ఏపీ మంత్రివర్గంలోకి జనసేన నేత నాగబాబును తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగబాబుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతుంది. ఈ క్రమంలో ‘మంత్రి పదవికి మీరు అర్హులు సార్’ అంటూ తాజాగా బేబి మూవీ నిర్మాత SKN ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో కలెక్షన్స్ విషయంలో తగ్గేదే లే అంటుంది. అక్కడ మూడు రోజుల్లో $8 మిలియన్ల మార్క్‌ను దాటేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ సరికొత్త పోస్టర్ షేర్ చేశారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించగా.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.
మంచు ఫ్యామిలీలో విభేదాలు తలెత్తి మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. మనోజ్ ఏకంగా గాయాలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన తండ్రి మోహన్ బాబుపై ఫిర్యాదు చేసినట్లు వార్తలొచ్చాయి. దీనిపై స్పందించిన మంచు ఫ్యామిలీ.. ఆ వార్తల్లో నిజం లేదని చెప్పింది. కొన్ని మీడియా సంస్థలు ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేస్తున్నాయంది. దయచేసి తప్పుడు ప్రచారాలు చేయకండి అంటూ ప్రకటన విడ...
నేషనల్ క్రష్ రష్మికా మందన్న ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’. రేపు రష్మిక పాత్రకు సంబంధించిన టీజర్ విడుదల కానుంది. అయితే రేపు ఉదయం 11.07లకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ దీన్ని విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. గీత ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ,...
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ సినిమాలో హీరో రవితేజ భాగం కాబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన తన వాయిస్ ఓవర్‌తో బాలయ్య పాత్రను పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది మూవీపై హైప్‌ను పెంచుతుందని మేకర్స్ భావిస్తున్నారట. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ సిని...
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ కొంతకాలం సంగీతానికి దూరంగా ఉండబోతున్నట్లు, ఆయన మ్యూజిక్‌ను మిస్ అవ్వాల్సిందేనా? అంటూ వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిపై స్పందించిన ఆయన కుమార్తె ఖతీజా.. ఆ వార్తలను ఖండించింది. దయచేసి అసత్య ప్రచారాన్ని ఆపండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అంటూ ఇలా రాయడం కరెక్ట్ కాదని పేర్కొంది.
‘రాబిన్‌హుడ్’ సినిమా హిట్ కావాలంటూ డైరెక్టర్ వెంకీ కుడుములను ఓ అభిమాని రిక్వెస్ట్ చేశాడు. ‘వెంకీ అన్నా.. నితిన్‌కు కొన్ని ఫ్లాప్స్ తర్వాత బీష్మతో మంచి హిట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ లేటైనా ఫర్వాలేదు.. మాకు హిట్ కావాలి’ అని అతను సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేశాడు. దీనిపై స్పందించిన వెంకీ.. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకంగా ఉన్నామని రిప్లై ఇచ్చారు. ఈ సినిమా క...
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచుస్తున్నారు. ఈ క్రమంలో మూవీపై సాలిడ్ న్యూస్ బయటకొచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్ మూడో వారం తర్వాత ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరగనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఆ దిశగా రాజమౌళి టీం పనిచేస్తోందట. జనవరి నుం...
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ‘RC-16’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌పై సాలిడ్ న్యూస్ వచ్చింది. మైసూర్‌లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాగా.. చరణ్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, సత్యలపై కొన్ని సీన్స్ షూట్ చేశారట. తాజాగా టీం మైసూర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు సమాచారం. ఇక్కడి భూత్ బంగ్లాలో చిత్రీకరణ జరగనున్నట్లు తెలుస్తోంది. మరి ఇక్కడ ఎలాంటి సీన్స్ ...
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2లో శ్రీలీల ‘కిస్సిక్’ అనే ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఇది తన కెరీర్‌లోని తొలి ఐటెం సాంగ్. ఈ క్రమంలో శ్రీలీల కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే చివరి స్పెషల్ సాంగ్ కావాలని భావిస్తుందట. ‘ఐటెం గర్ల్’ అనే పేరు రాకుండా ఇలాంటి అవకాశాలు వస్తే నో చెప్పాలని ఫిక్స్ అయిందట. కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి పాటలు చేస్తే.....
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, జూ. ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మూవీ ‘వార్ 2’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో ఆయన గెస్ట్ రోల్‌లో కనిపిస్తారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ‘వార్ 2’కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్...
తమిళ హీరో అజిత్ కుమార్, దర్శకుడు తిరుమేని కాంబోలో తెరకెక్కిన సినిమా ‘విడాముయార్చి’. తాజాగా అజిత్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తి చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో త్రిష, రెజీనా సంజయ్ దత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
అల్లరి నరేష్ సుబ్బు మంగదేవి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా బచ్చలమల్లి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 20 ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ నుంచి 9వ తేదీన మూడో పాట రాబోతున్నట్లు ప్రకటించారు. దీని కోసం తుని క్రీడా వికాస కేంద్రం, బచ్చలమల్లి టీం మధ్య క్రికెట్ మ్యాచ్ జరగబోతున్నట్లు తెలిపారు. అందులో గెలిచిన వారు పాటను విడుదల చేయనున్నట్లు తెలుపుతూ పోస్టర్&z...