• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

వాట్సాప్‌పై టెక్ దిగ్గజాలు సంచలన ఆరోపణలు

SM వేదికగా మేసేజింగ్ యాప్ వాట్సాప్‌పై టెక్ దిగ్గజాలు సంచలన ఆరోపణలు చేశారు. వాట్సాప్‌ను నమ్మలేమంటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ X వేదికగా పోస్టు చేశారు. మరోవైపు వాట్సాప్ గోప్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌ను టెలిగ్రామ్ CEO పావెల్ పోస్టు చేశారు. వాట్సాప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా మెటా వినియోగదారుల సందేశాలను చదవగలదని తెలిపారు.

April 10, 2026 / 12:40 PM IST

డిగ్రీ అర్హతతో డేటా ఎంట్రీ ఉద్యోగాలు

ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా (ఐసీఎస్ఐఎల్) డేటా ఎంట్రీ ఆపరేటర్, మల్టి టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 40 ఖాళీలుండగా.. డిగ్రీ, ఇంటర్ పూర్తి చేసిన వారు అర్హులు. ఏప్రిల్ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు వెబ్ సైట్ ICSIL.INను సంప్రదించండి.

April 9, 2026 / 09:49 PM IST

ఇంటర్ ఫలితాలు ఆలస్యం.. స్పందించిన విద్యాశాఖ

TG: ఇంటర్ ఫలితాలు ఆలస్యమవుతాయని వస్తున్న వార్తలపై విద్యాశాఖ స్పందించింది. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని స్పష్టం చేసింది. గతంలోనూ ఎప్పుడూ ఫలితాలు ఏప్రిల్ మొదటివారంలో విడుదల కాలేదని తెలిపింది. ఫలితాల తేదీని తామే ప్రకటిస్తామని.. విద్యాశాఖ ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే విద్యార్థులు నమ్మాలని విజ్ఞప్తి చేసింది.

April 9, 2026 / 04:39 PM IST

యూట్యూబ్ యూజర్లకు BIG SHOCK

స్మార్ట్‌టీవీ యూజర్లకు యూట్యూబ్ షాకివ్వనుంది. ఇకపై వీడియోల మధ్య ఏకంగా 90 సెకన్ల పాటు స్కిప్ చేయలేని ప్రకటనలను తీసుకురానుంది. ఆదాయం పెంచుకోవడంతో పాటు, యూజర్లను ప్రీమియం వైపు మళ్లించడమే దీని లక్ష్యమని తెలుస్తోంది. దీనిపై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం స్మార్ట్‌టీవీలకేనా? మొబైల్‌కూ వర్తింపజేస్తారా వేచి చూడాలి.

April 9, 2026 / 03:28 PM IST

BREAKING: భారీగా తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,340 తగ్గి రూ.1,51,480కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.2,150 తగ్గి రూ.1,38,850గా పలుకుతోంది. కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ.2,60,000 ఉంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

April 9, 2026 / 09:50 AM IST

ALERT: 577 ఉద్యోగాలకు నోటిఫికేషన్

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(NCL)లో 577 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. డంపర్/గ్రేడర్/డోజర్/సర్ఫేజ్ మైనర్ ఆపరేటర్, స్టాఫ్ నర్స్, ఓవర్‌సీర్(సివిల్) పోస్టులున్నాయి. టెన్త్, హెవీ మోటార్ వెహికల్/ట్రాన్స్‌పోర్ట్ లైసెన్స్, ఇంటర్, బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత సాధించాలి. వయసు 18-30 ఏళ్లు ఉండాలి. దరఖాస్తులకు మే 1 చివరి తేదీ. వెబ్‌సైట్: https://www.nclcil.in

April 9, 2026 / 08:37 AM IST

APPLY NOW: నేడే లాస్ట్ డేట్

AP: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో 2026-27 సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే పాలిసెట్ దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు చేసుకోవాలని అధికారులు సూచించారు. టెన్త్ పాసైనవారు, ఇటీవల పరీక్ష రాసిన వారు అర్హులు. ఏప్రిల్ 25న పరీక్ష నిర్వహించనున్నారు. https://apsbtet.ap.gov.in

April 9, 2026 / 06:28 AM IST

ముగిసిన జేఈఈ మెయిన్ పరీక్షలు

JEE మెయిన్ 2026 సెషన్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈనెల 20వ తేదీన ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని NTA తెలిపింది. రెండు సెషన్లలో ఉత్తమ స్కోర్‌ ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు. ఏప్రిల్ 23 నుంచి JEE అడ్వాన్స్‌డ్ దరఖాస్తులు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. అభ్యర్థులు తమ స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

April 9, 2026 / 12:55 AM IST

వచ్చే ఏడాది ద్రవ్యోల్బణం 4.6 శాతం: RBI

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.6 శాతంగా ఉండొచ్చని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. యుద్ధం, వాతావరణ పరిస్థితుల వల్ల వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని RBI గవర్నర్ హెచ్చరించారు. ఫిబ్రవరి నాటికి టోకు ద్రవ్యోల్బణం కూడా 3.2 శాతానికి పెరిగిందని అన్నారు. ధరల పెరుగుదల అంచనాలతో సామాన్య ప్రజల బడ్జెట్‌పై అదనపు భారం పడే సూచనలు కనిపిస్తున్నాయని RBI స్పష్టం చేసింది.

April 8, 2026 / 04:13 PM IST

అమెజాన్‌లో మరోసారి భారీ లేఆఫ్స్

ప్రముఖ కంపెనీ అమెజాన్‌ మరోసారి భారీ లే ఆఫ్స్‌కు సిద్దమైంది. ఈ ఏడాది మే నాటికి ప్రపంచవ్యాప్తంగా 14వేల మంది ఉద్యోగులను తొలగించనుంది. AIలో భారీ పెట్టుబడులు పెడుతుండటంతో ఖర్చులను తగ్గించుకోవడం కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా AWS, రిటైల్, HR విభాగాల్లో పనిచేసే ఉద్యోగులపై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనవరిలో 16వేల మందిని అమెజాన్ తొలగించింది.

April 8, 2026 / 03:00 PM IST

NITలో 86 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

NIT-తిరుచిరాపల్లి 86 పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఆర్కిటెక్చర్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉండగా.. విద్యార్హత, ఉద్యోగానుభవంతో పాటు గేట్/ నెట్/ సెట్/ CSIR నెట్ ఉత్తీర్ణత గలవారు ఈ నెల 16 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35 ఏళ్లు. UR/EWS/OBCలకు దరఖాస్తు ఫీజు రూ.2500. SC/ST/దివ్యాంగ అభ్యర్థులకు రూ.1250.

April 8, 2026 / 01:18 PM IST

ఫలితాలపై ఇంటర్ విద్యార్థులకు BIG ALERT

TG: ఇంటర్ ఫలితాలను తొలుత ఏప్రిల్ 10 లేదా 12 తేదీలలో ప్రకటించాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. కానీ అనుకోని కారణాల వల్ల ఏప్రిల్ మూడో వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫలితాల ప్రక్రియను మరింత కచ్చితంగా నిర్వహించాలని సీఎం రేవంత్ ఆదేశాలతో అధికారులు ‘డబుల్ చెక్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. మార్కుల లెక్కింపులో ఎలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

April 8, 2026 / 12:50 PM IST

UCSLలో 15 సూపర్‌వైజర్‌ పోస్టులు

ఉడుపి కేంద్రంగా పనిచేస్తున్న Udupi Cochin Shipyard Limited (UCSL) నుంచి కొత్త ఉద్యోగావకాశాలు విడుదలయ్యాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో 15 సూపర్‌వైజర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఐటీఐ, డిగ్రీ  పూర్తి చేసిన వారు ఈ నెల 22 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. జీతం రూ. 40,650 ఉంటుంది. వివరాలకు https://udupicsl.comను సంప్రదించండి.

April 8, 2026 / 12:05 PM IST

రూ.10,000 పెరిగిన వెండి ధర

బంగారం ధరతో పాటు వెండి ధర భారీగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ కిలో వెండి ఏకంగా రూ.10,000 ఎగబాకింది. దీంతో ప్రస్తుతం సిల్వర్ రేటు రూ.2,65,000కు చేరింది. కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,980 పెరగగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,650 పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.

April 8, 2026 / 10:56 AM IST

ఆర్‌బీఐ వడ్డీరేట్లలో మార్పుల్లేవ్‌

రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా(RBI) కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ద్రవ్య పరపనతి విధాన సమీక్ష నిర్ణయాలను RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని, 5.25% వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 2026-27 ఆర్థిక ఏడాదిలో RBI నిర్వహించిన తొలి ద్వైమాసిక సమీక్ష. ఫిబ్రవరిలో జరిగిన సమీక్షలో యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే.

April 8, 2026 / 10:24 AM IST