నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబోలో రాబోతున్న మూవీ ‘డాకు మహారాజ్’. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘డేగ’ రిలీజ్ కాగా.. తాజాగా రెండో పాటపై నయా అప్‌డేట్ వచ్చింది. ఈ నెల 23న ‘చిన్ని’ అనే పాటను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వ...
టీనేజ్‌లో వాళ్ల నాన్న చేసిన పనికి మల్లి(అల్లరి నరేష్) మూర్ఖంగా మారడంతో అతని జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది మూవీ కథ. హీరోయిన్ ఎంట్రీ ఇవ్వడం, ఆమెతో ప్రేమలో పడ్డాక మల్లి తీసుకున్న నిర్ణయాలు ఏంటి?, ఆమెతో ప్రేమకథ సుఖంతమైందా?, తండ్రితో సమస్యలు ఏంటి? అనేది చూపించారు. నరేష్ నటన, కథా నేపథ్యం, కొన్ని మలుపులు మూవీకి ప్లస్. రక్తి కట్టించని కథనం, బలం లేని భావోద్వేగాలు, కొన్ని బోరింగ్ స...
సినీ నటుడు సత్యదేవ్ హీరోగా నటించిన ‘జీబ్రా’ మూవీ నవంబర్ 22న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ వచ్చేసింది. ప్రముఖ OTT సంస్థ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా, కొన్ని రోజుల క్రితమే ఆహా గోల్డ్ యూజర్స్‌కి అందుబాటులో రాగా.. ఇవాళ్టి నుంచి సాధారణ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారు కూడా ఈ చిత్రాన్ని చూడవచ్చు. ఇక ఈ మూవీకి ఈశ్వర్ కార్తీక్ దర...
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10 విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి వరుస అప్ డేట్స్ ఇస్తున్న మేకర్స్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమాలో అంజలి లుక్ ఎలా ఉందో రివీల్ చేశారు. ఈ మేరకు అంజలి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్‌లో అంజలి లుక్ వైరల్ అవుతోంది.
జీ తెలుగు: అ ఆ (9AM), రాజు గారి గది-2 (4PM); ఈటీవీ: బడ్జెట్ పద్మనాభం(9AM); జెమినీ: అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి (8.30AM), కత్తి కాంతారావు (3PM); స్టార్ మా మూవీస్: ఒక్కడున్నాడు (7AM), లవ్ స్టోరీ (9AM), వీర సింహారెడ్డి (12PM),యముడు (3PM), ధమ్కా (6PM), S/O సత్యమూర్తి (9PM); జీ సినిమాలు: సికిందర్ (7AM), రంగ్ దే (9AM), రంగ రంగ వైభవంగా (12PM), తులసి (3PM), దాస్ కా ధమ్కీ (6PM), […]
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ ఇవాళ కూతురు ఆరాధ్య చదువుతోన్న ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఈ జంట తమ కుమార్తె ఆరాధ్యకు మద్దతుగా వచ్చారు. వారి వివాహబంధంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. విడిపోయారని గత కొంతకాలంగా వస్తోన్న పుకార్ల మధ్య తాజా పరిణామం చోటుచేసుకుంది. ఈవెంట్‌కు వారిరువురు కలిసి రావడంతో అలాంటి వార్తలకు స్వ...
ఈ ఏడాది ఏకంగా 13 మంది టాలీవుడ్ హీరోలు ఒక్క సినిమా విడుదల చేయకుండా ముగిస్తున్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లాంటి అగ్ర హీరోలు ఉన్నారు. వీరితో పాటు కుర్ర నటులలో నవీన్ పొలిశెట్టి, నాగ చైతన్య, నితిన్, సాయి దుర్గ తేజ, అఖిల్, నాగ శౌర్య, అడివి శేష్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వైష్ణవ్ తేజ్ లు కూడా ఈ ఏడాది ఖాతా తెరవకుండానే వెళ్తున్నారు.
అల్లుఅర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప-2 మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్ల మార్కును దాటింది. ఈ మైలురాయిని అత్యంత వేగంగా దాటిన భారత సినిమాగా చరిత్రకెక్కింది. మూవీ టీమ్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించింది. మూవీ రూ. 1508 కోట్లు కలెక్ట్ చేసి కమర్షియల్ సినిమా లెక్కల్ని, బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాస్తోందని ప్రకటించింది.
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌పై దర్శకుడు శంకర్ ప్రశంసలు కురిపించారు. సన్నివేశం ఎలాంటిదైనా అద్భుతంగా నటిస్తారని, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుందని తెలిపారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘గేమ్ ఛేంజర్’ రూపొందిన విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రచారంలో భాగంగా దర్శకుడు శంకర్ ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
TG: హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడిని డైరెక్టర్ సుకుమార్ పరామర్శించారు. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన సుకుమార్.. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తమ తరఫున బాలుడి కుటుంబానికి అవసరమైన సాయాన్ని అందిస్తామని సుకుమార్ హామీ ఇచ్చారు. అయితే అంతకుముందే సుకుమార్ భార్య తబిత బాలుడి కుటుంబానికి రూ. 5లక్షల ఆర్థికసాయం అందించారు.
బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఫేక్ కలెక్షన్స్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇప్పుడున్న రోజుల్లో మూవీ మార్కెటింగ్ కోసం ఫేక్ కలెక్షన్స్ చెప్పడం సాధారణం అయింది. ఇటీవల నా సినిమా విడుదలైతే ప్రేక్షకులు పెద్దగా దానిని చూడలేదు. ఆ విషయాన్ని చెప్పడానికి నేను ఇబ్బంది పడటం లేదు’ అని అన్నారు.
TG: హైకోర్టులో నటుడు మంచు మోహన్ బాబుకు చుక్కెదురైంది. సోమవారం వరకు అరెస్టు చేయకుండా.. ఆదేశాలు ఇవ్వాలని మోహన్ బాబు న్యాయవాది కోరారు. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేశాకే తీర్పు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
పాకిస్తాన్ బెట్టింగ్ వెబ్‌సైట్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో నటి మల్లికా షెరావత్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. హీరోయిన్లు మల్లికా, పూజా బెనర్జీ వాంగ్మూలాలను ఈడీ రికార్డ్ చేసింది. పోర్టల్ ‘మ్యాజిక్విన్(MagicWin)’ చట్టవిరుద్ధంగా పురుషుల T20 ప్రపంచ కప్ మ్యాచ్‌లను ప్రసారం చేసింది. ఈ పోర్టల్‌పై దర్యాప్తులో భాగంగా ఏజెన్సీ ఇటీవల ఢిల్లీ, ముంబై సహా పూణేలలో ఈడీ ...