నందమూరి కళ్యాణ్ రామ్ తన తదుపరి ప్రాజెక్టును దర్శకుడు శ్రీకాంత్ విస్సాతో చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబో ఇప్పటికే లాక్ అయిందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ 2026 ద్వితీయార్థంలో ప్రారంభం కానుందట. అదే ఏడాది చివరి నాటికి సినిమాను థియేటర్లలో విడుదల చేసేలా మేకర్స్ పక్కా ప్లాన్‌తో సిద్ధమవుతున్నట్లు సమాచారం.