రౌడీ బేబి సాయి పల్లవి తప్పుడు వార్తలు రాసే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రామాయణం’ సినిమా కోసం శాకాహారిగా మారారు అంటూ వస్తున్న రూమర్ల పై ఆమె ఘాటుగా స్పందించారు. ”మౌనంగా ఉన్నానని ఇష్టం వచ్చింది రాస్తే ఊరుకునేది లేదు.. ఇంకోసారి నిరాధారమైన వార్తలు ప్రచురిస్తే ఎవరైనా సరే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
బాలయ్య హీరోగా నటిస్తున్న ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు ముస్తాబు అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి పాటలను మేకర్స్ విడుదల చేయబోతున్నారు. ఫస్ట్ సాంగ్‌ను ఈనెల 14న ఉ.10:08 గంటలకు విడుదల చేయనున్నట్లు స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. దీంతో మూవీ టీం సక్సెస్ మీట్ నిర్వహించేందుకు హస్తినాకు పయనమయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం పుష్పరాజ్ తన తల్లి నిర్మలతో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దీనికి ఎంత అందమైన ఉదయం.. బిగ్ డే.. అందమైన ప్రారంభం అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప 2’ సినిమా హిందీలో సాలిడ్ వసూళ్లతో దూసుకెళ్తోంది. అక్కడ ఏడవ రోజు ఈ సినిమా రూ.30 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. దీంతో బాలీవుడ్లో ఈ సినిమా కేవలం వారంలోనే రూ.400 కోట్ల క్లబ్లో చేరింది. దీంతో అక్కడ అతి వేగంగా ఈ ఘనత సాధించిన మూవీగా ఇది రికార్డు సృష్టించింది.
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకున్నారు. ఇవాళ గోవాలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో తన ప్రియుడు ఆంటోనీతో ఏడడుగులు వేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు కొత్త జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా స్పందించింది. ఈ విషయంలో ఎలాంటి నిజం లేదని, ఇలాంటి రూమర్స్ ఎన్నిసార్లు ప్రచారం చేస్తారని కామెంట్ చేసింది. తాను కేవలం బరువు మాత్రమే పెరిగానని ప్రెగ్నెన్సీ వార్తలు పూర్తి అవాస్తవమని తెలిపింది.
బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా నటించిన ‘డాన్’ 2006లో విడుదలైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక.. ఈ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఈ మూవీ సెట్లోకి అడుగుపెట్టిన తర్వాత కొన్ని విషయాలు తెలుసుకున్నా. నా పనిపై నేను ఫోకస్ పెట్టాలని, తోటి నటీనటులు, దర్శకులతో ఉన్న రిలేషన్‌ను మర్చిపోవాలని అర్థమైంది. డాన్ కోసం ఫైట్స్‌లో శిక్షణ తీసుకున్నా. రక్తం ...
మంచు మోహన్ బాబు ఇంట్లో గత రెండు రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ గొడవలకు బ్రేక్ ఇచ్చి.. తాను నటిస్తున్న ‘భైరవం’ సినిమా షూటింగ్‌కు వెళ్లారు. ఆయనతో పాటు ఈ చిత్రంలో నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
సినీ నటుడు సత్యదేవ్ హీరోగా నటించిన ‘జీబ్రా’ మూవీ నవంబర్ 22న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTT అప్డేట్ వచ్చింది. దీని డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ OTT సంస్థ ‘ఆహా’ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే దీన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఇక ఈ మూవీకి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. వచ్చే ఏడాది జనవరి 10న విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తనకెంతో స్పెషల్ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కియారా అద్వానీ చెప్పారు. ఈ చిత్రం కోసం మూడేళ్ల నుంచి కష్టపడుతున్నట్లు వెల్లడించారు. దీని షూటింగ్ సమయంలోనే తనకు పెళ్లి జరిగిందని, ఈ మూవీ రిలీజ్ కోసం ఎంతో ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. వచ్చే ఏడాది జనవరి 10న విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తనకెంతో స్పెషల్ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కియారా అద్వానీ చెప్పారు. ఈ చిత్రం కోసం మూడేళ్ల నుంచి కష్టపడుతున్నట్లు వెల్లడించారు. దీని షూటింగ్ సమయంలోనే తనకు పెళ్లి జరిగిందని, ఈ మూవీ రిలీజ్ కోసం ఎంతో ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యూమెంటరీ వివాదం విషయంలో నటి నయనతారకు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తన అనుమతి తీసుకోకుండా ఈ సిరీస్‌లో ‘నానుమ్ రౌడీ ధాన్’ సన్నివేశాలను ఉపయోగించారంటూ ధనుష్ ఇటీవల కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ అంశంపై జనవరి 8 లోపు వివరణ ఇవ్వాలని నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్, నెట్‌ఫ్లిక్స్...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ‘X’లో స్పెషల్ పోస్ట్ పెట్టారు. తన తల్లి నిర్మలతో దిగిన ఫొటోను షేర్ చేశారు. దీనికి ‘అందమైన ఉదయం. ఆహ్లాదంగా ప్రారంభమైంది. బిగ్ డే’ అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రముఖ నటి సోనియా అగర్వాల్, స్మృతి వెంకట్ ప్రధాన పాత్రల్లో నటించిన హర్రర్ సినిమా ‘7/G ది డార్క్ స్టోరీ’. ఈ ఏడాది జూలై 5న థియేటర్లలో రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTTలో వచ్చేసింది. ప్రస్తుతం ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మేరకు మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు.
నేషనల్ క్రష్ రష్మికా మందన్న తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కలిసి పని చేసిన హీరోల గురించి మాట్లాడారు. విజయ్‌కు తాను వీరాభిమానిని అని.. ఆయన అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ.. ఆయన తనకు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తుంటారని, విక్కీ కౌశల్ గొప్ప యాక్టర్ అని పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ చాలా సరదాగా ఉండే వ్యక్తి అని తెలిపారు.