‘లిటిల్ హార్ట్స్’ మూవీతో యువ నటుడు మౌళి తనూజ్ భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ క్రేజ్‌తో ఆయనకు బంపర్ ఆఫర్ తలుపు తట్టినట్లు టాక్. ‘పుష్ప 2’ వంటి భారీ చిత్రాలను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో మౌళి తన తదుపరి ప్రాజెక్టును ఖరారు చేసుకున్నట్లు సమాచారం. రెండో మూవీకే ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లో అవకాశం రావడం విశేషం. ఈ మూవీని ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నాడట.