నటి తమన్నా తన ఆర్థిక క్రమశిక్షణ రహస్యాన్ని పంచుకుంది. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే డబ్బు ఆదా చేయడం, పెట్టుబడులు పెట్టడం అవసరమని ఆమె సూచించింది. తన తండ్రి మార్గనిర్దేశం వల్లే వ్యాపార రంగంలో రాణిస్తున్నట్లు తెలిపింది. సినీ రంగంలో ఆదాయం ఎప్పుడూ ఒకేలా ఉండదని, ముందుచూపు లేకపోతే చివరకు ఏమీ మిగలదని హెచ్చరించింది. ప్రస్తుతం ఆమె ‘పురుషన్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉంది.