హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. దీంతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్‌రైట్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 వరకు అమెరికాలో పెట్రోల్ ధరలు ఎక్కువగానే ఉండొచ్చని అంచనా వేశారు. పెట్రోల్ ధర ఒక గ్యాలన్‌కు 3 డాలర్ల పైనే ఉండొచ్చని తెలిపారు. వివాదం పరిష్కారమైతే ధరలు దిగొస్తాయని క్రిస్‌రైట్ పేర్కొన్నారు.