భారీ నష్టాల వేళ ఐటీ స్టాక్స్ రాణించాయి. విప్రో, LTM, HCL టెక్నాలజీస్, కోఫోర్జ్ స్టాక్స్ లాభపడ్డాయి. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ భారీగా పతనం కావడం ఈ స్టాక్స్‌కు కలిసొచ్చింది. ఆయా కంపెనీలకు ఆదాయం డాలర్లలో ఉండడం, ఖర్చులు రూపాయల్లో ఉండడం ఇందుకు కారణం. అలాగే, గత నెల ఐటీ స్టాక్స్ భారీగా పతనమైన నేపథ్యంలో కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు కనిపించింది.