• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బదిలీ

నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్‌ను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాదిన్నర కాలంగా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆయనను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలలో భాగంగా ఆయనను బదిలీ చేశారు. ఆయనను జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

April 26, 2026 / 06:21 AM IST

క్షమాపణలు చెప్పిన ఓపెన్ ఏఐ సీఈఓ

ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ క్షమాపణలు చెప్పారు. కెనడాలో 9 మంది మరణానికి కారణమైన 18 ఏళ్ల వాన్ రూట్సెల్లార్ ప్రవర్తనను గుర్తించి చాట్ జీపీటీ ఖాతాను గత జూన్ నెలలోనే సస్పెండ్ చేసినట్లు తెలిపారు. కానీ ఈ విషయంపై పోలీసులు అప్రమత్తం చేయలేకపోయినందుకు చింతిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మరణించిన వారి కుటుంబ సభ్యులను క్షమాపణలు కోరుతున్నట్లు వెల్లడించారు.

April 25, 2026 / 06:30 PM IST

వస్త్రధారణ పాలసీ వార్తపై ఇండిగో క్లారిటీ

సిబ్బంది వస్త్రధారణ విషయంలో ఇండిగో కొత్త రూల్స్ తెచ్చిందంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. తిలకం, సింధూరం, మంగళసూత్రం వంటి వాటిపై ఆంక్షలు విధించినట్లు వార్త చక్కర్లు కొడుతుంది. వీటిపై ఇండిగో స్పందించింది. అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేసింది. తప్పుడు వార్తలను నమ్మొద్దని ప్రజలను కోరింది. వస్త్రధారణ విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది.

April 25, 2026 / 04:20 PM IST

పదోతరగతి ఫలితాలు.. క్లారిటీ

AP: రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు ఇవాళ విడుదల కానున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. కానీ రిజల్ట్స్ రాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రలు అయోమయంలో పడ్డారు. ఈ ఫలితాల విడుదల వార్తలపై విద్యాశాఖ ఇప్పటి వరకు స్పందించనప్పటికీ.. త్వరలోనే ఫలితాల విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

April 25, 2026 / 12:24 PM IST

టెక్ టీమ్‌కు స్టార్‌బక్స్ షాక్

ప్రముఖ కాఫీ దిగ్గజం స్టార్‌బక్స్ తమ టెక్నాలజీ విభాగంలో సిబ్బందిని తొలగిస్తోంది. ఎంతమందిని తొలగిస్తున్నారనేది ఇంకా స్పష్టం కాలేదు. గతంలోనే అమెరికా, కెనడాలో వందలాది స్టోర్లను మూసివేసిన ఈ సంస్థ, వేల సంఖ్యలో రిటైల్, కార్పొరేట్ ఉద్యోగులను ఇంటికి పంపింది. ఖర్చులను తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

April 25, 2026 / 11:53 AM IST

BREAKING: రూ. 5 వేలు పెరిగిన ధర

హైదరాబాద్‌లో ఇవాళ బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,040 వద్ద, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల ధర రూ.1,41,200 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే, వెండి మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ఏకంగా రూ.5,000 పెరిగి కిలో వెండి ధర రూ.2,70,000కు చేరింది. పసిడి కొనేవారికి ఇది మంచి వార్తే అయినా.. వెండి ప్రియులకు మాత్రం భారమే.

April 25, 2026 / 09:57 AM IST

విరాహత్ అలీకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

NRML: టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ జన్మదిన సందర్భంగా జిల్లా యూనియన్ అధ్యక్షుడు రవీందర్, ప్రధాన కార్యదర్శి భూమయ్య, జాతీయ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాజశేఖర్, ప్రమోద్ రెడ్డి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ యోగేష్ కుమార్, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఆయురారోగ్యాలతో పాటు మరింత ఉన్నత స్థానాలు అలంకరించాలని వారు  ఆకాక్షించారు.

April 25, 2026 / 09:38 AM IST

జియో కొత్త ప్లాన్.. 10కి పైగా OTT సబ్‌స్క్రిప్షన్స్

జియో కొత్తగా రూ.500 మెగా కంటెంట్ ప్లాన్‌ను తెచ్చింది. 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా, యూట్యూబ్ ప్రీమియం, హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, 10కిపైగా OTTల సబ్‌స్క్రిప్షన్స్‌ను ఇస్తోంది. ఇందులోనే 5 వేల GB క్లౌడ్ స్టోరేజీతో 18 నెలల గూగుల్ జెమినీ ప్రో ప్లాన్ చేర్చింది. యూట్యూబ్ ప్రీమియం, 5GB హైస్పీడ్ డేటాతో రూ.200 మెగా కంటెంట్ యాడ్ ఆన్ ప్లాన్ కూడా ఉంది.

April 25, 2026 / 08:05 AM IST

రిలయన్స్ వార్షిక ఫలితాలు.. లాభం 16% పెరుగుదల

అంతర్జాతీయంగా ఇంధన ధరల ఒడుదొడుకులు, పశ్చిమాసియా యుద్ధం కారణంగా 2025-26 మార్చి త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం 12.5% తగ్గి రూ.16,791 కోట్లుగా నమోదైంది. అయితే మొత్తం ఆదాయం రూ.3.03 లక్షల కోట్లకు చేరడం విశేషం. పూర్తి ఆర్థిక సంవత్సరానికి(2025-26) లాభం 16% వృద్ధితో రూ.80,775 కోట్లుగా ఉంది. సంస్థ వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.6 డివిడెండ్ ప్రకటించింది.

April 25, 2026 / 07:53 AM IST

యాప్ సేవల్లో అంతరాయం ఉండదు: పేటీఎం

RBI ఆంక్షల నేపథ్యంలో Paytm యాప్ సేవలపై వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ ఆ సంస్థ అధికారిక వివరణ ఇచ్చింది. పేటీఎం యాప్ ద్వారా అందించే దాదాపు అన్ని సేవలు ఎప్పటిలాగే నిరంతరాయంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. పేటీఎం యాప్, UPI, వాలెట్, బిల్లు చెల్లింపులు, మనీ ట్రాన్స్‌ఫర్, టికెట్ బుకింగ్ వంటి ఫీచర్లు ఎలాంటి అంతరాయం లేకుండా పని చేస్తాయని వెల్లడించింది.

April 25, 2026 / 07:27 AM IST

నేడు పాలిసెట్-2026 ప్రవేశ పరీక్ష

AP: రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇవాళ పాలిసెట్-2026 ప్రవేశ పరీక్ష జరగనుంది. ఉ.11:00 గంటల నుంచి మ.1:00 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. హాల్ టికెట్లను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని, నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.

April 25, 2026 / 06:30 AM IST

రిలయన్స్‌ లాభంలో క్షీణత

నాలుగో త్రైమాసికంలో రూ.16,971 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.19,407 కోట్లతో పోలిస్తే లాభంలో 12.5 శాతం క్షీణత నమోదు కావటం గమనార్హం. 2025-26 పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ.80,775 కోట్ల నికర లాభం వచ్చినట్లు తెలిపింది. దీంతో ఒక్కో షేరుకు రూ.6 చొప్పున డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు అంగీకరించింది.

April 24, 2026 / 08:46 PM IST

‘PAYTM’కు ఆర్బీఐ SHOCK

పేటీఎంకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇవాళ్టితో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు ముగించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆ బ్యాంక్ బ్యాంకింగ్ వ్యాపారంపై నిషేధం విధించినట్లు వెల్లడించింది.

April 24, 2026 / 07:25 PM IST

ప్రతి 14 నిమిషాలకో కారు.. మారుతి రికార్డు

మారుతి సుజుకి సరికొత్త రికార్డు సృష్టించింది. సగటున ప్రతి 14 నిమిషాలకు ఒక కారును తయారు చేస్తూ, ఏడాదికి ఏకంగా 23.4 లక్షల కార్లను తయారు చేసింది. భారత ఆటోమొబైల్ చరిత్రలో ఇదే అత్యధికం. స్విఫ్ట్, డిజైర్ వంటి మోడల్స్ భారీగా అమ్ముడయ్యాయి. భవిష్యత్తులో ఈ సంఖ్యను 40 లక్షలకు పెంచి, మన దేశాన్ని ప్రపంచ కార్ల తయారీ కేంద్రంగా మార్చడమే తమ లక్ష్యమని కంపెనీ తెలిపింది.

April 24, 2026 / 05:10 PM IST

‘పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి’

ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ జేపీ మోర్గాన్ భారత స్టాక్ మార్కెట్ రేటింగ్‌ను ‘ఓవర్ వెయిట్’ నుంచి ‘న్యూట్రల్’కు తగ్గించింది. మార్కెట్‌లో పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. బేరిష్ ట్రెండ్ కొనసాగితే నిఫ్టీ-50 20,500 పాయింట్లకు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుత స్థాయిల నుంచి సుమారు 15 శాతం క్షీణించొచ్చని పేర్కొంది.

April 24, 2026 / 04:49 PM IST