నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబోలో రాబోతున్న మూవీ ‘డాకు మహారాజ్’. ఈ సినిమాలు ముగ్గురు యంగ్ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టి, విశ్వక్ సేన్ అతిథి పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. బాలయ్యతో వీరికి మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది.
ప్రముఖ హీరోయిన్ అక్షర గౌడ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తన బిడ్డకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘తల్లి డ్యూటీ చేస్తూ.. ఎన్నో కోరికలను కోరుతూ 2024వ సంవత్సరాన్ని ముగిస్తున్నాం. తనకి బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాను’ అంటూ తన భర్తను ఉద్దేశిస్తూ రాసుకొచ్చింది. ఇక అక్షర తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ భాషల్లో నటించింది. తెలుగులో మాస్ కా దమ్కీ, హరోం హర వంటి సినిమా...
‘పుష్ప 2’ కారణంగా హాలీవుడ్ హిట్ మూవీ ‘ఇంటర్‌స్టెల్లార్’ రీ రిలీజ్ వాయిదా పడిందని వస్తోన్న విమర్శలపై నటి జాన్వీ కపూర్ స్పందించారు. ‘పుష్ప 2’కు సపోర్ట్ చేశారు. ఈ మూవీ కూడా సినిమానే కదా.. ఎందుకు మరొకదానితో దీన్ని పోలుస్తూ తక్కువ చేస్తున్నారని మండిపడ్డారు. ‘హాలీవుడ్ వాళ్లే మన మూవీలను ప్రశంసిస్తుంటే.. మనం మాత్రం మన మూవీలను తక్కువ చేసుకుంటూ మనల్ని మనమే అ...
తిరుమలలో ‘కలర్ ఫోటో’ డైరెక్టర్ సందీప్ రాజ్, నటి చాందినీ రావు పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వేడుకకు నటుడు సుహాస్ దంపతులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ‘కలర్ ఫోటో’ షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. నవంబర్‌లో సందీప్, చాందినీల ఎంగేజ్‌మెంట్ జరిగింది.
తన సినిమాల్లో తల్లి పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వరంటూ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా వీటిపై సందీప్ స్పందించారు. నిజ జీవితంలో తాను తల్లితోనే ఎక్కువ చనువుగా ఉంటానని చెప్పారు. తమ బంధంలో ఎలాంటి సమస్యలు లేకపోవడం వల్లే సినిమాల్లో ఆ డ్రామాను తీసుకురాలేకపోతున్నాని తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ దర్శకుడు జయభారతి(77) అనారోగ్యంతో కన్నుమూశారు. మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్ కారణంగా చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక 1979లో క్రౌడ్ ఫండింగ్ విధానంలో ‘కుడిసై’ సినిమాను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినీ జీవితంలో కేవలం 9...
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ‘విశ్వంభర’. సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా మేకర్స్.. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక UV క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్&zwn...
మెగా హీరో సాయి ధరమ్ ప్రధాన పాత్రలో దర్శకుడు రోహిత్ కేపీ ‘SDT18’ మూవీని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. డిసెంబర్ 12న మూవీ టైటిల్‌ను రివీల్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే గ్లింప్స్ కూడా విడుదల చేస్తున్నట్లు పోస్టర్ షేర్ చేశారు. ఇక ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథాన...
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మికా మందన్న ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’. తాజాగా ఈ సినిమాలోని రష్మిక పాత్రకు సంబంధించిన టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 9న దీన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక రష్మిక నటించిన ‘పుష్ప 2’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మొదటి రోజే రూ.294 కోట్లు రాబట్టింది. దీంతో ఇప్పటివరకూ ఏ భారతీయ సినిమా సాధించని విధంగా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా రూ.294 కోట్ల గ్రాస్ రాబట్టి సరికొత్త రికార్డులను సెట్ చేసింది. కాగా, అంతకుముందు ఇండియాలో ఇప్పటివరకు మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ‘RRR’ రూ.233 కోట్ల గ్రాస్‌తో మొదటి స్థానంలో ఉంది. తాజాగా ఆ రికార్డును ...
జీ తెలుగు: బొమ్మరిల్లు (9AM), గ్రీకువీరుడు (11PM); ఈటీవీ: ఆడుతూ.. పాడుతూ (9AM); జెమినీ: ఆర్య 2 (8.30AM), పందెంకోడి (3PM); స్టార్ మా: పుష్ప (9AM), రఘువరన్ బీటెక్ (10:30PM); స్టార్ మా మూవీస్: అనుభవించు రాజా (7AM), రాజా రాణి (9AM), ది ఘోస్ట్ (12PM), దూకుడు (3PM), క్రాక్ (6PM), మంగళవారం (9PM); జీ సినిమాలు: చీకటి (7AM), బాబు బంగారం (9AM), డిమోంటి కాలనీ 2 (12PM), W/O రణసింగం (3PM), […]
‘పుష్ప 2’ సినిమా పైరసీపై చిత్రబృందం స్పందించింది. పైరసీ కనిపిస్తే వెంటనే తెలపాలని మేకర్స్ విజ్ఞప్తి చేశారు. మెయిల్ ఐడీ claims@antipiracysolutions.org , వాట్సాప్ నంబరు 8978650014 ద్వారా తెలియజేయొచ్చని రిక్వెస్ట్ చేశారు. అలాగే నకిలీ డైలాగ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పుష్ప-2లోవి అని చెబుతున్నారని, అలా చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నటసిహం బాలయ్య-ప్రగ్యా జైస్వాల్ జంటగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డాకు మహారాజ్. ఈ సినిమాపై ప్రస్తుతం ఓ క్రేజీ బజ్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఆడియెన్స్‌ను థ్రిల్ చేసేందుకు క్యామియో ఎపిసోడ్స్ ఉంటాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్‌లోని యంగ్ హీరోలు డాకు మహారాజ్‌లో ప్రేక్షకులకు సర్ప్రైజ్ చేయనున్నారట.
పుష్ప-2 మ్యూజిక్ విషయంలో సంగీత దర్శకుడు శ్యామ్ సీఎస్ చేసిన కామెంట్లు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ‘ సినిమా మొత్తానికి నేనే సంగీతం అందించా. DSP సంగీతంలో మేకర్స్ కొంత భాగం ఉంచినప్పటికీ.. క్లైమాక్స్ ఫైట్‌తో పాటు బీజీఎంలో 90శాతం క్రెడిట్ నాదే. ఈ మూవీ కోసం పైపు పరికరాలను ఉపయోగించాను’ అని చెప్పుకొచ్చాడు. కానీ సినిమాDSPదేనని, పనులు త్వరగా ముగించాల్సి రావడంతో తనను టీంలోకి తీసుకున్న...