TG: మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా BJP, BRS మధ్య ఉన్న బంధం మరోసారి బయటపడిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఇరుపార్టీలు కుమ్మక్కై ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను పంచుకున్నాయని పేర్కొన్నారు. ‘పొత్తులే ఉండవని రాష్ట్ర BJP చీఫ్ రాంచందర్ చెబుతున్నారు కానీ ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో ఏం జరిగిందో ఆయనకు తెలియదా?’ నిలదీశారు.