వరుస సినిమాలతో దూసుకెళ్తున్న నటి కీర్తి సురేష్.. ప్రస్తుతం కన్నెవెడి, రఫ్తార్ వంటి చిత్రాలతో బిజీగా ఉంది. అయితే, ఈ బ్యూటీ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ హిందీ దర్శకుడితో భారీ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా కోసం చర్చలు జరుపుతోందట. కీర్తి కెరీర్‌లో మునుపెన్నడూ చూడని సరికొత్త జానర్‌లో ఈ సినిమా ఉండబోతుందని బాలీవుడ్ వర్గాల సమాచారం.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన పెద్ది మూవీ ప్రీమియర్ షో పడింది. మూవీలో రామ్ చరణ్ బాడీ బిల్డింగ్, నటన అదిరిపోయిందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. హీరోయిన్ జాన్వీ కపూర్ అందాలు కనువిందు చేశాయన్నారు. సాంగ్స్, రామ్‌చరణ్ డ్యాన్స్ బాగున్నాయని పేర్కొన్నారు.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ‘మేజర్’ విడుదలై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా హీరో అడవి శేష్ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. సినిమా చూసి స్ఫూర్తి పొందిన ఓ 7 ఏళ్ల బాలుడు సందీప్ మ్యూజియంను సందర్శించాడని ఆయన తల్లి చెప్పినట్లు పేర్కొన్నాడు. ఈ చిత్రం ద్వారా మరికొన్ని లక్షల మందికి మేజర్ వీరత్వం తెలియడం తనకు ఎంతో గర్వకారణమని శేష్ ఆనందం వ్యక్తం చేశాడు.
రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం ఫస్ట్ హాఫ్‌తో ఆకట్టుకుంది. కథా నేపథ్యం విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో మొదలవుతుంది. ‘రై రై రా రా’ పాటలో చరణ్ డ్యాన్స్ కంటికి పండగలా అనిపిస్తుంది. జాన్వీ ఎపిసోడ్స్ పరవాలేదనిపించగా, ‘వన్ రుపీ’ క్రికెట్ సీక్వెన్స్, ఎమోషనల్ ప్రీ-ఇంటర్వెల్ సీన్స్.. సెకండ్ హాఫ్‌పై భారీ అంచనాలు పెంచేసాయి. పూర్తి రివ్యూ కోసం HIT TV న్యూస్‌ను ఫాలో...
తిరుపతిలోని శైవక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు తమన్, సినీ గాయకులు శ్రీకృష్ణ, శృతి రంజని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వీరికి అధికారులు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వారు రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు, స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. అనంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలను అందజేశారు.
‘పెద్ది’ సినిమాలో ఢిల్లీ ఎపిసోడ్ హైలైట్‌గా నిలుస్తుందని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈ ఎపిసోడ్ మొత్తం భావోద్వేగాలు, మాస్ యాక్షన్ సీన్లతో నిండి ఉంటుందని, దర్శకుడు బుచ్చిబాబు దీనిని అద్భుతంగా చిత్రీకరించారని పేర్కొన్నాడు. ఈ చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉందంటూ, షూటింగ్‌లో రామ్ చరణ్‌తో కలిసి దిగిన ఫోటోలను ఆయన పంచుకున్నాడు.
రామ్‌చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘పెద్ది’ సినిమా ప్రీమియర్ల సందడి ఈరోజు రాత్రి ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర బృందానికి పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మూవీ పెద్ద హిట్ కావాలని ఆకాంక్షిస్తూ హీరో వరుణ్‌తేజ్, నటి సమంత, దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక పోస్టులు పెట్టారు.
కడప జిల్లా జమ్మలమడుగులోని ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోటలో ‘రణబాలి’ చిత్ర షూటింగ్ సందడిగా సాగుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ చిత్రం రాయలసీమ చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతోంది. కోట ముఖద్వారం, ధాన్యాగారం వద్ద కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక్కడ ఆరు రోజుల పాటు షూటింగ్ జరగనుండటంతో గండికోట పరిసర ప్రాంతాలు సినీ కళతో కళకళలాడుతున్నాయి.
‘పెద్ది’ మూవీ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన రామ్ చరణ్ విగ్రహం తీవ్ర ట్రోలింగ్‌కు గురైంది. అది అస్సలు చరణ్‌లా లేదంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన అభిమాన సంఘం…అభిమానాన్ని చాటుకునే ప్రయత్నంలో అంచనాలు అందుకోలేక విఫలమయ్యామని పేర్కొంటూ ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పింది.
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ప్రీమియర్ షోలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్ర ప్రత్యేక ప్రదర్శనలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ‘పెద్ది’ మూవీ రివ్యూ కోసం హిట్ న్యూస్‌ని ఫాలో అవ్వండి.
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తన భాగస్వామి గౌరీ స్ప్రాట్‌ను జూలై 5న వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని ఆయన నివాసంలో అత్యంత నిరాండబరంగా, రిజిస్టర్ మ్యారేజ్ రూపంలో ఈ వేడుక జరగనుంది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యే ఈ ప్రైవేట్ వేడుకకు స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వచ్చే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల సమాచారం.
‘కన్నప్ప’ సినిమా షూటింగ్ సమయంలో తాను నాన్ వెజ్ తిన్నానని నటుడు విష్ణు చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. పాత్ర కోసం ప్రోటీన్స్ అవసరమై తిన్నానని, ఇందులో తప్పేమీ లేదని అతడు సమర్థించుకున్నాడు. అయితే, శివభక్తుడి పాత్ర పోషిస్తూ, భక్తిరస చిత్ర పవిత్రతను పాడుచేశారంటూ నెటిజన్లు, మీమ్ క్రియేటర్లు విష్ణుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం రూ.218 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకుందని సమాచారం. చరణ్ సోలో హీరోగా రూ.200 కోట్ల మార్కు దాటడం ఇది రెండోసారి. సెలవులు కలిసిరావడంతో ప్రీ-బుకింగ్స్ బాగున్నాయి. అయితే, ‘గేమ్ చేంజర్’ నష్టాల నేపథ్యంలో ఈ భారీ టార్గెట్‌ను అందుకోవడానికి ‘పెద్ది’కి హిట్ టాక్ రావడం కీలకంగా ...
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ సినిమా జూన్ 4న విడుదల కానుంది. ఇందులో నటుడు జగపతి బాబు పోషించిన ‘అప్పలసూరి’ పాత్ర ప్రోస్థటిక్ మేకప్ మేకింగ్ వీడియో వైరల్‌గా మారింది. ఈ మేకోవర్‌తో బయట తిరిగినా జనం గుర్తుపట్టలేదని, తన కెరీర్‌లోనే ఇది బెస్ట్ రోల్ అవుతుందని జగపతి బాబు ఆనందం వ్యక్తం చేశాడు.