• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

టెన్త్ విద్యార్థులకు CONGRATULATIONS

TG: టెన్త్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ మా HIT TV తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని, ఈ విజయం మీ ఉన్నత విద్యాభ్యాసానికి, కెరీర్‌కు బలమైన పునాది కావాలని ఆకాంక్షిస్తున్నాం. అదే సమయంలో, ఫలితాల విషయంలో నిరుత్సాహపడకుండా ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాం.

April 29, 2026 / 02:09 PM IST

BREAKING: టెన్త్ ఫలితాలు విడుదల

TG: పదోతరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి కేవలం గ్రేడ్లు కాకుండా సబ్జెక్టుల మార్కులను కూడా అధికారులు ప్రకటించారు. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్‌తో పాటు HIT TV యాప్‌లో సులభంగా, వేగంగా చెక్ చేసుకోవచ్చు. కాగా, మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు పదోతరగతి పరీక్షలు జరిగాయి.

April 29, 2026 / 02:01 PM IST

PGIMERలో 134 మెడికల్ ఆఫీసర్ పోస్టులు

TG: పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PGIMER), చండీగఢ్  మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. మొత్తం 134 ఖాళీలకు మే 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 22న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరగుతుంది.

April 29, 2026 / 01:25 PM IST

కాసేపట్లో HIT TV యాప్‌లో టెన్త్ ఫలితాలు

TG: రాష్ట్రంలో కాసేపట్లో పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు అధికారులు రిలీజ్ చేయనున్నారు. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్‌తో పాటు సులభంగా, వేగంగా HIT TV యాప్‌లో ఫలితాలు తెలుసుకోవచ్చు. కాగా, మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదోతరగతి పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది 5 లక్షల 28 వేల 239 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

April 29, 2026 / 01:03 PM IST

లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 415 పాయింట్లు లాభపడి 77,302 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 125 పాయింట్ల లాభంతో 24,118 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.94.78గా ఉంది.

April 29, 2026 / 09:37 AM IST

రేపే ఏపీ టెన్త్ ఫలితాలు

AP: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేయనున్నారు. మంత్రి లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేస్తారు. ఫలితాల విడుదలకు సంబంధించిన ప్రాసెస్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికే పూర్తి చేసింది. ఈ ఏడాది సుమారు 6.30 లక్షల మంది పరీక్షలు రాశారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు సులభంగా, వేగంగా HIT TV యాప్‌లో ఫలితాలు తెలుసుకోవచ్చు.

April 29, 2026 / 06:38 AM IST

30న ఎస్సీ యాక్షన్ ప్లాన్ ఇంటర్వ్యూలు

SRCL: ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 సంవత్సరానికి గాను యూనిట్లకు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 30వ తేదీన చందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు చందుర్తి ఎంపీడీవో రాధ తెలిపారు. ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయన్నారు. మండలంలో 15 యూనిట్లకు గాను 61 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆమె తెలిపారు.

April 28, 2026 / 08:01 PM IST

టెట్ అభ్యర్థులకు ALERT

TG: టెట్ పరీక్ష దరఖాస్తులకు ఈనెల 30వ తేదీ చివరి గడువు అని కన్వీనర్ రమేష్ తెలిపారు. అభ్యర్థులు వెంటనే రుసుము చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఇందులో పేపర్-1కు 21,826, పేపర్-2కు 59,271 మంది దరఖాస్తు చేయగా.. రెండు పేపర్లకూ 12,417 మంది అప్లై చేశారు. ఇప్పటి వరకు మొత్తం 93,514 దరఖాస్తులు అందాయి.

April 28, 2026 / 07:42 PM IST

కేంద్రానికి విమానయాన సంస్థలు కీలక విజ్ఞప్తి

కేంద్ర ప్రభుత్వానికి విమానయాన సంస్థలు కీలక విజ్ఞప్తి చేశాయి. విమాన ఇంధన ధరలు పెరగడం వల్ల నిర్వహణ భారంతో సతమతమవుతోన్నట్లు విమానయాన సంస్థలు వాపోతున్నాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని.. సాయం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాయి. కేంద్రం స్పందించకపోతే నిర్వహణ అసాధ్యమవుతోందని తెలిపాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే కంపెనీలు మూసేయాల్సి వస్తుందని చెప్పాయి.

April 28, 2026 / 02:55 PM IST

BREAKING: రేపు మధ్యాహ్నం టెన్త్ ఫలితాలు

TG: రాష్ట్రంలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు పదోతరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్‌తో పాటు సులభంగా, వేగంగా HIT TV యాప్‌లో ఫలితాలు తెలుసుకోవచ్చు. కాగా, మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదోతరగతి పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది 5 లక్షల 28 వేల 239 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

April 28, 2026 / 12:51 PM IST

BREAKING: హాల్ టికెట్లు విడుదల

AP EAPCET-2026 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. http://cets.apsche.ap.gov.in/లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 12 నుంచి 15 వరకు, 18న ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్, 19, 20న అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు.

April 28, 2026 / 12:05 PM IST

APPLY NOW: మరికొన్ని గంటలే ఛాన్స్

ఇండియన్ బ్యాంకులో 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. IT, అకౌంట్స్, క్రెడిట్, ఫైనాన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, HR, మార్కెటింగ్, సెక్యూరిటీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. వయసు 22-37 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టును బట్టి అర్హత BE, BTech, CA, MBA. పూర్తి వివరాలకు https://ibpsreg.ibps.inను సంప్రదించాలి.

April 28, 2026 / 11:53 AM IST

ఇంటర్ విద్యార్థులకు BIG ALERT

TG: ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలను మే 5 నుంచి మే 10 మధ్యలో విడుదల చేయాలని బోర్డు నిర్ణయించింది. ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ఆశించిన మార్కులు రాని లేదా ఫెయిల్ అయిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. మే 13 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల దృష్ట్యా విద్యార్థుల్లో గందరగోళం తగ్గించేందుకు ముందుగానే ఈ ఫలితాలను విడుదల చేయనుంది.

April 28, 2026 / 11:18 AM IST

TGRJC CET హాల్ టికెట్లు విడుదల

TG: తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం నిర్వహించే TGRJC CET 2026 హాల్‌టికెట్లు అధికారికంగా విడుదలయ్యాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసిన విద్యార్థులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో తమ హాల్‌టికెట్లు సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా, మే 3న పరీక్ష జరగనుంది. అభ్యర్థులు ఒక ఫొటో ఐడీ ఫ్రూఫ్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

April 28, 2026 / 09:15 AM IST

డిగ్రీలో కొత్త కోర్సులు.. మరింత ఆలస్యం!

TG: డిగ్రీ నూతన కోర్సుల రాక కాస్త ఆలస్యంకానుందా..? దోస్త్‌ మొదటి విడుత తర్వాతే ఇవి అందుబాటులోకి రానున్నాయా..? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే దోస్త్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌లోపు ఈ కోర్సులు అందుబాటులోకి రావడం కష్టంగానే కనిపిస్తున్నది. కాగా, 220 డిగ్రీ కాలేజీలు పలు కోర్సులను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నాయి.

April 28, 2026 / 08:06 AM IST