• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

యాపిల్‌కు కొత్త CEO

టెక్ దిగ్గజం యాపిల్ నూతన సీఈవోగా జాన్ టెర్నస్ నియమితులయ్యారు. జాన్ ప్రస్తుతం యాపిల్‌లో హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆయన ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి సీఈవోగా బాధ్యతలు తీసుకోనున్నారు. కాగా, ప్రస్తుత సీఈవో టిమ్ కుక్ యాపిల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్‌కు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

April 21, 2026 / 07:00 AM IST

323 SAI పోస్టులు.. నేడే లాస్ట్ డేట్

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI)లో 323 అసిస్టెంట్ కోచ్ పోస్టులకు దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగుస్తోంది. అథ్లెటిక్స్, షూటింగ్, రెజ్లింగ్, బాక్సింగ్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉండగా.. అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. UR/EWS/OBCలకు దరఖాస్తు ఫీజు రూ.2500. SC/ST/మహిళలకు రూ.2000. నెలకు జీతం రూ.35,400 నుంచి రూ.1,12,400 మధ్య ఉంటుంది.

April 21, 2026 / 06:37 AM IST

BREAKING: జేఈఈ ఫలితాలు విడుదల

జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదల అయ్యాయి. NTA వెబ్ సైట్‌లో ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 2 నుంచి 8 వరకు జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 11.23 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

April 20, 2026 / 07:47 PM IST

ఇంటర్ విద్యార్థులకు ALERT: గడువు పొడిగింపు

TG: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తు ఫీజును విద్యాశాఖ పెంచింది. పరీక్షల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవడానికి గడువు ఇవాళ్టితో ముగియనుండగా.. దానిని విద్యాశాఖ ఈ నెల 23 వరకు పెంచింది. సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి ప్రారంభం అవుతాయి.

April 20, 2026 / 03:41 PM IST

జేఈఈ మెయిన్‌ ఫైనల్‌ కీ విడుదల

దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ జేఈఈ మెయిన్ తుది కీ విడుదలైంది. అలాగే, ఫలితాలు ఏ క్షణంలోనైనా విడుదల చేసే అవకాశం ఉంది. ఈరోజు ఫలితాలు విడుదల చేస్తామని NTA ఇప్పటికే ప్రకటించింది. దీంతో జేఈఈ మెయిన్ రాసిన విద్యార్థుల తుది మెరిట్ లిస్ట్‌ ఏ సమయంలోనైనా https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

April 20, 2026 / 01:48 PM IST

కాసేపట్లో JEE MAIN సెషన్-2 ఫలితాలు విడుదల

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న JEE MAIN 2026 సెషన్-2 ఫలితాలను కాసేపట్లో NTA అధికారికంగా వెల్లడించనుంది. APRలో జరిగిన ఈ పరీక్షల ఫైనల్ ఆన్సర్ కీతో పాటు, అభ్యర్థుల స్కోర్‌కార్డులు, ఆలిండియా ర్యాంకులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. సెషన్-1, 2లలో విద్యార్థులు సాధించిన పర్సంటైల్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను ఖరారు చేస్తారు.

April 20, 2026 / 12:20 PM IST

2027 వరకు పెట్రోల్ ధరలు ఎక్కువగానే: అమెరికా

హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. దీంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్‌రైట్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 వరకు అమెరికాలో పెట్రోల్ ధరలు ఎక్కువగానే ఉండొచ్చని అంచనా వేశారు. పెట్రోల్ ధర ఒక గ్యాలన్‌కు 3 డాలర్ల పైనే ఉండొచ్చని తెలిపారు. వివాదం పరిష్కారమైతే ధరలు దిగొస్తాయని క్రిస్‌రైట్ పేర్కొన్నారు.

April 20, 2026 / 11:55 AM IST

APPLY NOW: దరఖాస్తులు ప్రారంభం

CRPFలో 9,175 కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీలో 504, TGలో 356 పోస్టులున్నాయి. టెక్నికల్, ట్రేడ్స్‌మెన్, పయనీర్ విభాగాల్లో ఖాళీలున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, సంబంధిత విభాగంలో ITI పాసైన వారు అర్హులు. వయసు 18-23 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 19. వెబ్‌సైట్: https://www.rect.crpf.gov.in

April 20, 2026 / 11:50 AM IST

BREAKING: పసిడి ప్రియులకు ఊరట

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గి రూ.1,55,290 వద్ద నమోదైంది. అలాగే, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.450 తగ్గి రూ.1,42,350కి చేరింది. గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్న ధరలకు బ్రేక్ పడటంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు.

April 20, 2026 / 09:43 AM IST

డిగ్రీ విద్యార్థులకు ఉచిత హాస్టల్ వసతి

TG: మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ BC గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2026-27 అకడమిక్ ఇయర్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 కాలేజీల్లో BSc, BCom, BBA లాంటి రెగ్యులర్ కోర్సులతో పాటు యానిమేషన్ వంటి స్పెషల్ కోర్సుల్లో 9,260 సీట్లు ఉన్నాయి. విద్యార్థులు మే 10 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ ఉచిత వసతితోపాటు క్వాలిటీ ఎడ్యుకేషన్, పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తారు.

April 20, 2026 / 07:03 AM IST

రీఛార్జ్ ధరలను పెంచేసిన AIRTEL

భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. రీఛార్జ్ ధరలను భారీగా పెంచేసింది. ముఖ్యంగా రూ.799 ప్లాన్(1.5GB/రోజుకు) ధరను రూ. 100 పెంచి రూ. 899గా నిర్ణయించింది. అలాగే, రూ. 859 ప్లాన్‌ను పూర్తిగా తొలగించింది. పెంచిన ఈ కొత్త ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.

April 19, 2026 / 08:29 PM IST

పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ADB: ఉట్నూర్ మండలంలోని వేణునగర్‌కు చెందిన ఉపాధ్యాయుడు కనక రామారావు పదవి విరమణ ఆత్మీయ అభినందన సభ స్టార్ ఫంక్షన్ హాల్లో జరిగింది . ఈ కార్యక్రమానికి ఖానాపూర్ MLA , నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి రామారావు దంపతులను శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

April 19, 2026 / 06:35 PM IST

ALERT: రేపటి నుంచి దరఖాస్తులు ప్రారంభం

TG: మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల్లో డిగ్రీ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. రేపటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవనున్నట్లు సొసైటీ కార్యదర్శి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 30 డిగ్రీ కళాశాలల్లో BSC, B.COM, BA వంటి సాంప్రదాయ కోర్సులతో పాటు BBA, యానిమేషన్ &VFX వంటి కోర్సులు కలిపి మొత్తం 31 కోర్సుల్లో 9,260 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

April 19, 2026 / 11:31 AM IST

ఇవాళ్టి గోల్డ్, సిల్వర్ ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,55,780 వద్ద ఉండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,800 గా నమోదైంది. మరోవైపు కిలో వెండి ధర రూ.2,80,000 వద్ద ఎటువంటి మార్పు లేకుండా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

April 19, 2026 / 09:57 AM IST

స్టాక్ మార్కెట్ కంటే బంగారమే సేఫ్!

పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. ఈ ఏడాది చివరికల్లా 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 1.85 లక్షలకు చేరవచ్చని యాక్సిస్ డైరెక్ట్ అంచనా వేసింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న డిమాండే ఇందుకు ప్రధాన కారణాలు. గత ఏడాది అక్షయ తృతీయ నుంచి ఇప్పటివరకు ధరలు 60% పెరగడం గమనార్హం. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ కంటే బంగారంపై పెట్టుబడే సురక్షితమని ఈ నివేదిక స్పష్టం చేసింది.

April 19, 2026 / 09:49 AM IST