• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

RHFL టెక్నికల్ మేనేజర్ పోస్టులు భర్తీ

రెప్కో హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL) టెక్నికల్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ repcohome.comను సందర్శించండి.

April 24, 2026 / 11:59 AM IST

రేపే టెన్త్ ఫలితాలు?

AP: రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఉ.10 నుంచి మ.12 గంటల మధ్య ఫలితాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు మీ HIT TV యాప్‌లో చూసుకోవచ్చు. కాగా, టెన్త్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగాయి.

April 24, 2026 / 11:58 AM IST

బస్సులు బంద్.. రెండు రోజులు పరీక్షలు వాయిదా

TG: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రెండు రోజుల పాటు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆర్టీసీ బస్సుల బంద్‌ దృష్ట్యా ఇవాళ, రేపు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.

April 24, 2026 / 09:27 AM IST

ఐదేళ్లలో 51% పెరగనున్న సంపన్నులు

దేశంలో ఐదేళ్లలో అత్యంత సంపన్న వ్యక్తుల (UHNWI) సంఖ్య 25,217కు, బిలియనీర్ల సంఖ్య 313కు పెరగొచ్చని స్థిరాస్తి కన్సల్టెంట్ నైట్‌ఫ్రాంక్ అంచనా వేసింది. 30 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.270 కోట్లు), అంతకంటే ఎక్కువ నికర ఆస్తి కలిగిన వారిని UHNWIలుగా, రూ.9300 కోట్ల కంటే అధిక సంపద కలిగిన వారిని బిలియనీర్‌గా పరిగణిస్తారు. దేశంలో 19,877 మంది UHNWIలు, 207 మంది బిలియనీర్లు ఉన్నారు.

April 24, 2026 / 07:13 AM IST

NICలో 153 పోస్టులు.. ఇవాళే లాస్ట్

నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(NIC)లో 153 పోస్టులకు దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. 12 సైంటిస్ట్-C, 141 సైంటిస్ట్-D పోస్టులు ఉండగా.. డిగ్రీ/MSc, ME/MTech/MPhil ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. నెలకు సైంటిస్ట్-Cకు రూ.67,700-2,08,700.. సైంటిస్ట్-Dకు 78,800-2,09,200 జీతం ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.800. SC/ST/PwBD/మహిళలకు ఫీజు లేదు.

April 24, 2026 / 06:23 AM IST

20 వేల మంది ఫ్రెషర్లకు అవకాశం: ఇన్ఫోసిస్

IT దిగ్గజం ఇన్ఫోసిస్ ఫ్రెషర్లకు శుభవార్త చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలో ఉన్నట్లు ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(CFO) జయేష్ సంఘ్రాజ్కా తెలిపారు. మరోవైపు 2025-26 చివరి త్రైమాసికం(Q4)లో రూ.8,501 కోట్లతో 20.8% వృద్ధి సాధించినట్లు నిన్న ఇన్ఫోసిస్ ప్రకటించింది. దీంతో 2025-26లో కంపెనీ నికర లాభం రూ.29,440 కోట్లుగా నమోదైంది.

April 24, 2026 / 06:15 AM IST

ప్రముఖ వ్యాపారవేత్త కన్నుమూత

బీకాడీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ శివ్ రతన్ అగర్వాల్ ఇవాళ కన్నుమూశారు. ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజీలకు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. అయితే మరణానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. రతన్ చదివింది 8వ తరగతి అయినా.. తన అద్భుత వ్యాపార వ్యూహాలతో బీకాడీ ఫుడ్స్‌ను రూ.13 వేల కోట్ల విలువైన కంపెనీగా మలిచారు.

April 23, 2026 / 07:40 PM IST

‘భూభారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి’

MNCL: భూభారతి రెవెన్యూ సదస్సులలో ప్రజలు అందించిన దరఖాస్తుల పరిష్కారం ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి భూ భారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను పరిశీలించారు. దరఖాస్తులను రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలన్నారు.

April 23, 2026 / 06:07 PM IST

2031 నాటికి భారీగా పెరగనున్న బిలియనీర్ల సంఖ్య!

నైట్ ఫ్రాంక్ సర్వే ప్రకారం 2031 నాటికి భారత బిలియనీర్ల సంఖ్య 51 శాతం పెరగనుంది. రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్య 313కి చేరుతుందని అంచనా. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుండటంతో ప్రతిరోజూ సగటున 89 మంది అల్ట్రా రిచ్ జాబితాలో చేరుతున్నారు. ఇది మన దేశంలో పెరుగుతున్న సంపద సృష్టికి, ఆర్థిక బలానికి నిదర్శనంగా నిలుస్తోంది.

April 23, 2026 / 05:34 PM IST

ఇకపై వాట్సప్‌లోనే మొబైల్‌ రీఛార్జ్‌!

భారత్‌లోని తమ యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. పేయూ భాగస్వామ్యంతో మొబైల్ రీఛార్జ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. నేరుగా ఈ మెసేజింగ్ యాప్‌లోనే ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్‌లను చేసుకునే వెసులుబాటును కల్పించింది. దశలవారీగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది. 

April 23, 2026 / 03:55 PM IST

ఇకపై వాట్సాప్‌లోనే మొబైల్‌ రీఛార్జ్‌!

భారత్‌లోని తమ యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. పేయూ భాగస్వామ్యంతో మొబైల్ రీఛార్జ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. నేరుగా ఈ మెసేజింగ్ యాప్‌లోనే ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్‌లను చేసుకునే వెసులుబాటును కల్పించింది. దశలవారీగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది. 

April 23, 2026 / 03:55 PM IST

హైదరాబాద్ NIIMHలో రీసెర్చ్ పోస్టులు

TG: హైదరాబాద్​లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ (NIMH) సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 6 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మే 8 ఇంటర్యూ అనంతరం రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు వెబ్​సైట్ nimh.nih.govను సందర్శించండి.

April 23, 2026 / 01:27 PM IST

ALERT: రేపే ఫలితాలు

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్‌ గ్రాడ్యుయేట్ 2026 ఫలితాలను NTA రేపు విడుదల చేయనుంది. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో మొత్తం 157 సబ్జెక్టులకు ఈ పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ exams.nta.nic.in/cuet-pgలో చూసుకోవచ్చు. సవరించిన ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగానే ఈ ఫలితాలను ప్రకటిస్తున్నారు.

April 23, 2026 / 12:50 PM IST

ముగుస్తున్న దరఖాస్తు గడువు!

AP: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో రెండేళ్ల D.EL.Ed కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ‘డీఈఈసెట్-2026’ దరఖాస్తు గడువు మరో రెండు రోజుల్లో ముగుస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 25 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు గడువులోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

April 23, 2026 / 12:28 PM IST

జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తులు ప్రారంభం

దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఐఐటీలలో ప్రవేశాల కోసం నిర్వహించే JEE Advanced 2026 దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. JEE Mainలో నిర్ణీత కటాఫ్ పర్సంటైల్ సాధించిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేయగలరు. మే 2 వరకు ఆన్ లైన్లో అప్లై చేసుకోవచ్చు. మే 17న పరీక్ష జరగనుంది.

April 23, 2026 / 12:19 PM IST