AP EAPCET-2026 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. http://cets.apsche.ap.gov.in/లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 12 నుంచి 15 వరకు, 18న ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్, 19, 20న అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు.