రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పారా మెడికల్ పోస్టులు పరీక్ష తేదీలను సవరించింది. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు మార్చి 10 నుంచి 12 వరకు జరగాల్సి ఉన్నాయి. కానీ, తాజా ప్రకటన ప్రకారం ఈ పరీక్షలు మార్చి 11, 12, 13 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షకు 10 రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్, 4 రోజుల ముందు అడ్మిట్ కార్ట్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.