వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని దక్కించుకునే రేసు నుంచి నెట్‌ఫ్లిక్స్ వెనక్కి తగ్గింది. కొనుగోలు ఆఫర్ మొత్తాన్ని పెంచేందుకు నెట్‌ఫ్లిక్స్ ఆసక్తి చూపకపోవడంతో ఈ డీల్ నిలిచిపోయింది. దీంతో, ట్రంప్‌తో అనుబంధం ఉన్న పారామౌంట్ స్కైడ్యాన్స్ సంస్థతో ఈ ఒప్పందం ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. భారీ వ్యయంతో కూడిన ఈ డీల్ ఇప్పుడు మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.