E.G: కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను తనిఖీ చేయడం జరిగిందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం రాజమండ్రిలోని ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌ను కలెక్టర్, ఆర్డీవో ఆర్.కృష్ణ నాయక్‌లతో కలిసి పరిశీలించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల భద్రతపై క్రమం తప్పకుండా తనిఖీ చేస్తామన్నారు.
ప్రకాశం: మార్కాపురం జిల్లాగా ప్రకటించి, కేబినెట్ ఆమోదించిన సందర్భంగా మంగళవారం ఎర్రగొండపాలెం టీడీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాలాభిషేకం చేశారు. అధికారంలోకి రాగానే చెప్పినట్లుగానే మార్కాపురాన్ని జిల్లా ఏర్పాటు చేశారని, చంద్రబాబుకు రుణపడి ఉంటామని ఆయన తెలిపారు.
EG: సీతానగరం మండలం చిన్నకొండేపూడి గ్రామంలోని శ్రీ రామకృష్ణ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రాంగణంలో సంఘం ఛైర్మన్ కాండ్రు శేఖర్ 2026 నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరం రైతులకు మంచి పంటలు, ప్రజలకు శాంతి-సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.
TG: హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు నేలచూపు చూశాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1210 తగ్గి రూ.1,41,210కు చేరింది. అలాగే 22 క్యారెట్ల పసిడి రూ.1,110 తగ్గి రూ.1,29,440 పలుకుతోంది. బంగారం కంటే వెండి ఇంకా భారీగా తగ్గింది. కిలో వెండి ధర రూ.11,100 తగ్గి రూ.2,73,900కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
RITES 150 సీనియర్ టెక్నికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే ఆఖరి రోజు. డిప్లొమాతో పాటు పని అనుభవం గల 40 ఏళ్లలోపువారు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.29,725 చెల్లిస్తారు. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(NET) డిసెంబర్ 2025 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. డిసెంబర్ 31 నుంచి పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ugcnet.nta.nic.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూజీసీ సంబంధిత అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ వివరాలతో హాల్ టికెట్‌ను పీడీఎఫ్‌లో సేవ్ చేసుకోవాలి.
TG: TET హాల్‌టికెట్లను విద్యా శాఖ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 3 నుంచి పరీక్షలు జరగనున్నాయి. ఈసారి పేపర్ 1, 2 కలిపి 2,37,754 దరఖాస్తులు అందాయి. ఇందులో 71,670 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులున్నారు. వీరంతా కూడా పరీక్షలకు హాజరుకానున్నారు. హాల్‌టికెట్లను https://tgtet.aptonline.in/tgtet/ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
బంగారం, వెండి ధరలే కాదు.. ప్రపంచ మార్కెట్లో రాగి ధరలు కూడా రికార్డు స్థాయికి చేరాయి. ఇప్పుడు దీనిని కొత్త బంగారం లేదా కొత్త వెండి అని అంటున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, AI డిమాండ్, సరఫరాలో ఆటంకాలు, చైనా ఉత్పత్తి తగ్గింపు వంటివి ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో ఒక టన్ను రాగి ధర 12,000 డాలర్లు దాటిపోయింది.
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి షాక్ ఇస్తున్నాయి. ఇవాళ ఒక్కరోజే వెండి కేజీ ధర రూ.20 వేలు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,74,000కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,41,220కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,100 పెరిగి రూ.1,29,450గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL)లో 80 ట్రైనీ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండి(DEC 29) వరకే గడువు ఉంది. పోస్టును బట్టి వేర్వేరు అర్హతలు ఉండగా.. 27 ఏళ్ల లోపు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.40,000-రూ.1,40,000 చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి సంబంధించి (CEN 04/2025) కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. ఫిబ్రవరి 11, ఫిబ్రవరి 12 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష తేదీకి 4 రోజుల ముందు నుంచి మాత్రమే ఇ-కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
TG: రాష్ట్రంలో విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఖరారయ్యాయి. జనవరి 10 రెండో శనివారం, జనవరి 11 ఆదివారం కలుపుకుని జనవరి 18 వరకు సెలవుల(మొత్తం 9 రోజులు)ను పాఠశాల విద్యాశాఖ మంజూరు చేసింది. జనవరి 19న మళ్లీ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.
స్టేట్ బోర్డుల పరిధిలోని స్కూళ్లు CBSEకి మారుతున్నాయి. TGలో 5 ఏళ్లలో 113 స్కూళ్లు మారగా.. APలోనూ అదే పరిస్థితి. గతంలో ప్రభుత్వమే వెయ్యి స్కూళ్లలో CBSEని ప్రవేశపెట్టింది. NCERT సిలబస్ బోధన వల్ల JEE, NEET సహా పోటీ పరీక్షలకు మేలని పేరెంట్స్ ఈ స్కూల్స్ వైపు మొగ్గుతున్నారు. దీంతో యాజమాన్యాలూ అటే మారుతున్నాయి. దేశంలో CBSE స్కూళ్లు 31,879 ఉండగా APలో 1,495, T6లో 690 ఉన్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యాంకుల్లో నగదు కొరతతో ఆసరా లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నవంబర్ నెలకు 4 లక్షల మంది ఖాతాల్లో రూ.90 కోట్లు జమ చేసినా విత్‌డ్రా చేయలేకపోతున్నారు. పోస్టాఫీసులు, బ్యాంకులకు వెళ్లి నిరాశతో వెనుదిరుగుతున్నారు. RBI వద్ద నగదు కొరత, వరుస సెలవులు కారణమని తెలుస్తోంది. వెంటనే ఈ విషయంపై అధికారులు స్పందించాలని బాధితులు కోరారు.