విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజా’ మూవీ చైనా భారీ వసూళ్లను రాబడుతోంది. నవంబర్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం 12 రోజుల్లోనే 70 కోట్లను వసూలు చేసింది. డ్రాగన్ దేశంలో ఇటీవల కాలంలో ఏ భారతీయ సినిమా సాధించలేని వసూళ్లతో దూసుకుపోతుంది. దీంతో చైనా మార్కెట్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన 13వ భారతీయ చిత్రంగా నిలిచింది.
జీ తెలుగు: ఇద్దరమ్మాయిలతో (9AM), పెళ్లి రోజు (11PM); ఈటీవీ: కలసి నడుద్దాం (9AM); జెమినీ: దేవుళ్లు (8.30AM), బాష (3PM); స్టార్ మా మూవీస్: ఝాన్సీ (7AM), ఓ బేబీ (9AM), వినయ విధేయ రామ (12PM), స్వామి-2 (3PM), విరూపాక్ష (6PM), యోగి (9PM); జీ సినిమాలు: నీకు నేను నాకు నువ్వు (7AM), కథానాయకుడు (9AM), ముత్తు (12PM), శివాజి (3PM), బింబిసార (6PM), చిరుత (9PM).
TG: మంచు ఫ్యామిలీ హైడ్రామాలో పోలీసులు మనోజ్‌ను విచారించారు. అనంతరం విష్ణుని విచారణకు పిలవడంతో నేరేడ్‌మెట్‌లోని సీపీ కార్యాలయానికి వెళ్లాడు. సీపీ సుధీర్ బాబు అతన్ని విచారించనున్నారు. జిల్లా అదనపు మెజిస్ట్రేట్ హోదాలో విష్ణుని సీపీ విచారించనున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మరి కొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కనుంది. తన స్నేహితుడు ఆంటోనీతో రేపు వివాహం చేసుకోనుంది. కీర్తి-ఆంటోనిల పెళ్లి గోవాలో జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరువురి కుటుంబాలు గోవాకు చేరుకున్నాయి. తాజాగా జరిగిన మెహందీ వేడుక ఫొటోలను కీర్తీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప 2’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో అల్లు అర్జున్ నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. రిలీజైన అన్ని థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. అయితే తాజాగా ఈ మూవీ రూ.1000 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఆరు రోజుల్లోనే వేయి కోట్లు వసూలు చేసిన మొదటి భారతీయ చ...
హీరో నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీకి సీక్వెల్ రూపొందిస్తున్నారు. ‘అఖండ 2: తాండవం’ రెగ్యులర్ షూటింగ్ నేడు ప్రారంభమైంది. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ తేదీని ప్రకటించారు. 2025 సెప్టెంబరు 25న సినిమాని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై విక్టరి వెంకటేశ్ ప్రశంసలు కురిపించారు. ‘పుష్ప-2’లో బన్నీ యాక్టింగ్ అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. కొన్ని సన్నివేశాల్లో చూపు తిప్పుకోలేకపోయినట్లు పేర్కొన్నారు. ఈ సినిమాకు వస్తోన్న ప్రశంసలు చూస్తుంటే ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే, హీరోయిన్ రష్మిక అసాధారణ ప్రదర్శన చేసిందని ప్రశంసించారు.
సీపీ కార్యాలయంలో విచారణ అనంతరం మంచు మనోజ్ జల్‌పల్లి ఇంటికి చేరుకున్నాడు. సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని ముందు ప్రకటించారు. అయితే సీపీ సూచన మేరకు మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు తెలిపాడు.
TG: రాచకొండ సీపీ కార్యాలయంలో మంచు మనోజ్ విచారణ ముగిసింది. తాను ఎలాంటి గొడవలకు దిగనని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించనని రూ.1లక్ష బాండ్‌ను సీపీకి సమర్పించారు. తన తల్లి ఆసుపత్రిలో లేకున్నా ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కూర్చుని మాట్లాడుకోవడానికి తాను సిద్దంగా ఉన్నట్లు వెల్లడించాడు.
నటి మంచు లక్ష్మి తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. తన కుమార్తె చిరునవ్వులు చిందిస్తోన్న ఓ వీడియో షేర్ చేసిన లక్ష్మి ‘PEACE’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో వారి ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలకు శుభం కార్డు పడ్డట్లేనని పలువురు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో మంచు లక్ష్మి చేసిన పోస్ట్ వైరల్ అవుతో...
ప్రధాని మోదీని బాలీవుడ్ నటి కరీనా కపూర్ మర్యాదపూర్వకంగా కలిసింది. తన తాతయ్య రాజ్ కపూర్ శత జయంతి సందర్భంగా ప్రధానిని తమ కుటుంబ సభ్యులు కలిసినట్లు ఆమె పేర్కొంది. తమ కుమారులు తైమూరు, జెహ్ కోసం ప్రధాని నుంచి ఆటోగ్రాఫ్ తీసుకున్నట్లు తెలిపింది. అందుకు సంబంధించిన ఫొటోలను కరీనా కపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమెతో పాటు ఈ సమావేశంలో కరీనా, సైఫ్, రణబీర్ కపూర్, అలియా భట్, నీతూ కపూర్, కరిష్మా కపూర్ [&...
బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు. అవకాశాల్లేక బాధపడ్డానని చెప్పారు. ఆ సమయంలో కుటుంబసభ్యులు కూడా ఎంతో బాధకు గురయ్యారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పోలీసులు పంపిన నోటీసుల మేరకు మంచు మనోజ్ రాచకొండ సీపీ కార్యాలయంలో హాజరయ్యారు. దాడి ఘటనలో పోలీసులకు మనోజ్ వివరణ ఇచ్చారు. విచారణకు హాజరుకాని మోహన్ బాబు, విష్ణుకు పోలీసులు మరోసారి సమన్లు జారీ చేశారు. రెండోసారి కూడా విచారణకు హాజరుకాకపోతే.. మేజిస్ట్రేట్ హాదాలో అరెస్ట్ చేసి రిమాండ్ చేసే అవకాశమున్నట్లు తెలిపారు. కాగా.. పోలీసుల నోటీసులను కోర్టులో సవాల్ చేసిన మోహన్ బాబు విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదన...