• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

రూ.1000 కోట్ల వసూళ్లలో టాలీవుడ్ టాప్

రూ.1000 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన మూవీల లిస్టులో 4 సినిమాలతో టాలీవుడ్ టాప్‌ 1లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో బాలీవుడ్ 3 మూవీలతో, కన్నడ ఒక సినిమాతో నిలిచింది. తెలుగులో బాహుబలి-2 రూ.1810 కోట్లు, RRR రూ.1390 కోట్లు, కల్కి రూ.1200 కోట్లు, పుష్ప-2 రూ.1002 కోట్లు+ వసూళ్లు సాధించాయి. హిందీలో దంగల్ రూ.2000 కోట్లు, జవాన్ రూ.1148 కోట్లు, పఠాన్ రూ.1020 కోట్లు వసూళ్లు చేశాయి. కన్నడలో KGF-2 రూ.1250 కో...

December 12, 2024 / 11:28 AM IST

ధనుష్‌తో వివాదంపై నయనతార కామెంట్స్

నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన నయనతార డాక్యుమెంటరీ విషయంలో నటి నయనతార, ధనుష్ మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో ధనుష్ తీరుపై తాను రిలీజ్ చేసిన బహిరంగ లేఖపై నయనతార క్లారిటీ ఇచ్చింది. ‘న్యాయమని నమ్మిన దాన్ని బయటపెట్టడానికి నేను ఎందుకు భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి. నానుమ్ రౌడీ ధాన్‌ వీడియో క్లిప్స్‌కు సంబంధించిన NOC కోసం ధనుష్‌ను కలవడానికి ఎంతో ప్రయత్నించాం. కానీ అది జరగలేదుR...

December 12, 2024 / 11:14 AM IST

నార్త్ అమెరికాలో ‘పుష్ప 2’ నయా కలెక్షన్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే. నార్త్ అమెరికాలో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. అక్కడ ఇప్పటి వరకు ఈ సినిమా $10.9 మిలియన్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్య...

December 12, 2024 / 11:00 AM IST

‘స్వయంభూ’లో నభా నటేష్ కొత్త లుక్..!

టాలీవుడ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న సినిమా ‘స్వయంభూ’. ఈ సినిమాలో నభా నటేష్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తాజాగా నభా నటేష్ పాత్రను మేకర్స్ రివీల్ చేశారు. ఈ మూవీలో ఆమె సుందర వల్లి పాత్రలో కనిపిస్తున్నట్లు పోస్టర్ షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది.

December 12, 2024 / 10:25 AM IST

OTTలోకి వచ్చేసిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌

యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘రోటీ కపడా రొమాన్స్’ మూవీ నవంబర్ 28న థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమాలో సందీప్ సరోజ్, సుప్రజ్, హర్ష నర్రా, తరుణ్ పొనుగంటి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

December 12, 2024 / 09:51 AM IST

బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలేకు అల్లు అర్జున్..!

ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్-8 ప్రస్తుతం స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోంది. సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ షో ముగింపు దశకు చేరుకుంది. ఈనెల 15న దీని గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సీజన్‌లో టాప్ 5లో నిఖిల్, ప్రేరణ, నబీల్, గౌతమ్, అవినాష్ నిలిచారు. మరి వీరిలో ఎవరు విన్నర్ అవుతారని అనిపిస్త...

December 12, 2024 / 09:39 AM IST

నెట్‌ఫ్లిక్స్‌లో ‘లక్కీ భాస్కర్’ హవా..!

మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. OTTలో ఈ సినిమా హవా కొనసాగుతోంది. సదరు సంస్థలో ఈ చిత్రం రెండు వారాలుగా టాప్ 2లో గ్లోబల్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటివరకు ఏకంగా 17.8 బిలియన్ మినిట్స్ వ్యూస్‌ దక్కించుకుంది. ఇక దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. అక్టోబ...

December 12, 2024 / 09:16 AM IST

రూమర్స్‌పై స్పందించిన సాయిపల్లవి

నటి సాయిపల్లవి ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’లో సీతగా నటిస్తోంది. అయితే, ఈ సినిమా పూర్తయ్యేవరకు సాయిపల్లవి మాంసాహారం మానేశారని, విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా వంట వాళ్లను వెంట తీసుకెళ్తున్నారని వస్తున్న వార్తలపై ఆమె స్పందించింది. ఇలాంటి నిరాధారమైన వార్తలు రాస్తే లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

December 12, 2024 / 09:01 AM IST

ఇవాళ ‘బచ్చల మల్లి’ నుంచి మూడో సాంగ్ రిలీజ్

డైరెక్టర్ సుబ్బు మంగదేవి దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా నటించిన సినిమా ‘బచ్చల మల్లి’. ఈ నెల 20న ఇది రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి మూడో పాట ‘మరీ అంత కోపం’ ఇవాళ సాయంత్రం 5.04 గంటలకు విడుదల కానుంది. డైరెక్టర్ హను రాఘవపూడి దీన్ని రిలీజ్ చేయనున్నారు. ఇక హాస్య మూవీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో అమృత అయ్యర్ కథానాయికగా నటించింది.

December 12, 2024 / 08:46 AM IST

నా చిత్రాల హిట్‌కు ఇదే కారణం: నయనతార

తన సినిమాలు హిట్ అవ్వడానికి కారణం తన అభిమానులని స్టార్ హీరోయిన్ నయనతార పేర్కొంది. తనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారని పేర్కొంది. ఇండస్ట్రీలో ఉన్న సూపర్ స్టార్‌ల అభిమానులందరూ తనని ఇష్టపడతారని తెలిపింది. అందుకే తన చిత్రాలను ఆదరిస్తారని చెప్పుకొచ్చింది.

December 12, 2024 / 08:39 AM IST

ఆ భయం నీకెందుకు: మంచు లక్ష్మి

మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంచు లక్ష్మి ‘PEACE’ అనే క్యాప్షన్‌‌తో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా.. తాజాగా ఆ భయం నీకెందుకు అంటూ ఎక్స్‌‌లో పోస్ట్ పెట్టింది. ‘ఈ ప్రపంచంలో ఏదీ నీది కానప్పుడు.. ఎదో కోల్పోతున్నావనే భయం నీకెందుకు’ అంటూ మెసేజ్ పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

December 12, 2024 / 08:27 AM IST

‘పుష్ప 2’ ఈవెంట్‌పై కామెంట్స్‌.. సిద్ధార్థ్‌ క్లారిటీ

పాట్నాలో జరిగిన ‘పుష్ప 2’ ఈవెంట్‌పై హీరో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చాడు. తాను చేసిన కామెంట్స్ తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పాడు. అల్లు అర్జున్‌పై తనకు ఎలాంటి ద్వేషం లేదని, పుష్ప-2 విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ఇండస్ట్రీ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలని, నిర్మాతలకు మంచి జరగాలన్నాడు. కళాకారుల క...

December 12, 2024 / 07:42 AM IST

రామ్ చరణ్ కోసం అల్లు అర్జున్..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. వచ్చే ఏడాది జనవరి 10న ఇది విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండ...

December 12, 2024 / 07:17 AM IST

చైనాలో భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ‘మహారాజా’

విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజా’ మూవీ చైనా భారీ వసూళ్లను రాబడుతోంది. నవంబర్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం 12 రోజుల్లోనే 70 కోట్లను వసూలు చేసింది. డ్రాగన్ దేశంలో ఇటీవల కాలంలో ఏ భారతీయ సినిమా సాధించలేని వసూళ్లతో దూసుకుపోతుంది. దీంతో చైనా మార్కెట్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన 13వ భారతీయ చిత్రంగా నిలిచింది.

December 12, 2024 / 06:25 AM IST

చైనాలో మహారాజా’కు భారీ వసూళ్లు

విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజా’ మూవీ చైనా భారీ వసూళ్లను రాబడుతోంది. నవంబర్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం 12 రోజుల్లోనే 70 కోట్లను వసూలు చేసింది. డ్రాగన్ దేశంలో ఇటీవల కాలంలో ఏ భారతీయ సినిమా సాధించలేని వసూళ్లతో దూసుకుపోతుంది. దీంతో చైనా మార్కెట్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన 13వ భారతీయ చిత్రంగా నిలిచింది.

December 12, 2024 / 06:25 AM IST