• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

నేటి నుంచి టెట్ ఆన్‌లైన్ పరీక్షలు

TG: ఇవాళ్టి నుంచి టెట్ ఆన్‌లైన్ పరీక్షలు జరగనున్నాయి. టెట్ పేపర్-1, పేపర్-2కి 2.37 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 18 జిల్లాల్లో 97 కేంద్రాల్లో టెట్ నిర్వహించనున్నారు.

January 3, 2026 / 06:25 AM IST

సీఎంను కలిసిన టీపీసీసీ అధికార ప్రతినిధి

NZB: రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. సీఎంకు ఆయన 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బాల్కొండ నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసీ ముందుకు సాగాలని కోరారు.

January 2, 2026 / 07:03 PM IST

నిరర్థక ఆస్తులు మరింతగా తగ్గుతాయ్‌: ఆర్‌బీఐ

దేశ ఆర్థిక వ్యవస్థ వేగవంత వృద్ధిని నమోదు చేస్తోందని RBI తెలిపింది. ‘ఆర్థిక స్థిరత్వంపై విడుదల చేసిన అర్థ సంవత్సర నివేదిక’లో RBI పేర్కొంది. బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి మున్ముందు మరింత మెరుగవుతుందని వెల్లడించింది. 2025 సెప్టెంబరు చివరికి 46 బ్యాంకుల GNPA నిష్పత్తి దశాబ్దాల కనిష్ఠమైన 2.1శాతంగా ఉందని, 2027మార్చికి ఇది 1.9శాతానికి తగ్గుతుందని పేర్కొంది.

January 1, 2026 / 09:07 PM IST

6 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు

దేశంలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయికి చేరాయి. డిసెంబర్ నెలలో సుమారు రూ.1.75 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌తో పోలిస్తే వసూళ్లు 6.1 శాతం పెరిగాయి. వీటితో కలిపి గత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.22.08 లక్షల కోట్లకు చేరినట్లు గణాంకాలు వెల్లడించాయి.

January 1, 2026 / 03:51 PM IST

BREAKING: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

కొత్త ఏడాది వేళ వినియోగదారులకు షాక్ తగిలింది. వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై ఏకంగా రూ.111 పెంచింది. దీంతో వాటి ధర రూ.1,619కి చేరింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు స్పష్టం చేశాయి.

January 1, 2026 / 01:22 PM IST

తగ్గిన రష్యా ఆయిల్ దిగుమతి.. అంబానీ ట్విస్ట్!

భారత్‌కు రష్యా ఆయిల్ దిగుమతులు మూడేళ్ల కనిష్టానికి చేరాయి. DECలో రోజుకు కేవలం 1.1మిలియన్ బ్యారేళ్లు మాత్రమే దిగుమతి అయ్యాయి. US ఆంక్షలే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లు దూరంగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మళ్లీ రంగంలోకి దిగింది. ఆంక్షల జాబితాలో లేని సప్లయర్స్ నుంచి కొనుగోళ్లు షురూ చేసింది. రిలయన్స్ ఎంట్రీతో రష్యా ఆయిల్ దిగుమతులు మళ్లీ మెరుగు పడనున్నాయి.

January 1, 2026 / 09:25 AM IST

తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ఉద్యోగాలు

ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో తాత్కాలిక అనౌన్సర్లుగా పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కనీసం ఏదైనా డిగ్రీతోపాటు స్వర మాధుర్యం, ఉచ్చారణలో స్పష్టత, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి 21-50 ఏళ్ల మధ్య వారు అర్హులు. రాత పరీక్ష, స్వర పరీక్ష, మౌఖిక పరీక్షల ద్వారా ఎంపిక జరుగుతుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను జనవరి 15వ తేదీలోగా వివరాలు పంపించాలన్నారు.

December 31, 2025 / 08:20 PM IST

కొత్త ఏడాదిలో నిరుద్యోగులకు GOOD NEWS!

TG: DGP శివధర్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. నిన్న నేర వార్షిక విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో త్వరలో 14 వేల నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కొలువుల భర్తీ కోసం ప్రభుత్వానికి నివేదిక పంపామని, అనుమతి వచ్చిన వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

December 31, 2025 / 06:35 PM IST

తిరుపతి SVU పరీక్షలు వాయిదా

తిరుపతి SVU పరిధిలో జనవరి 5వ తేదీ నుంచి M.A, MSC, M.Com, M.S Data Science, M.Ed, M.Lisc రెండో సంవత్సరం మూడో సెమిస్టర్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, వీటిని వాయిదా వేశామని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ రాజమాణిక్యం వెల్లడించారు. జనవరి 21 నుంచి నిర్వహిస్తామని ప్రకటించారు. NET పరీక్షల నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని SFI నాయకులు రెక్టార్‌కు వినతిపత్రం అందజేశారు.

December 31, 2025 / 02:00 PM IST

సీఈవోగా నేడు వైదొలగనున్న వారెన్ బఫెట్

వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హాత్‌వే సీఈవో పదవి నుంచి నేడు వైదొలగనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి తాను బెర్క్‌షైర్ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకుంటానని గతంలో బఫెట్ ప్రకటించారు. ఆయన స్థానంలో గ్రెగొరి ఎబెల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. 95 ఏళ్ల బఫెట్.. 1965లో బెర్క్‌షైర్ పగ్గాలు స్వీకరించారు. 60 ఏళ్లుగా ఆయన ఈ కంపెనీకి సీఈవోగా ఉన్నారు.

December 31, 2025 / 11:07 AM IST

BREAKING: పసిడి ప్రియులకు స్వల్ప ఊరట

TG: హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.320 తగ్గి రూ.1,35,880కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.300 తగ్గి రూ.1,24,550 పలుకుతోంది. మరో వైపు వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా రూ.2,58,000 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

December 31, 2025 / 10:00 AM IST

GOOD NEWS: గడువు పెంపు

గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కంపెనీల వార్షిక రిటర్నులు, ఆర్థిక నివేదికల సమర్పణ గడువును కేంద్రం పొడిగించింది. కంపెనీలు తమ ఫైలింగ్‌లను 2026 జనవరి 31 లోగా పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గడువు ఈనెల 31తో ముగియనుండగా, పొడిగించారు. ఫైలింగ్ వ్యవస్థలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, వివిధ వర్గాల నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

December 31, 2025 / 06:56 AM IST

CBSE పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు

CBSE పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. మార్చి 3వ తేదీన జరగాల్సిన టెన్త్‌ పరీక్షను మార్చి 11కి; 12వ తరగతి విద్యార్థులకు జరగాల్సిన పరీక్షను ఏప్రిల్‌ 10కి మార్చింది. మిగతా పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేసింది. కాగా, ఫిబ్రవరి 17 నుంచి సీబీఎస్‌ఈ పది, 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

December 30, 2025 / 06:50 PM IST

ఇన్కమ్ రీప్లేస్మెంట్ టర్మ్ ప్లాన్ అంటే తెలుసా?

ఇన్కమ్ రీప్లేస్మెంట్ టర్మ్ ప్లాన్ అనేది ఒక ప్రత్యేకమైన లైఫ్ ఇన్సూరెన్స్ విధానం. సాధారణ టర్మ్ ఇన్సూరెన్సులో పాలసీదారుడు మరణిస్తే నామినీకి ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది. కానీ ఈ ప్లాన్‌లో.. ఆ మొత్తం డబ్బుతో పాటు.. కుటుంబానికి ప్రతి నెలా కొంత ఆదాయం వస్తుంది. అంటే ఇంటి పెద్ద లేకపోయినా.. ఆయన జీతం లేదా ఆదాయం ప్రతి నెలా భర్తీ చేసే విధంగా ఈ ప్లాన్ రూపొందించబడింది.

December 30, 2025 / 03:56 PM IST

APPLY NOW: DRDEలో ఇంటర్న్‌షిప్ ఖాళీలు

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌‌మెంట్ ఎస్టాబ్లిష్‌‌మెంట్ పెయిడ్ ఇంటర్న్​షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో  ఎంఎస్సీ/ బీ.టెక్./ బీఈ పూర్తైన వారు, చివరి సంవత్సరం వారు అప్లై చేసుకోవచ్చు. జనవరి 25 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుంది. వివరాలకు WWW.DRDO.GOV.INను సందర్శించండి.

December 30, 2025 / 03:45 PM IST