• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

నెల తిరక్కుండానే ఓటీటీలోకి హర్రర్ మూవీ

టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్ ‘హనీ’. కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా 2026 ఫిబ్రవరి 6న విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTT డేట్ ఫిక్స్ అయింది. సన్‌నెక్స్ట్‌లో FEB 27 నుంచి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

February 21, 2026 / 11:22 AM IST

‘ధురంధర్‌ 2’ ట్రైలర్‌ అప్‌డేట్‌

‘ధురంధర్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో దాని సీక్వెల్‌పై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ‘ధురంధర్ 2’ ట్రైలర్ అప్‌డేట్ వచ్చింది. 2026 మార్చి 5న ట్రైలర్ రిలీజ్ కానున్నట్లు సమాచారం. దీనికోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది.

February 21, 2026 / 11:10 AM IST

రెండో పెళ్లి రూమర్లపై మీనా ఘాటు స్పందన

సీనియర్ నటి మీనా తన రెండో పెళ్లిపై వస్తున్న పుకార్లపై తీవ్రంగా స్పందించింది. భర్త విద్యాసాగర్ మరణం నుంచి తాను ఇంకా కోలుకోలేదని, ప్రస్తుతం తన కూతురే తన ప్రపంచమని స్పష్టం చేసింది. ‘నేను ఒంటరి మహిళను కాబట్టే నన్ను టార్గెట్ చేస్తున్నారా?’అని ఆవేదన వ్యక్తం చేస్తూ, తన మౌనాన్ని బలహీనతగా తీసుకోవద్దని కోరాడు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని పేర్కొంది.

February 21, 2026 / 10:56 AM IST

‘మృత్యుంజయ్’ రిలీజ్ వాయిదా.. కొత్త తేదీ ఇదే

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘మృత్యుంజయ్’. FEB 27న రిలీజ్ కానున్న ఈ సినిమా వాయిదా పడింది. 2026 మార్చి 6న దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. అయితే FEB 28న శ్రీవిష్ణు మరో సినిమా ‘విష్ణు విన్యాసం’ విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

February 21, 2026 / 10:30 AM IST

రాముడిగా మహేష్ లుక్ అదుర్స్

మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ‘వారణాసి’ మూవీ తెరకెక్కుతోంది. 2027 ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ మూవీలో మహేష్ రుద్ర, శ్రీరాముడిగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు టాక్. తాజాగా మైత్రీ సినిమాస్ వద్ద రాముడి గెటప్‌లో ఉన్న మహేష్ డిజిటల్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ధనుస్సు పట్టుకున్న మహేష్ గంభీరమైన లుక్ చూసి రాజమౌళి సైతం తనకు ‘గూస్‌బంప్స్’ వచ్చాయని ప్రశంసించడం విశేషం.

February 21, 2026 / 09:56 AM IST

అల్లు అర్జున్ పార్టీలో రామ్ చరణ్, ఉపాసన

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తమ్ముడు శిరీష్, నయనికల పెళ్లి సందర్భంగా గ్రాండ్ ప్రీవెడ్డింగ్ పార్టీ ఇచ్చాడు. ఈ వేడుకకు రామ్ చరణ్, ఉపాసన దంపతులతో పాటు నిహారిక, వైష్ణవ్ తేజ్ వంటి మెగా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ప్రస్తుతం అల్లు, మెగా హీరోల ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మార్చి 6న శిరీష్ వివాహం జరగనుంది. 

February 21, 2026 / 09:36 AM IST

‘అలా మాట్లాడి.. రెండు రోజులు నిద్రపోలేదు’

గతంలో తాను చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలపై నటుడు శివాజీ తాజాగా స్పందించాడు. ఆ సమయంలో అలా మాట్లాడినందుకు తాను కూడా చాలా బాధపడ్డానని, ఆ బాధతో రెండు రోజుల పాటు నిద్ర కూడా పోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తన మాటల వల్ల కలిగిన పరిణామాలను తలచుకుని ఎంతో మధనపడ్డానని, ఆ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ శివాజీ ఓ కార్యక్రమంలో ఎమోషనల్ అయ్యాడు.

February 21, 2026 / 09:34 AM IST

షూటింగ్‌లో ఏడ్చేసిన స్టార్ హీరోలు

‘ధురంధర్’ సినిమా షూటింగ్ విశేషాలను నటుడు మాధవన్ తాజాగా పంచుకున్నాడు. 26/11 ముంబై దాడుల నేపథ్యంలో సాగే సన్నివేశాలను చిత్రీకరించినప్పుడు అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని తెలిపాడు. దర్శకుడు ‘కట్’ చెప్పగానే వారిద్దరూ కంటతడి పెట్టారని మాధవన్ గుర్తుచేసుకున్నాడు. ఆ సన్నివేశాల తీవ్రత వారిని అంతలా కదిలించిందని ఆయన వెల్లడించాడు.

February 21, 2026 / 09:17 AM IST

ఓల్డ్ లుక్‌లో సత్యదేవ్.. రిలీజ్ మంత్ ఫిక్స్

సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రావు బహదూర్’. సైకలాజికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్ మహేష్ బాబు సమర్పిస్తున్నారు. వృద్ధుడి గెటప్‌లో సత్యదేవ్ మేకోవర్, టీజర్ ఇప్పటికే ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మేలో విడుదల కానుందని సత్యదేవ్ స్వయంగా వెల్లడించారు. త్వరలోనే అధికారిక రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం ప్రకటించనుంది.

February 21, 2026 / 07:26 AM IST

కాపీ చేశానని అంగీకరించిన AR రెహమాన్!

‘PS 2’లోని ‘వీర రాజా వీర’ సాంగ్‌కు డగర్ బ్రదర్స్‌కు క్రెడిట్ ఇవ్వడానికి AR రెహమాన్ సుప్రీంకోర్టులో అంగీకరించాడు. 5వారాల్లోపు SM, OTTలలో సవరించిన క్రెడిట్‌లు కనిపించాలని కోర్టు ఆదేశించింది. ‘శివస్తుతి’ నుంచి ఈ పాటను కాపీ చేశారని డగర్ గతంలో ఫిర్యాదు చేశారు. దీంతో డగర్వాణీ ధ్రుపద్ సంప్రదాయం పేరుతో క్రెడిట్స్ ఇచ్చేందుకు రెహమాన్ ఓకే చెప్పాడు.

February 21, 2026 / 06:48 AM IST

ఫిబ్రవరి 21: టీవీలలో సినిమాలు

స్టార్ మా: రాజా ది గ్రేట్(9AM); జీతెలుగు: రౌడీ బాయ్స్(9AM); ఈటీవీ: సందడే సందడి(9AM); స్టార్‌మా మూవీస్: సప్తగిరి LLB(7AM), వినయ విధేయ రామ(9AM), వీర సింహారెడ్డి(12PM), పోకిరి(3PM), K-ర్యాంప్(6PM), సలార్(9PM); జీ సినిమాలు: కొంచెం ఇష్టం కొంచెం కష్టం(7AM), విన్నర్(9AM), ఆర్యన్(12PM).

February 21, 2026 / 01:19 AM IST

‘భూత్ బంగ్లా’లో మిథిలా సందడి..!

విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ సినిమాతో మిథిలా పాల్కర్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో ‘భూత్ బంగ్లా’లో నటించే చాన్స్ కొట్టేసింది. ఈ చిత్రంలో ఆమె తన చెల్లెలి పాత్రలో కనిపిస్తుందని అక్షయ్ తెలిపాడు. ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం మే 15న గ్రాండ్‌గా విడుదల కానుంది.

February 20, 2026 / 07:44 PM IST

ప్రభాస్‌కు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఇదే..!

‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో రెబల్ స్టార్ ప్రభాస్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విజయవాడలో దొరికే పునుగులు తన ఆల్‌టైమ్ ఫేవరెట్ అని ప్రభాస్ తెలిపాడు. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి పునుగులు తినేవాడినని పేర్కొన్నాడు. అయితే, ఇప్పుడు బిజీగా ఉండటం వల్ల తినడం కుదరడం లేదని వ్యాఖ్యానించాడు.

February 20, 2026 / 07:12 PM IST

‘బందర్’ రిలీజ్ డేట్ ఫిక్స్

బాబీ డియోల్ హీరోగా, అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బందర్’. ఈ సినిమాను సమ్మర్ స్పెషల్‌గా ఈ ఏడాది మే 22న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేస్తూ.. ‘మే 22న థియేటర్లలో కలుద్దాం’ అని పేర్కొన్నారు. ఈ సినిమాలో సన్యా మల్హోత్రా, రాజ్ బి శెట్టి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

February 20, 2026 / 06:47 PM IST

ప్రపంచ నంబర్ వన్ కంపెనీగా అమెజాన్..!

ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా అమెజాన్ అవతరించిందని బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ $717 బిలియన్ల అమ్మకాలు జరపగా, వాల్‌మార్ట్ $713.2 బిలియన్ల వద్ద నిలిచింది. గత దశాబ్దంలో వాల్‌మార్ట్ కంటే 10 రెట్లు వేగంగా ఆదాయాన్ని వృద్ధి చేసుకున్న అమెజాన్, రిటైల్ మార్కెట్లో తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది.

February 20, 2026 / 05:37 PM IST