ఏపీ ఈఏపీసెట్-2026 దరఖాస్తు గడువును ఈనెల 17 వరకూ పొడిగించినట్లు సెట్ కన్వీనర్ మోహనరావు వెల్లడించారు. రూ.1,000 ఆలస్య రుసుముతో ఈనెల 21 వరకు, రూ.10 వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 3 వరకు గడువు ఉందని తెలిపారు. తప్పుల సవరణకు వచ్చే నెల 4 నుంచి 6 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు cets.apsche.ap.gov.in/eapcet వెబ్సైట్ను చూడాలని సూచించారు.