సినీ నటుడు సత్యదేవ్ హీరోగా నటించిన ‘జీబ్రా’ మూవీ నవంబర్ 22న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTT అప్డేట్ వచ్చింది. దీని డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ OTT సంస్థ ‘ఆహా’ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే దీన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఇక ఈ మూవీకి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. వచ్చే ఏడాది జనవరి 10న విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తనకెంతో స్పెషల్ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కియారా అద్వానీ చెప్పారు. ఈ చిత్రం కోసం మూడేళ్ల నుంచి కష్టపడుతున్నట్లు వెల్లడించారు. దీని షూటింగ్ సమయంలోనే తనకు పెళ్లి జరిగిందని, ఈ మూవీ రిలీజ్ కోసం ఎంతో ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. వచ్చే ఏడాది జనవరి 10న విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తనకెంతో స్పెషల్ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కియారా అద్వానీ చెప్పారు. ఈ చిత్రం కోసం మూడేళ్ల నుంచి కష్టపడుతున్నట్లు వెల్లడించారు. దీని షూటింగ్ సమయంలోనే తనకు పెళ్లి జరిగిందని, ఈ మూవీ రిలీజ్ కోసం ఎంతో ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యూమెంటరీ వివాదం విషయంలో నటి నయనతారకు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తన అనుమతి తీసుకోకుండా ఈ సిరీస్‌లో ‘నానుమ్ రౌడీ ధాన్’ సన్నివేశాలను ఉపయోగించారంటూ ధనుష్ ఇటీవల కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ అంశంపై జనవరి 8 లోపు వివరణ ఇవ్వాలని నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్, నెట్‌ఫ్లిక్స్...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ‘X’లో స్పెషల్ పోస్ట్ పెట్టారు. తన తల్లి నిర్మలతో దిగిన ఫొటోను షేర్ చేశారు. దీనికి ‘అందమైన ఉదయం. ఆహ్లాదంగా ప్రారంభమైంది. బిగ్ డే’ అని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రముఖ నటి సోనియా అగర్వాల్, స్మృతి వెంకట్ ప్రధాన పాత్రల్లో నటించిన హర్రర్ సినిమా ‘7/G ది డార్క్ స్టోరీ’. ఈ ఏడాది జూలై 5న థియేటర్లలో రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTTలో వచ్చేసింది. ప్రస్తుతం ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మేరకు మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు.
నేషనల్ క్రష్ రష్మికా మందన్న తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కలిసి పని చేసిన హీరోల గురించి మాట్లాడారు. విజయ్‌కు తాను వీరాభిమానిని అని.. ఆయన అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ.. ఆయన తనకు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తుంటారని, విక్కీ కౌశల్ గొప్ప యాక్టర్ అని పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ చాలా సరదాగా ఉండే వ్యక్తి అని తెలిపారు.
నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన నయనతార డాక్యుమెంటరీ విషయంలో నటి నయనతార, ధనుష్ మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో ధనుష్ తీరుపై తాను రిలీజ్ చేసిన బహిరంగ లేఖపై నయనతార క్లారిటీ ఇచ్చింది. ‘న్యాయమని నమ్మిన దాన్ని బయటపెట్టడానికి నేను ఎందుకు భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి. నానుమ్ రౌడీ ధాన్ వీడియో క్లిప్స్‌కు సంబంధించిన NOC కోసం ధనుష్‌ను కలవడానికి ఎంతో ప్రయత్నించాం. కానీ అది జరగలేదుR...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన విషయం తెలిసిందే. నార్త్ అమెరికాలో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. అక్కడ ఇప్పటి వరకు ఈ సినిమా $10.9 మిలియన్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్య...
టాలీవుడ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న సినిమా ‘స్వయంభూ’. ఈ సినిమాలో నభా నటేష్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తాజాగా నభా నటేష్ పాత్రను మేకర్స్ రివీల్ చేశారు. ఈ మూవీలో ఆమె సుందర వల్లి పాత్రలో కనిపిస్తున్నట్లు పోస్టర్ షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది.
యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘రోటీ కపడా రొమాన్స్’ మూవీ నవంబర్ 28న థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమాలో సందీప్ సరోజ్, సుప్రజ్, హర్ష నర్రా, తరుణ్ పొనుగంటి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్-8 ప్రస్తుతం స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోంది. సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ షో ముగింపు దశకు చేరుకుంది. ఈనెల 15న దీని గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సీజన్లో టాప్ 5లో నిఖిల్, ప్రేరణ, నబీల్, గౌతమ్, అవినాష్ నిలిచారు. మరి వీరిలో ఎవరు విన్నర్ అవుతారని అనిపిస్త...
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. OTTలో ఈ సినిమా హవా కొనసాగుతోంది. సదరు సంస్థలో ఈ చిత్రం రెండు వారాలుగా టాప్ 2లో గ్లోబల్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఇప్పటివరకు ఏకంగా 17.8 బిలియన్ మినిట్స్ వ్యూస్ దక్కించుకుంది. ఇక దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. అక్టోబ...
నటి సాయిపల్లవి ప్రస్తుతం బాలీవుడ్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’లో సీతగా నటిస్తోంది. అయితే, ఈ సినిమా పూర్తయ్యేవరకు సాయిపల్లవి మాంసాహారం మానేశారని, విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా వంట వాళ్లను వెంట తీసుకెళ్తున్నారని వస్తున్న వార్తలపై ఆమె స్పందించింది. ఇలాంటి నిరాధారమైన వార్తలు రాస్తే లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.