తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. జనవరి 30న థియేటర్లలోకి విడుదలైన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. మార్చి 4 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. కోపిష్టి ఓంకార్(తరుణ్), స్వేచ్ఛ కోరుకునే ప్రశాంతి(ఈషా)ల పెళ్లి తర్వాత వారి జీవితాల్లో ఎదురైన నాటకీయ పరిణామాల సమాహారమే ఈ మూవీ కథ.