• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

పాత సినిమాలు ‘కుళ్లిపోయిన ఆహారం’తో సమానం: RGV

‘ధురంధర్ 2’పై దర్శకుడు RGV సంచలన వ్యాఖ్యలు చేశాడు. మార్చి 19, 2026 కంటే ముందు వచ్చిన సినిమాలన్నీ ఇకపై ‘కుళ్లిపోయిన ఆహారం’తో సమానమని అన్నాడు. ఈ మూవీ మేకింగ్‌ను ఒక ‘సర్జికల్ వార్‌ఫేర్’గా పేర్కొన్న వర్మ.. సెటప్, ఇన్‌ఫిల్ట్రేషన్, డెటొనేషన్ వంటి అంశాలతో ఇదొక ఇంటెలిజెన్స్ ఆపరేషన్‌లా సాగుతుందని తెలిపాడు. పాత సినిమాలన్నీ దీని ముందు దిగదుడుపేనని అన...

March 30, 2026 / 12:02 PM IST

‘పెద్ది’ విడుదల మరోసారి వాయిదా..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతోంది. ఏప్రిల్ 30, 2026న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా మరోసారి వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో 2026 జూన్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

March 30, 2026 / 11:31 AM IST

‘పెద్ది’ కోసం రామ్ చరణ్ బీస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్

రామ్ చరణ్ తన తాజా చిత్రం ‘పెద్ది’ కోసం చేసిన మేకోవర్ హాట్ టాపిక్‌గా మారింది . ముగ్ధార్ (గద) వంటి సాంప్రదాయ పద్ధతులతో శిక్షణ పొంది, పహిల్వాన్ లుక్‌లో ఆశ్చర్యపరిచాడు. మాంసాహారం లేకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన శాకాహారంతోనే అంతర్జాతీయ స్థాయి ఫిజిక్ సాధించి, ఫిట్‌నెస్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. క్రమశిక్షణ ఉంటే ఏదైనా సాధ్యమని చరణ్ మరోసారి నిరూపించాడు.

March 30, 2026 / 11:00 AM IST

ఓటీటీలోకి కొత్త మూవీ.. ఎప్పుడంటే?

శివాజీ, లయ, రోహన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన వినోదాత్మక చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూస’. మార్చిలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఈ సినిమా, ఇప్పుడు OTTలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 3 నుంచి ‘ఈటీవీ విన్’లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో అలీ, ధనరాజ్, ఇమ్మాన్యుయేల్ తమ కామెడీతో అలరించారు.

March 30, 2026 / 10:31 AM IST

ప్రభాస్ ‘కల్కి 2’టైటిల్ ఫిక్స్..!

నాగ్ అశ్విన్, ప్రభాస్ మూవీ ‘కల్కి 2’ పై ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీకి ‘కర్ణ 3102 BC’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో పురాణాల నేపథ్యం ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా కర్ణుడి పాత్ర చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తోంది. అలాగే, ఒక పవర్‌ఫుల్ నెగిటివ్ రోల్ కోసం బాలీవుడ్ నటుడిని తీసుకోనున్నారట. ఈ కొత్త పాత్ర సినిమాకు మెయిన్ హైలైట్ కానున్నట్లు టాక్.

March 30, 2026 / 10:22 AM IST

ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి సువర్ణలత (86) ఇవాళ ఉదయం బెంగళూరులోని తన స్వగృహంలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సాయంత్రం బెంగళూరులోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.

March 30, 2026 / 10:09 AM IST

రెండోసారి తల్లి అయిన హీరోయిన్

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ రెండోసారి తల్లి అయింది. మార్చి 29, 2026న ఆమె మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో కపూర్, అహూజా కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొంది. సోనమ్, ఆనంద్ అహూజాలకు 2018లో వివాహం కాగా, 2022లో వీరికి వాయు అనే కుమారుడు పుట్టాడు. ఇప్పుడు రెండో బాబు రాకతో నెటిజన్లు, సినీ ప్రముఖులు ఈ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

March 30, 2026 / 09:44 AM IST

‘ధురంధర్‌ 2’తో అణుబాంబు పేల్చాడు: RGV

‘ధురంధర్ 2’ విజయంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఆదిత్య ధర్ పరిశ్రమ కింద అణుబాంబు పేల్చారు. ఆ ధాటికి అందరూ అంతరిక్షంలోకి వెళ్లారేమో, అందుకే ఎవరి చప్పట్లు వినిపించట్లేదు. చిత్ర పరిశ్రమ మౌనం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. పాత మూస సినిమాలే తీస్తామంటే కుదరదు. తోటి దర్శకులారా.. ఈ సినిమాను ఒక పాఠంలా చదివి, మీ చిత్రాల్లో మార్పులు చేసుకోండి’ అని చురకలు అంటించాడు.

March 30, 2026 / 09:12 AM IST

విషాదం.. యువ నటుడు మృతి

బెంగాలీ యువ నటుడు రాహుల్ బెనర్జీ (43) ప్రమాదవశాత్తు కన్నుమూశాడు. ఓ సీరియల్ షూటింగ్ ముగించుకుని సముద్ర తీరానికి వెళ్లగా.. భారీ అలల ధాటికి నీటిలో కొట్టుకుపోయాడు. వెంటనే స్థానికులు ఆయనను బయటకు తీసినప్పటికీ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. రాహుల్ బెనర్జీ మృతి పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

March 30, 2026 / 08:22 AM IST

‘స్పిరిట్’పై వివేక్ ఒబెరాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి రిపోర్టర్లు ప్రశ్నించగా వివేక్ స్పందిస్తూ.. ‘పిక్చర్ అభీ బాకీ హై మేరే దోస్త్’ అంటూ సమాధానమిచ్చాడు. ఈ సినిమా కోసం తామంతా చాలా కష్టపడుతున్నామని తెలిపాడు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచుతున్నాయి.

March 30, 2026 / 08:11 AM IST

షూటింగ్ తుదిదశలో హెబ్బా పటేల్ ‘మిరాకిల్’

రణధీర్ బీసు, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మిరాకిల్’. ప్రభాస్ నిమ్మల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంపై దర్శకుడు తాజాగా కీలక అప్‌డేట్ ఇచ్చాడు. సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తయిందని పేర్కొన్నాడు. మిగిలిన భాగాన్ని కూడా త్వరలోనే పూర్తి చేసి, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నాడు.

March 30, 2026 / 07:35 AM IST

నేను సినిమాలు చూడను: ఆమీర్ ఖాన్

సినిమాల్లో నటిస్తాను కానీ, సినిమాలు పెద్దగా చూడనని ఆమీర్ ఖాన్ వెల్లడించాడు. తమది చాలా క్రమశిక్షణ కలిగిన కుటుంబం కావడంతో తన తల్లిదండ్రులు తనను సినిమాలు చూడనిచ్చేవారు కాదని తెలిపాడు. కేవలం దూరదర్శన్‌లో వచ్చే పాత కాలపు బ్లాక్ అండ్ వైట్ చిత్రాలను మాత్రమే చూడనిచ్చేవారని అన్నాడు. ఆమీర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

March 30, 2026 / 07:05 AM IST

మార్చి 30: టీవీలలో సినిమాలు

స్టార్ మా: ఇల్లు ఇల్లాలు పిల్లలు(9AM); జీతెలుగు: రెడీ(9AM); ఈటీవీ: సింహాద్రి(9AM); జెమిని: సై(9AM); స్టార్‌మా మూవీస్: నిను వీడని నీడను నేనే(7AM), లవ్‌స్టోరీ(9AM), ధమాకా(12PM), లైగర్(3PM), స్కంధ(6PM), రఘువరన్ B.Tech(9:30PM); Z సినిమాలు: ఆజాద్(7AM), ఓ మై ఫ్రెండ్(9AM), శివాజీ(12PM), పెళ్ళాం ఊరెళితే(3PM), జెర్సీ(6PM), సైనికుడు(9PM).

March 30, 2026 / 05:41 AM IST

ఇప్పుడు ఆడ పులిలా మారాను: నటి

తల్లి అయిన తర్వాత తన జీవితం మారిపోయిందని నటి కియారా అద్వాణీ పేర్కొంది. ఇప్పుడు తానొక ‘ఆడపులి’లా మారానని, మాతృత్వంతో తన ఆలోచనా విధానం పూర్తిగా భిన్నంగా ఉందని తెలిపింది. పెళ్లయినా.. సిద్ధార్థ్‌తో తన బంధం, సరదా కబుర్లు ఏమీ మారలేదని, తామిద్దరం సినిమా ప్రేమికులుగా ఎన్నో విషయాలు చర్చిస్తామని చెప్పింది. ఓటమే ఉత్తమ గురువుగా భావించి, కథ నచ్చితే వెంటనే ఓకే చేస్తానని వెల్లడించింది.

March 30, 2026 / 04:44 AM IST

రామ్‌ చరణ్‌ ‘పెద్ది’ వాయిదా…!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉంది. అయితే, ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు.

March 29, 2026 / 10:42 PM IST