AP: ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు జరిగింది. రెండు పరీక్షల తేదీలను ఇంటర్ బోర్డు మార్చింది. మ్యాథ్స్ పేపర్-2A, సివిక్స్ పేపర్-2ను మార్చి 4కి మార్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నారు.
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(TG SET 2025) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్ http://www.telanganaset.org/ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉస్మానియా వర్సిటీ ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి 24 వరకు రెండు షిఫ్టులలో పరీక్షలు జరగనున్నాయి. డిగ్రీ కాలేజీల లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు అర్హత పొందాలంటే టీజీ సెట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
TG: మోడల్ స్కూళ్లలో చేరేందుకు ఇప్పటి వరకు 6వ తరగతి నుంచి ఎంట్రన్స్ పరీక్షలుండగా, వాటిని 5వ తరగతి నుంచే నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. గురుకులాల్లో 5వ తరగతి నుంచే క్లాసులు నడుస్తుండటంతో మోడల్ స్కూళ్లలోనూ ఆ విధానాన్నే అమలు చేయనున్నారు. ఈ మేరకు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే జనవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది.
KRNL: కర్నూలులోని భూపాల్ కాంప్లెక్స్‌లో ఇవాళ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్లేస్‌మెంట్ అధికారి రామాంజనేయులు తెలిపారు. ఇందులో 10కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. పదో తరగతి నుంచి ఫార్మసీ వరకు చదివిన 18-30 ఏళ్ల లోపు అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలతో హాజరుకావాలని కోరారు.
TG: రాష్ట్రంలో పాఠశాలలకు ప్రభుత్వం క్రిస్మస్ సెలవులను ప్రకటించింది. మిషనరీ పాఠశాలలకు ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు.. ఇతర పాఠశాలలకు ఈనెల 24 నుంచి 26 వరకు క్రిస్మస్ సెలవులు ఇవ్వనున్నారు. పాఠశాల విద్యాశాఖ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
NLR: ముత్తకూరులో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా జరగనుంది. APSSDC సహకారంతో ఈ జాబ్ మేళా జరుగనుంది. ఇందులో 4కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని 1,000కుపైగా ఉద్యోగ అవకాశాలను అందించనున్నాయి. SSC, ఇంటర్, డిగ్రీ, ITI, డిప్లొమా బీటెక్, MBA, MCA, PG, ఫార్మసీ అర్హతలతో యువతీ, యువకులు పాల్గొనవచ్చు.
TG: గ్రూప్-3 ఫలితాలు విడుదలయ్యాయి. సెలక్షన్ లిస్టును టీజీపీఎస్సీ విడుదల చేసింది. 1,370 మంది గ్రూప్-3కి ఎంపికయ్యారు. గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్ష జరిగింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CTET – 2026 నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ గత నెల ప్రారంభమవగా.. గడువు ఇవాళ రాత్రితో ముగియనుంది. అభ్యర్థులు CBSE అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష ఫిబ్రవరి 8, 2026న నిర్వహిస్తుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
స్కామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి వచ్చే కాల్స్ అన్నీ తప్పనిసరిగా 1600 సిరీస్ నంబర్లతోనే రావాలని ఆదేశించింది. ఈ నిబంధనలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి అమలవుతాయని చెప్పింది. దీని ద్వారా అనేక నెంబర్ల నుంచి కాల్స్ రావడంతో తలెత్తే సైబర్ మోసాలను అరికట్టవచ్చని ట్రాయ్ వెల్లడించింది.
రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచేందుకు Airtel, Jio, VI రెడీ అవుతున్నాయి. 2026 నాటికి ఈ కంపెనీలు ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ టారిఫ్‌లను 16-20% వరకు పెంచే ఛాన్స్ ఉందని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫర్మ్ ‘మోర్గాన్ స్టాన్లీ’ పేర్కొంది. 2024 జూలైలో ధరలు పెరగగా రెండేళ్ల తర్వాత 2026లో మరోసారి పెరగనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
సత్యసాయి: పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ పాఠశాలలో 2026-27లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. ఒకటో తరగతి (బాలబాలికలు), 11వ తరగతి (బాలురు) ప్రవేశాలకు జనవరి 1 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 11వ తరగతికి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అర్హులు. మరిన్ని వివరాలకు www.ssshss.edu.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ప్రిన్సిపల్ తెలిపారు.
సత్యసాయి: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 19న మడకశిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. 11 ప్రముఖ కంపెనీలు పాల్గొని 500 మందికి అవకాశాలు కల్పిస్తాయని జిల్లా అధికారి హరికృష్ణ తెలిపారు. పది నుంచి పీజీ వరకు చదివిన 18-35 ఏళ్ల వారు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.15-25 వేల వరకు వేతనం అందుతుందన్నారు.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు త్వరలో 311 ఖాళీలతో ఐసోలేటెడ్ కేటగిరీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈనెల 30 నుంచి జనవరి 29 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనుంది. వివిధ రైల్వే రిజియన్లలో సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-3, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను భర్తీ చేయనుంది.
AP: వచ్చే విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభించేందుకు ఈనెల 31 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. cse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని, నిబంధనలు అనుసరించి అనుమతులు ఇస్తామని పేర్కొన్నారు. ఈనెల 31లోగా ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు.
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. 15 సిరీస్‌లో వన్‌ప్లస్ 15కు కొనసాగింపుగా 15Rను లాంచ్ చేసింది. ఫ్లాగ్‌షిప్ క్వాలిటీ, ప్రీమియం ఫీచర్లతో బిగ్‌బ్యాటరీతో ఈ ఫోన్‌ను కంపెనీ విడుదల చేసింది. దీని ధర 12GB+25GB స్టోరేజీ ధర ఇండియాలో రూ.47,999 నుంచి ప్రారంభం కానుంది.