• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

GOOD NEWS: రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు

EdCILలో ప‌లు ఉద్యోగాల ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టులను బట్టి ఆక్యుపేషనల్ థెరపీ, ఫిజియోథెరపీ, లేదా స్పీచ్-లాంగ్వేజ్ పాథాలజీలో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాల‌కు ఎంపికైతే, అభ్యర్థులు ఏపీలోని వివిధ మున్సిపాలిటీలలో ఉన్న ఆటిజం సెంటర్లలో పని చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు www.edcilindia.co.inను చూడండి.

May 25, 2026 / 09:38 PM IST

GOOD NEWS: నోటిఫికేషన్ విడుదల

కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS) ఎగ్జామినేషన్-II, నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలలో ప్రవేశాలకు గాను మొత్తం 451 ఖాళీలను భర్తీ చేయనున్నారు. త్రివిధ దళాల్లో ఆఫీసర్లుగా చేరాలనుకునే అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

May 25, 2026 / 07:07 PM IST

JEE Advanced కీ విడుదల

ఐఐటీ రూర్కీ.. JEE Advanced-2026 ప్రాథమిక కీ విడుదల చేసింది. కీపై అభ్యంతరాలుంటే రేపటి వరకు అవకాశం ఇచ్చింది. దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు  మే 17న రెండు షిఫ్టుల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష దేశ వ్యాప్తంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఫైనల్‌ కీతో పాటు ఫలితాలను జూన్‌1 విడుదల అవుతాయని ఉన్నత విద్యామండలి వెల్లడించింది.

May 25, 2026 / 05:40 PM IST

ALERT: రేపే చివరి తేదీ

AP: ఈఏపీసెట్‌కు హాజరైన అభ్యర్థులు తమ కనీస అర్హత పరీక్ష ఇంటర్ మార్కుల డిక్లరేషన్ ఇవ్వాలని విద్యామండలి ప్రకటించింది. ఈ డిక్లరేషన్‌కు రేపే చివరి తేదీ. ఈఏపీసెట్ ర్యాంకుల కేటాయింపులో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్‌ బోర్డు, RGUKT విద్యార్థుల మార్కులు ఇప్పటికే EAPCET డేటాబేస్‌తో అనుసంధానమై ఉండటంతో అవి డిక్లరేషన్ ఫామ్‌లో కనిపిస్తాయి.

May 25, 2026 / 03:57 PM IST

గోనబోయినపల్లికి బస్సు సౌకర్యం కల్పించాలని వినతి

NLG: గుండ్లపల్లి(డిండి) మండలం గోనబోయినపల్లి గ్రామానికి దేవరకొండ నుంచి బస్సు సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్ విజయ కుమారికి సోమవారం గ్రామ నాయకులు, ప్రజలు వినతిపత్రం అందజేశారు. గతంలో గ్రామానికి బస్సు సౌకర్యం ఉండేదని, ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి బస్సును పునరుద్ధరించాలని కోరారు. నిత్యం దేవరకొండకు విద్యార్థులు, ప్రజలు ప్రయాణిస్తుంటారని తెలిపారు.

May 25, 2026 / 03:30 PM IST

ALERT: జూన్‌ 1న ఫలితాలు

AP: ఎప్‌సెట్‌ ఫలితాలు జూన్‌ 1న విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3,55,803 మంది దరఖాస్తు చేయగా 3,29,474 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇంజినీరింగ్, ఫార్మసీ (MPC)కి 2,76,576 మంది దరఖాస్తు చేయగా.. 2,58,545 మంది పరీక్ష రాశారు. వ్యవసాయ, ఫార్మసీ (BIPC)కి 79,227 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. 70,929 మంది హాజరయ్యారు.

May 25, 2026 / 03:04 PM IST

రూపాయి పతనంపై RBI గవర్నర్ స్పందన

రోజురోజుకు రూపాయి విలువ పతనం కావడంపై RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రూపాయి ఓవర్ వ్యాల్యూగా ఉందని అనలేమని, వాస్తవిక విలువ కంటే తక్కువగా ట్రేడ్ అవుతోందని మాత్రం చెప్పగలమని వెల్లడించారు. అలాగే రూపాయి విలువకు సంబంధించి ఎలాంటి నిర్దిష్ట మారకపు రేటు స్థాయిని RBI లక్ష్యంగా పెట్టుకోదని స్పష్టం చేశారు.

May 25, 2026 / 12:30 PM IST

BIG ALERT: సీయూఈటీ పరీక్ష వాయిదా

దేశవ్యాప్తంగా జరగనున్న కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET-UG) షెడ్యూల్‌లో మార్పు చోటుచేసుకుంది. మే 28న జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు NTA ప్రకటించింది. కేంద్రం బక్రీద్ పండుగకు సంబంధించిన ప్రభుత్వ సెలవు తేదీని సవరించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొత్త పరీక్ష తేదీలను త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తామని NTA తెలిపింది.

May 25, 2026 / 07:32 AM IST

APPLY NOW: 635 పోస్టులకు నోటిఫికేషన్

పంజాబ్& సింధ్ బ్యాంకులో 635 అప్రెంటీస్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. తెలుగు రాష్ట్రాల్లో 40 ఖాళీలున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత, 20-28 ఏళ్ల మధ్య ఉన్న వారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు రూ.12,300 చెల్లిస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 6. వెబ్‌సైట్: https://punjabandsind.bank.in/

May 25, 2026 / 07:26 AM IST

ధన్వాడలో మట్టి అక్రమ రవాణా

NRPT: ధన్వాడ పెద్ద చెరువులో ఒండ్రు మట్టిని టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇటుక బట్టీలకు తరలిస్తున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. అధిక లోడుతో రహదారులు దెబ్బతింటుండగా, ప్రభుత్వానికి నష్టం జరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి మాఫియాపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

May 24, 2026 / 02:43 PM IST

మెటాలో చైనా ఉద్యోగులదే ఆధిపత్యం: మాజీ ఉద్యోగి

మెటాలో చైనా ఉద్యోగుల ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉందని ఓ మాజీ ఉద్యోగి సంచలన ఆరోపణలు చేశాడు. ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులు ఒంటరిగా ఫీలయ్యే పరిస్థితి ఉందన్నాడు. సంస్థలో తన అనుభవాలను వివరిస్తూ మెటా మాజీ ఇంజినీర్ జెరెమీ బెర్నియర్ ఓ పోస్ట్ పెట్టాడు. చైనాయేతర ఉద్యోగులు తక్కువగా ఉన్నారని తెలిపాడు. అయినా.. ఈ సారి లేఆఫ్‌ల్లో వారినే అధికంగా తొలగించినట్లు రాసుకొచ్చాడు.

May 24, 2026 / 02:08 PM IST

ప్రశాంతంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష

దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. కేంద్రాల వద్ద జామర్లు ఏర్పాటు చేశారు. HYDలోని 100 కేంద్రాల్లో 44,209 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. 

May 24, 2026 / 09:50 AM IST

ఐదేళ్లలో 5 లక్షల కొత్త ఉద్యోగాలు

TG: రాష్ట్ర ప్రభుత్వం 2030 నాటికి ఐదు ప్రపంచశ్రేణి లైఫ్‌ సైన్సెస్‌ కేంద్రాల్లో ఒకటిగా తెలంగాణను అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు ఈ రంగంలో రానున్న ఐదేళ్లలో 5 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా తెలంగాణ నెక్ట్స్‌జెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీని మంత్రిమండలి ఆమోదించింది. ఇందుకు గ్రీన్‌ ఫార్మాసిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

May 24, 2026 / 08:13 AM IST

RRUలో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు

గుజరాత్‌లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ, ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు జూన్ 4 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ/బీఈడీ/PG/PHDలో ఉత్తీర్ణత సాధించాలి. ఉద్యోగ అనుభవం ఉండాలి. నెలకు రూ.30,000. నుంచి రూ.1,81,500 వేతనం ఉంటుంది.

May 24, 2026 / 07:55 AM IST

UGC NET దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) NET జూన్ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. నిన్నటితో గడువు ముగియాల్సి ఉండగా, విద్యార్థుల అభ్యర్థన మేరకు డెడ్‌లైన్‌ను ఒక్కరోజు పొడిగించినట్లు NTA తెలిపింది. ఇవాళ రాత్రి 11:50లోగా అప్లై చేయడంతో పాటు ఫీజు చెల్లించాలని పేర్కొంది. ఈనెల 26 నుంచి 28 వరకు కరెక్షన్స్‌కు అవకాశం ఇస్తామని చెప్పింది. సైట్: https://ugcnet.nta.nic.in/

May 24, 2026 / 04:50 AM IST