సినీ నటుడు సత్యదేవ్ హీరోగా నటించిన ‘జీబ్రా’ మూవీ నవంబర్ 22న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ డేట్ వచ్చింది. ప్రముఖ OTT సంస్థ ‘ఆహా’లో ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆహా గోల్డ్ యూజర్స్ 48 గంటల ముందు ఈ సినిమాను చూడవచ్చు. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ మూవీకి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు, హీరో శ్రీసింహ పెళ్లి సీనియర్ నటుడు మురళీ మోహన్ మనవరాలు రాగ మాగంటితో ఘనంగా జరిగింది. అన్న కుమారుడి పెళ్లిలో దర్శకధీరుడు రాజమౌళి డ్యాన్స్‌తో అదరగొట్టాడు. శ్రీసింహ యమదొంగ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా, తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్, మత్తు వదలరా వంటి సినిమాల్లో హీరోగా నటించాడు.
ఉత్కంఠభరితంగా సాగుతున్న బిగ్‌బాస్ సీజన్- 8 నుంచి ఈ వారం జబర్దస్త్ నటుడు అవినాష్ ఎలిమినేట్ అయ్యారు. ఈ విషయాన్ని వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించారు. దీంతో ఈ సీజన్లో నాలుగో రన్నరప్‌గా అవినాష్ నిలిచాడు. ఈ సీజన్లో మొత్తం 22 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా.. టైటిల్ బరిలో గౌతమ్, నిఖిల్, ప్రేరణ మిగిలారు. అయితే వీరిలో ఎవరు టైటిల్ విన్నర్ అవుతారనేది బిగ్‌బాస్ అభిమానుల్లో తీవ్ర చర్చనీ...
అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై సినీ నటుడు మంచు మనోజ్ స్పందించాడు. మొత్తం దిష్టి అంతా పోయింది బాబాయ్ అంటూ ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టాడు. ‘వెల్కమ్ బ్యాక్ అల్లు అర్జున్ గారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో మీరు కనబరిచిన ప్రశాంతత, బాధ్యతయుత వ్యవహారశైలిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా. బాధిత కుటుంబానికి మద్దతుగా నిలుస్తానని మీరిచ్చిన హామీ మీ నిజమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోంది’...
‘పుష్ప 3 ది ర్యాంపేజ్’లో విజయ్ దేవరకొండ నటించనున్నట్లు ఇటీవల ప్రచారం జోరందుకుంది. దీనిపై తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో రష్మిక స్పందించింది. ‘మీలాగే నాక్కూడా ఆ విషయం గురించి తెలియదు. దర్శకుడు సుకుమార్ ప్రతి విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తారు. ఆఖరి వరకూ విషయాన్ని బయటపెట్టరు. సినిమా క్లైమాక్స్‌లో ముసుగు వేసుకున్న వ్యక్తిని చూసి.. ‘ఇతనెవరు?’ అని నేను కూడా ఆశ్చర్యపోయ...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు ఫోన్లు చేస్తున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టై బెయిల్‌పై విడుదలైన అల్లు అర్జున్ను ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్లో పరామర్శించిన విషయం తెలిసిందే. తాజాగా బన్నీని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫోన్లో పరామర్శించారు. అరెస్టుపై వివరాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అలాగే, ఎన్టీఆర్, వెంకటేశ్ సైతం ఫోన్ చేసి బన్నీని పర...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోన్ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట సంఘటనలో బన్నీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ప్రస్తుతం ముంబైలో వార్-2 షూట్లో ఎన్టీఆర్ ఉన్నాడు. హైదరాబాద్ వచ్చిన వెంటనే కలుస్తానని చెప్పినట్లు తెలుస్తుంది.
2024 టాలీవుడ్లో బాక్సాఫీస్ దద్దరిల్లిందనే చెప్పాలి. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది 8 సినిమాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్ల వర్షం కురిపించాయి. ఈ జాబితాలో గుంటూరు కారం (రూ.184 కోట్లు), హనుమాన్ (రూ.296 కోట్లు), టిల్లు స్క్వేర్ (రూ.130 కోట్లు), కల్కి (రూ.1,061 కోట్లు), సరిపోదా శనివారం (రూ.100 కోట్లు), దేవర (రూ.450 కోట్లు), లక్కీ భాస్కర్ (రూ.114 కోట్లు), పుష్ప ది రూల్ (రూ.1110 కోట్లు కౌంటింగ్) ఉన్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై హీరోయిన్ శ్రీలీల స్పందించింది. విశాఖలోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె.. సంధ్య థియేటర్ ఘటన దురదృష్టవశాత్తూ జరిగిందని చెప్పింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని.. కానీ జైలు నుంచి విడుదల కావడం సంతోషంగా ఉందని తెలిపింది. రూల్స్ ఫాలో కావడంతోనే ఆయన ఈ స్థాయిలో ఉన్నాడని శ్రీలీల అభిప్రాయపడింది.
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా అతడికి సమంత స్పెషల్ విషెస్ చెప్పింది. ‘హ్యాపీ బర్త్ డే రానా.. చేసే ప్రతి పనిలో 100 శాతం ఫోకస్ పెడుతుంటావు. ఆ విషయంలో నేను మీ నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను. నేను ఎప్పటికీ నీ అభిమానినే’ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
నటుడు మోహన్ బాబు పోలీసులకు అందుబాటులోకి వచ్చారు. తాను పూర్తిగా కోలుకున్న తర్వాత విచారణ చేయాలని మోహన్ బాబు కోరగా.. ఇప్పుడే విచారణకు సహకరించాలని పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో జర్నలిస్ట్‌పై దాడి కేసులో మోహన్ బాబును ప్రశ్నించారు. గన్ను సరెండర్ చేయాలని పోలీసులు కోరారు. సాయంత్రం సరెండర్ చేస్తానని మోహన్ బాబు చెప్పినట్లు తెలుస్తోంది.
సంధ్య థియేటర్ ఘటన కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే అరెస్ట్ సమయంలో బన్నీ వేసుకున్న టీషర్ట్ గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. తన టీషర్ట్‌పై హిందీలో ‘ఫ్లవర్ నహీ.. ఫైర్ హే మే’ అని రాసి ఉంది. దాని అర్థం ‘ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్’. తాజాగా ఈ పిక్ వైరల్ అవుతుండగా.. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చిన తగ్గేదేలా అని అల్లు అర్జున్ పరోక్షంగా మ...
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన ‘అఖండ’ సినిమాకు సీక్వెల్‌గా ‘అఖండ 2 తాండవం’ రాబోతుంది. తాజాగా ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లయ కూతురు శ్లోక నటించనున్నట్లు తెలుస్తోంది. బాలయ్య కూతురి పాత్రలో ఆమె కనిపించనున్నట్లు సమాచారం. ఈ మేరకు మేకర్స్ లయను సంప్రదించగా.. అందుకు ఆమె ఒప్పుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల...
క్యాన్సర్ చికిత్స తీసుకున్న రోజులను గుర్తు చేసుకుంటూ ప్రముఖ నటి సోనాలి బింద్రే ఎమోషనల్ అయ్యారు. ‘ఆరోగ్యకరమైన జీవనశైలి గడిపినప్పటికీ క్యాన్సర్ బారిన పడ్డాను. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. క్యాన్సర్ విషయం నా కుమారుడికి చెప్పడం చాలా కష్టమైంది. అది అత్యంత కష్టమైన సంభాషణగా అనిపించింది’ అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.