పాన్-ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు గడువు డిసెంబరు 31తో ముగియనుంది. లేకుంటే 2026 జనవరి 1 నుంచి పాన్ కార్డు రద్దవుతుంది. ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డు రద్దయితే ITR దాఖలు చేయడం కుదరదు. మీకు రావాల్సిన పన్ను రీఫండ్లు నిలిచిపోతాయి. బ్యాంకు లావాదేవీలు, మ్యూచ్‌వల్ ఫండ్లు వంటి పెట్టుబడులపై అధిక టీడీఎస్ విధిస్తారు.
తన సంస్థలో ఉద్యోగాల కోసం ఉత్తరకొరియా పౌరుల నుంచి వచ్చిన 1800 అప్లికేషన్లను తిరస్కరించినట్లు అమెజాన్ వెల్లడించింది. ఈ విషయాన్ని లింక్డిన్ పోస్ట్ ద్వారా అమెజాన్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ స్టీఫెన్ ష్మిత్ తెలిపారు. గతేడాది కాలంలో ఉత్తరకొరియా నుంచి తమ సంస్థకు వచ్చిన అప్లికేషన్ల్లలో 30 శాతం పెరుగుదల కనిపించిందని స్టీఫెన్ పేర్కొన్నారు.
2025లో ఆన్లైన్ ఆర్డర్లకు సంబంధించిన నివేదికను ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది. ఇందులో ముంబైకి చెందిన ఓ వినియోగదారుడు ఈ ఏడాది 3 వేల సార్లు ఆర్డర్ చేసినట్లు తెలిపింది. దేశంలో ఇదే అత్యధికమని స్విగ్గీ పేర్కొంది. అలాగే, హైదరాబాద్‌కు చెందిన ఓ కస్టమర్ రూ.47 వేలతో 65 బాక్సుల డ్రైఫ్రూట్స్ బిస్కెట్లు ఆర్డర్ చేసినట్లు సమాచారం.
ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆటో స్క్రోల్’ ఫీచర్‌ను ఆన్ చేస్తే ఒక రీల్ అయిపోగానే మరో రీల్ ఆటోమేటిక్‌గా ప్లే అవుతుంది. దీనికోసం రీల్స్ ట్యాబ్‌లో ఏదైనా రీల్ ప్లే చేసి, కుడివైపు ఉన్న మూడు డాట్స్‌పై క్లిక్ చేసి ‘Auto Scroll’ ఆప్షన్‌ను ఆన్ చేయాలి. యూట్యూబ్‌లో వీడియోలకు ఆటో ప్లే ఉన్నా, షార్ట్స్‌కు లేదు. వాటికి పీసీలో ఎక్స్టెన్షన్ అవసరం.
అనంతపురం జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు, ఆయా పోస్టుల భర్తీకి కలెక్టర్ ఓ. ఆనంద్ ఆదేశాల మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 14 వర్కర్లు, 78 ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకు సంబంధిత ప్రాజెక్టు కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 638.12 పాయింట్ల లాభంతో 85,567.48 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 206 పాయింట్ల లాభంతో 26,172.40 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 89.70గా ఉంది.
గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ జయంతి నేడు. శుద్ధ గణితంలో ఈయనకు శాస్త్రీయమైన శిక్షణ లేకపోయినా గణిత విశ్లేషణ, సంఖ్యాశాస్త్రం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాలలో కృషి చేశాడు. రామానుజన్ తక్కువ సంవత్సరాలే బతికినా.. సుమారు 3900 ఫలితాలు రాబట్టాడు. ఆయన తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా 1729 సంఖ్య ప్రత్యేకతను చెప్పాడు.
EV స్కూటర్ల ధరలు పెంచుతున్నట్లు ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ ప్రకటించింది. అన్ని మోడళ్లపై గరిష్ఠంగా రూ.3 వేల వరకు పెంపు ఉంటుందని తెలిపింది. జనవరి 1 నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఏథర్ సంస్థ 450 సిరీస్‌లో పెర్ఫార్మెన్స్ స్కూటర్లను, రిజ్తా పేరిట ఫ్యామిలీ స్కూటర్లను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.1,14,546 నుంచి ఉన్నాయి.
కొత్త యూజర్లను ఆకర్షించేందుకు BSNL తన ఫ్రీ సిమ్ ప్లాన్‌ను మరోసారి తీసుకొచ్చింది. క్రిస్మస్, న్యూఇయర్ కానుకగా రూ.1కే 30 రోజులపాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 2GB డేటా, 100 SMSలు అందించనున్నట్లు పేర్కొంది. సిమ్ ఉచితంగా లభించినా రూపాయితో రీఛార్జ్ చేస్తేనే పై ఫీచర్లు పొందొచ్చు. ఈ ఆఫర్ వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.
IIT వడోదరలో 7 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ట్రైనింగ్ & ప్లేస్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు ఉండగా.. PG, CA అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్సైట్: www.iiitvadodara.ac.in
TG: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేపర్-1 పరీక్ష ‘కీ’ విడుదలైంది. ఈనెల 14న పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పేపర్-1 పరీక్ష నిర్వహించింది. సా. 5 గంటల నుంచి tgprb.inలో కీ అందుబాటులో ఉండనుంది. ఈ నెల 24 వరకూ అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఒక్కో అభ్యంతరానికి రూ.500 ఫీజు ఉంటుందని, అభ్యంతరం సరైనదైతే ఫీజు తిరిగి ఇస్తామని తెలిపింది.
TG: పదో తరగతి పరీక్షల షెడ్యూల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. పరీక్షల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉందని, తగ్గించాలని డిమాండ్స్ వెలువడుతున్నాయి. MLC శ్రీపాల్ రెడ్డి సైతం పరీక్షల వ్యవధి తగ్గించాలని CM రేవంత్ రెడ్డిని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రేవంత్ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు జరగనున్నాయి.
TG: సీఎం విదేశీవిద్యా పథకానికి మైనారిటీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. 2026 జనవరి 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంక్షేమశాఖ కమిషనర్ వెల్లడించారు. ఈపాస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయాలని తెలిపారు. అవసరమైన పత్రాలతో దరఖాస్తులను ఫిబ్రవరి 20లోగా సంబంధిత జిల్లా సంక్షేమ అధికారులను అందించాలని సూచించారు.
AP: పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులంతా ఈనెల 21లోగా వారికి కేటాయించిన శిక్షణ కేంద్రాల్లో రిపోర్టు చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఈనెల 22 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని తెలిపారు. మొత్తం 21 పీటీసీ, డీటీసీ, బీటీసీల్లో శిక్షణ ఇస్తామని వివరించారు. పూర్తి వివరాలు https://training.prismappolice.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చని సూచించారు.
AP: ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు జరిగింది. రెండు పరీక్షల తేదీలను ఇంటర్ బోర్డు మార్చింది. మ్యాథ్స్ పేపర్-2A, సివిక్స్ పేపర్-2ను మార్చి 4కి మార్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నారు.