెప్పుకొచ్చింది. పురుషులను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ 2025లో పేరెంట్స్ అయ్యారు. పండంటి మగబిడ్డకు కత్రినా జన్మనిచ్చింది. తాజాగా వారి కుమారుడి పేరును కత్రినా దంపతులు రివీల్ చేశారు. ‘మా ప్రేమకు ప్రతిరూపం విహాన్ కౌశల్.. మేము చేసిన ప్రార్థనలకు సమాధానం దొరికింది. ఇప్పుడు మా జీవితం ఆనందంగా ఉంది’ అంటూ స్పెషల్ ఫొటోను పంచుకున్నారు. దీంతో నెటిజన్స్ వారికి కంగ్రాట్స్ చెబుతున్నారు.