అస్వస్థతతో మోహన్ బాబు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన హెల్త్ బులిటెన్ విడుదలైంది. ‘మోహన్ బాబు ఎడమ కన్ను కింద గాయమైంది. అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. మోహన్ బాబు మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఆయన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయనకు చికిత్స కొనసాగుతోంది. మరో రెండు రోజులు వైద్యుల పర్యవేక్షణ అవసరం’ అని బులిటెన్‌లో డాక్టర్లు పేర్కొన్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు పేర్కొంటున్నారు. కాగా, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆస్తుల కోసం మా నాన్నతో గొడవ పడుతున్నాననేది వాస్తవం కాదని మంచు మనోజ్ అన్నారు. ‘సొంతంగా వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటున్నాను. ఆదాయం కోసం ఇంటి వాళ్ల మీద ఆధారపడలేదు. మా నాన్న ఇలా ఉండేవారు కాదు.. ఇవాళ చూస్తున్నది మా నాన్న కాదు’ అంటూ ఆవేదనకు గురయ్యారు. కాగా.. ఇవాళ పోలీసుల విచారణలో భాగంగా సీపీ ముందు హాజరుకానున్న మనోజ్.. మిగతా విషయాలు విచారణ తర్వాత వెల్లడిస్తానని పేర్కొన్నారు.
2025లో తనను ప్రేమించే భాగస్వామి కావాలని సమంత కోరుకున్నారు. వచ్చే ఏడాదిలో తనకేం కావాలో తెలుపుతూ విష్ లిస్ట్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ‘ఏడాది మొత్తం చాలా బిజీగా ఉండాలి. నటనను ఇంకా మెరుగుపర్చుకోవాలి. ఆర్థికంగా బలంగా ఉండాలి. మరిన్ని అవకాశాలు సొంతం చేసుకోవాలి. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న లక్ష్యాలను పూర్తి చేయాలి. మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్‌గా ఉండాలి. పిల్లలు కావాలి’ అంటూ ...
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఖరారైంది. ‘ఫంకీ’ అనే టైటిల్ పెట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ మరో సినిమా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో ఓ మూవీ చేయబోతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ నిర్మించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇండస్ట్రీలో తనకు ఎవరూ మద్దతు ఇవ్వడం లేదని బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ చెప్పారు. ఇటీవల ‘భూల్ భూలయ్య 3’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన తాజాగా ఇంటర్వ్యూలో.. తాను ఒంటరిగా పోరాడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, తనకు ప్రేక్షకుల ప్రేమాభిమానాలు చాలన్నారు. వారి సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించగలనని పేర్కొన్నారు.
టాలీవుడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన సినిమా ‘రాబిన్‌హుడ్’. ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. అయితే ఈ మూవీ నుంచి ‘అదిదా సర్ప్రైజ్’ అనే ఐటెం సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ పాట విడుదల వాయిదా పడింది. టెక్నికల్ సమస్య వల్ల దీన్ని వాయిదా వేసినట్లు మేకర్స్ తెలిపారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్...
ప్రభాస్ నటించిన ‘కల్కి’ని బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నటించిన ‘స్త్రీ 2’ బీట్ చేసింది. తాజాగా 2024లో గూగుల్‌లో ఎక్కువ సెర్చ్ చేసిన సినిమాల లిస్ట్ విడుదలైంది. దీంట్లో టాప్ టెన్‌లో మొదటి స్థానంలో ‘స్త్రీ 2’ నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ‘కల్కి’ సినిమా ఉంది. అలాగే గ్లోబల్ లెవల్లో గూగుల్‌లో అత్యధికంగా వెతికిన నటీనటుల జాబితాలో పవన్ ...
ఇకపై తనను ‘కడవులే.. అజితే’ అని పిలవడం ఆపాలని తమిళ స్టార్ హీరో అజిత్ అభిమానులను కోరాడు. తనను అలా అనడం ఇబ్బందిగా ఉంటుందని తెలిపాడు. తన పేరు ముందు ఎలాంటి పదాలను ఉంచి పిలవొద్దని సూచించాడు. కాగా, కడవులే.. అంటే తమిళంలో దేవుడని అర్థం. ప్రస్తుతం అజిత్.. తిరుమేని దర్శకత్వంలో ‘విడాముయార్చి’ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
జీ తెలుగు: నాగవల్లి (9AM), ప్రతినిధి (11PM); ఈటీవీ: సుస్వాగతం (9AM); జెమినీ: సింహరాశి (8.30AM), బద్రి (3PM); స్టార్ మా మూవీస్: ఏ మంత్రం వేశావె (7AM), జై భజరంగి (9AM), విశ్వాసం (12PM), కృష్ణార్జున యుద్ధం (3PM), ప్రసన్నవదనం (6PM), సింగం (9PM); జీ సినిమాలు: యువకుడు (7AM), కొంచెం ఇష్టం కొంచెం కష్టం (9AM), జయం మనదేరా! (12PM), మిరపకాయ్ (3PM), చక్రం (6PM), రామయ్యా వస్తావయ్యా (9PM).
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ షెడ్యూల్లో పవన్ కూడా పాల్గొంటున్నాడు. ఈ మేరకు చిత్ర బృందం పవర్‌స్టార్ వర్కింగ్ స్టిల్‌ను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసింది. కాగా ఈ మూవీ మార్చి 28న విడుదల కానుంది.
నటుడు జోజూ జార్జ్, అభినయ ప్రధాన పాత్రల్లో ‘పని’ మూవీ తెరకెక్కింది. ఈ మూవీకి జోజూ జార్జ్నే దర్శకత్వం వహించారు. తాజాగా ఈనెల 13న థియేటర్లలో తెలుగు వర్షన్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జోజూ జార్జ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మలయాళంతో పాటు తమిళం, తెలుగు భాషల్లో పలు సినిమాలు చేశాడు. గతంలో తెలుగులో ‘ఆదికేశవ’ ...
పుష్ప-2 సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తరువాత దర్శకుడు సుకుమార్ లాంగ్ గ్యాప్ తీసుకోనున్నారు. కానీ బన్నీ మాత్రం ఎక్కువ గ్యాప్ తీసుకోవట్లేదనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.తన నెక్ట్స్ మూవీ త్రివిక్రమ్‌తో తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన పనులు వచ్చే ఏడాది మార్చ్‌లోనే మొదలు పెట్టేస్తారన్న రూమర్స్ వినిపిస్తున్నాయి.
హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ‘గేమ్ ఛేంజర్’ మూవీ రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ 30 రోజుల్లో థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు తెలుపుతూ రామ్ చరణ్ పోస్టర్‌ను విడుదల చేశారు. మెగా మాస్ మేనియా వచ్చేస్తుంది. థియేటర్స్‌లో కలుద్దాం అనే క్యాప్షన్ జత చేశారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.