టూ వీలర్ రైడింగ్ దిగ్గజం ర్యాపిడో కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ డెలివరీ సేవల కోసం ‘ఓన్లీ’ పేరుతో సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం డెలివరీ యాప్‌గానే కాకుండా.. కస్టమర్లకు, రెస్టారెంట్లకు అత్యంత లాభదాయకమైన ప్లాట్‌ఫామ్‌గా దీనిని తీర్చిదిద్దింది. ఈ యాప్ రెస్టారెంట్ల నుంచి ఎలాంటి కమీషన్ వసూలు చేయబోమని స్పష్టం చేసింది.