• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

జేఈఈ-2026 సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల

NCHM JEE- 2026 రాసే అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక ప్రకటన చేసింది. అభ్యర్థులకు కేటాయించిన పరీక్షా నగరాల ముందస్తు సమాచారాన్ని వెల్లడించింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్ ద్వారా సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. NCHM JEE- 2026 పరీక్షను ఈనెల 25న దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు.

April 17, 2026 / 06:45 PM IST

‘భూ కబ్జాలు, బోగస్ రేషన్ కార్డులపై దర్యాప్తు జరపాలి’

MNCL: జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించిన రాములుని బెల్లంపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొలిపాక శ్రీనివాస్ శుక్రవారం సన్మానించారు. ఈ సందర్బంగా బెల్లంపల్లిలో భూ కబ్జాల పైన, బోగస్ ఆహార భద్రత కార్డులపై దర్యాప్తు జరపాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.

April 17, 2026 / 06:01 PM IST

MCLలో 500 టెక్నీషియన్ పోస్టులు

మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (MCL), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఫోర్ మెన్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామకాలు పూర్తిగా ఆన్‌లైన్ మోడ్ ద్వారా జరుగుతాయని సంస్థ తెలిపింది. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

April 17, 2026 / 04:51 PM IST

జియో ఐపీవో.. సెబీకి ముసాయిదా పత్రాలు!

20 ఏళ్ల తర్వాత రిలయన్స్ నుంచి జియో ఐపీవో వస్తోంది. సుమారు రూ.40,000 కోట్లు సేకరించడమే లక్ష్యంగా మే నెలలో సెబీకి పత్రాలు సమర్పించనున్నారు. జియో విలువను రూ.15.78 లక్షల కోట్లుగా బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల వాయిదా పడ్డ ఈ మెగా ఇష్యూ కోసం ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది మార్కెట్లో కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.

April 17, 2026 / 04:38 PM IST

20న జేఈఈ మెయిన్ ఫలితాలు!

JEE మెయిన్-2026 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలో ప్రకటించనుంది. అధికారిక ప్రకటన ప్రకారం ఈ ఫలితాలు 2026 ఏప్రిల్ 20న విడుదల కానున్నాయి. అప్లికేషన్ నెంబర్, పుట్టినరోజు తేదీ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. jeemain.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ అందుబాటులో ఉంటాయి.

April 17, 2026 / 04:30 PM IST

గంజాయితో పట్టుబడిన ఎయిరిండియా కోపైలట్‌

ఎయిరిండియా కోపైలట్ ఒకరు శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో గంజాయితో పట్టుబడ్డాడు. అతడు ఇటీవల ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆయన విమానాన్ని నడపాల్సి ఉంది. ఈ క్రమంలో శానిఫ్రాన్సిస్కోలో అధికారులు చేసిన తనిఖీల్లో ఆయన బ్యాగ్‌లో గంజాయి బయటపడింది. దీంతో వారు ఎయిరిండియాకు సమాచారాన్ని అందించారు. ఈ ఘటనపై డీజీసీఏకు ఎయిరిండియా ఫిర్యాదు చేసింది.

April 17, 2026 / 04:21 PM IST

ఆ ఎంపీ రాజీనామా చేయాలి:DCC

ADB: తెలంగాణ విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య రాజీనామా చేయాలని ఆదిలాబాద్ DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ అన్నారు. తెలంగాణ విభజన ఆశాస్త్రీయంగా ఉందన్న వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ శుక్రవారం పట్టణంలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన ఎంపీ తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

April 17, 2026 / 04:01 PM IST

భారత్‌కు షాక్.. ఐదు నుంచి ఆరో స్థానానికి!

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) విడుదల చేసిన గ్లోబల్ జీడీపీ గణాంకాల ప్రకారం ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ ఆరో స్థానానికి పడిపోయింది. US, చైనా, జర్మనీ, జపాన్, బ్రిటన్ మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. రూపాయి విలువ తగ్గడం వల్లే మన ర్యాంకు పడిపోయిందని నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఏడాది కల్లా భారత్ నాలుగో స్థానానికి చేరుకుంటుందన్న అంచనాలు ప్రస్తుతం తలకిందులయ్యాయి.

April 17, 2026 / 02:14 PM IST

ఆసియాలోనే ధనవంతుడిగా గౌతమ్‌ అదానీ

ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నిలిచారు. ముకేష్ అంబానీని వెనక్కి నెట్టి టాప్‌లోకి దూసుకెళ్లారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం గౌతమ్ అదానీ సంపద 92.6 బిలియన్ డాలర్లుగా, ముకేష్ అంబానీ సంపద 90.8 బిలియన్ డాలర్లు ఉంది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 656 బిలియన్‌ డాలర్లతో ప్రపంచ సంపన్నుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

April 17, 2026 / 01:40 PM IST

వోల్వో కార్ల ధరల పెంపు

స్వీడన్‌కు చెందిన విలాసవంత కార్ల తయారీ సంస్థ వోల్వో కార్ భారత్‌లో తన వాహన మోడళ్ల ధరలను రూ.1లక్ష వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. మే 1 నుంచి ఈ ధరల పెంపు అమల్లోకి వస్తుందని పేర్కొంది. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థ అంతరాయాలు, విదేశీ మారకపు ఒడుదొడుకుల కారణంగా ధరలను పెంచాల్సి వస్తోందని పేర్కొంది.

April 17, 2026 / 01:20 PM IST

మార్కెట్లోకి ఒప్పో ఎఫ్33 స్మార్ట్‌‌‌‌ఫోన్లు

ఒప్పో F33 సిరీస్ స్మార్ట్‌‌‌‌ఫోన్లను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో F33 ప్రో 5జీ, F33 5జీ మోడళ్లు ఉన్నాయి. ఈ ఫోన్లలో 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. వంద డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో గ్రూప్ సెల్ఫీలు తీసుకోవచ్చు. ధరలు రూ.32 వేల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23 నుంచి అమ్మకాలు మొదలవుతాయి. 

April 17, 2026 / 10:59 AM IST

LIC HFLలో 180 పోస్టులు.. అప్లై చేశారా?

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఖాళీగా ఉన్న 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ గలవారు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. జీతం నెలకు రూ.38,709-41,509 మధ్య ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.800+GST.

April 17, 2026 / 08:52 AM IST

Indbankలో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

Indbankలో 12 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ రోజు. 7 రిలేషన్‌షిప్ మేనేజర్, 5 డీలర్ ఫర్ స్టాక్ బ్రోకింగ్ టర్నినల్స్ పోస్టులు ఉండగా.. డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతోపాటు ఉద్యోగానుభవం, ఎన్ఐఎస్ఎం అర్హత కలిగినవారు అప్లై చేసుకోవచ్చు. పోస్టులను బట్టి జీతం రూ.4 లక్షలు-5 లక్షల మధ్య ఉంటుంది. ఆసక్తిగలవారు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.

April 17, 2026 / 07:37 AM IST

నేటి నుంచి పరీక్షలు.. అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (NCET)-2026కి సంబంధించిన అడ్మిట్ కార్డులను NTA విడుదల చేసింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్ ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డు కాపీని భద్రపరుచుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షలను ఏప్రిల్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నట్లు NTA వెల్లడించింది.

April 17, 2026 / 05:57 AM IST

MBBS ఫైనల్‌ ఇయర్‌ పరీక్ష రద్దు

TG: కాళోజీ ఆరోగ్య యూనివర్సిటీ పరిధిలో నిన్న జరిగిన పరీక్ష రద్దు అయింది. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ జనరల్ సర్జరీ పేపర్ -1ను రద్దు చేసినట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. ఈనెల 27న తిరిగి పరీక్షను నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రశ్నాపత్రంలో జరిగిన పొరపాట్ల వల్ల పరీక్ష రద్దు చేశారు.

April 16, 2026 / 11:39 PM IST