హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ సాయంత్రం బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఉదయంతో పోల్చితే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.980 తగ్గి రూ.1,61,130కు చేరగా, ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూ.900 తగ్గి రూ.1,47,700గా నమోదైంది. మరోవైపు వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా రూ.2,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.