వంశీ తుమ్మల, సంధ్య వశిష్ఠ జంటగా వినయ్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీచిదంబరంగారు’. ఈనెల 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇవాళ్టి నుంచి ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. దర్శకుడు వేణు ఈ సినిమాపై మాట్లాడుతూ ‘నిజమైన వైకల్యం అంటే శరీరానికి ఉన్నది కాదు, వ్యక్తిత్వం లేకపోవడమే అని ఈ సినిమాలో హృద్యంగా చూపించారు’ అని పేర్కొన్నారు.