నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పోస్ట్ చేశాడు. ‘నీ ఇష్టం శ్రీకాంత్’ అని నాని అన్నప్పుడల్లా, తనపై ఉన్న నమ్మకం చూసి భయమేస్తుందని అన్నాడు. ‘దసరా’ కోసం నానిని ఎంతో హింసించినా, నియమాలు ఉల్లంఘించినా ఆయన తనను ప్రోత్సహించారని తెలిపాడు. తనను నమ్మిన ‘ధరణి’కి, ఇప్పుడు నమ్ముతున్న ‘జడల్’ (ది ప్యారడైజ్)కి రుణపడి ఉంటానంటూ నానికి బర్త్ డే విషెస్ చెప్పాడు.