• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

ALERT: ఎడిట్ ఆప్షన్‌కు నేడే లాస్ట్ డేట్!

TG: ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల కోసం రాసే EAPCET అప్లికేషన్లలో తప్పులుంటే సరిచేసుకోవడానికి ఇచ్చిన టైమ్ ఇవాళ్టితో ముగియనుంది. చాలా మంది అప్లికేషన్లలో తప్పులు రావడంతో అధికారులు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. పేరు, పుట్టిన తేదీ, ఇంటర్ హాల్‌టికెట్ నంబర్ వంటివి ఆన్‌లైన్‌లో మారవు. మిగతా వివరాలను మాత్రం ఆన్‌లైన్‌లోనే వెంటనే మార్చుకోవచ్చు.

April 8, 2026 / 10:23 AM IST

తగ్గిన క్రూడాయిల్ ధర.. బలపడిన రూపీ

ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణతో క్రూడాయిల్ ధరలు 8% శాతం తగ్గిన సంగతి తెలిసిందే. బ్యారెల్ క్రూడాయిల్ ధర 117 డాలర్ల నుంచి 103కు చేరింది. దీంతో డారల్‌తో రూపాయి విలువ బలపడింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 50 పైసలు పెరిగి 92.56 వద్ద ట్రేడవుతోంది.

April 8, 2026 / 09:27 AM IST

భారీ జీతంలో AIIMSలో 142 ఉద్యోగాలు

AIIMS-దేవ్‌గఢ్ 142 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తులు  కోరుతోంది. జనరల్ సర్జరీ, ఫోరెన్సిక్ మెడిసిన్, మెడికల్ ఆంకాలజీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉండగా.. MD/MS/DNB/MDSలో ఉత్తీర్ణత గలవారు ఈ నెల 25 వరకు అప్లై చేసుకోవచ్చు. నెలకు రూ.67,700 వేతనం ఉంటుంది. జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.3000. OBC/EWSలకు రూ.1000. SC/ST/PwBD/ మహిళలకు ఫీజు లేదు.

April 8, 2026 / 08:43 AM IST

పదో తరగతి ఫలితాలపై కీలక అప్‌డేట్!

TG: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు మే మొదటి వారంలో విడుదలకానున్నట్లు తెలుస్తోంది. మే 4 లేదా 5న ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. టెన్త్ జవాబుపత్రాల మూల్యాంకనం ఈనెల 1న ప్రారంభమైంది. ఈనెల 23వ తేదీతో ముగుస్తుంది. ఫలితాలు క్రోడీకరించి మే మొదటి వారంలో రిజల్ట్ విడుదల చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

April 8, 2026 / 08:20 AM IST

NITCONలో ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్

నార్త్ ఇండియా టెక్నికల్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్(NITCON)లో 100 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. నెలకు రూ.55,932 వేతనం ఉంటుంది. UR, OBC అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.885. SC/ST/PwBDలకు రూ.531.

April 8, 2026 / 07:09 AM IST

సీఏ పరీక్షలపై ICAI కీలక నిర్ణయం

సీఏ ఫైనల్ పరీక్షలు ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు జరుగుతాయని ఐసీఏఐ తెలిపింది. మే సెషన్ నుంచే ఈ కొత్త విధానం ప్రారంభమవుతుందని పేర్కొంది. ఈ పరీక్షలు ప్రస్తుతం ఏడాదిలో మూడు సార్లు జరుగుతుండగా.. ఇకపై మే, నవంబరులో మాత్రమే జరుగుతాయని వెల్లడించింది. విద్యార్థుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీఏఐ జాయింట్‌ డైరెక్టర్ ఆనంద్ కుమార్ తెలిపారు.

April 7, 2026 / 04:50 PM IST

ALERT: పరీక్షలు రీషెడ్యూల్

సీఏ ఇంటర్ పరీక్షల నిర్వహణపై ICAI కీలక ప్రకటన చేసింది. దేశ వ్యాప్తంగా మే 3 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా.. మే 5న రీషెడ్యూల్ చేసినట్లు తెలిపింది. కొత్త షెడ్యూల్ ప్రకారం మే 5 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. ఇవి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని వెల్లడించింది. అయితే.. ఫౌండేషన్, ఫైనల్, పీక్యూసీ పరీక్షల తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.

April 7, 2026 / 04:27 PM IST

యుద్ధం.. 10 వేలకుపైగా విమానాలు రద్దు

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ నుంచి పలు దేశాలకు వెళ్లే అనేక విమాన సర్వీసులను దేశీయ విమానయాన సంస్థలు రద్దు చేశాయి. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 10 వేలకు పైగా విమాన సర్వీసులను రద్దయ్యాయి. ప్రయాణికులు భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విమానయాన శాఖ వెల్లడించింది. 

April 7, 2026 / 04:25 PM IST

యూఎస్ నుంచి బంగారం వెనక్కి తీసుకున్న ఫ్రాన్స్

అమెరికా నుంచి ఫ్రాన్స్ భారీగా బంగారం వెనక్కి తీసుకుంది. మొత్తం 129 టన్నుల పుత్తడిని వెనక్కి తెచ్చింది. న్యూయార్క్‌లో ఉన్న పాత బంగారాన్ని భారీగా విక్రయించి, ఐరోపాలో కొత్తగా బంగారం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 14.76 బిలియన్ డాలర్లు లాభం చేకూరింది. అలాగే.. తమ దేశ భద్రత, నిల్వల పరిరక్షణ చర్యలలో భాగంగా ఫ్రాన్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

April 7, 2026 / 02:50 PM IST

ALERT: పాలిసెట్‌కు దరఖాస్తు చేశారా?

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు పాలిసెట్‌-2026కు దరఖాస్తు చేసుకుంటున్నారు. APలో ఈనెల 9 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. ఏప్రిల్ 25న పరీక్ష జరగనుంది. https://polycetap.ap.gov.in/. అటు TGలో గడువు ఏప్రిల్ 20తో ముగియనుంది. మే 13న ఎగ్జామ్ నిర్వహించనున్నారు. పరీక్ష పూర్తైన 12 రోజులకు ఫలితాలు వెల్లడిస్తారు.

April 7, 2026 / 02:13 PM IST

ఇండక్షన్ స్టవ్‌లపై కేంద్రం కీలక నిర్ణయం

ఇండక్షన్ స్టవ్‌లకు JUL 1 నుంచి అమలు కావాల్సిన స్టార్ రేటింగ్ నిబంధనను కేంద్రం 6 నెలల పాటు వాయిదా వేసింది. దేశంలో ప్రస్తుతం ఉన్న వంటగ్యాస్ కొరత దృష్ట్యా ప్రజలు ఇండక్షన్ స్టవ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. కొత్త నిబంధనల వల్ల మార్కెట్లోకి స్టవ్‌లు రావడం ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త నిబంధనలు 2027 JAN 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

April 7, 2026 / 02:06 PM IST

ప్రయాణికులకు షాక్ ఇచ్చిన ఎయిరిండియా

ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన సర్‌ఛార్జిలను పెంచింది. ప్రస్తుతం రూ.299 ఉన్న ఫీజును రూ.899కి పెంచినట్లు తెలిపింది. డొమెస్టిక్ విమానాలకు రేపటి నుంచి ఈ పెంపు అమలులోకి రానుంది. అంతర్జాతీయ విమానాలకు ఏప్రిల్ 10 నుంచి ఈ పెంపు వర్తించనుంది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఏటీఎఫ్ ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికులపై అదనపు భారం పడనుంది.

April 7, 2026 / 01:40 PM IST

వాట్సాప్ కొత్త రూల్స్ ఇవే

సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సిమ్ బైండింగ్’ విధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం మీ ఫోన్‌లో రిజిస్టర్డ్ సిమ్ ఉంటేనే వాట్సాప్ పనిచేస్తుంది. ఈ నిబంధన గడువును 2026 డిసెంబర్ 31 వరకు పొడిగించారు. సిమ్ లేకుండా వాట్సాప్ వాడటం ఇక కుదరదు. దీనివల్ల నకిలీ ఖాతాలకు, ఫ్రాడ్ మెసేజ్లకు అడ్డుకట్ట పడనుంది.

April 7, 2026 / 01:32 PM IST

BUMPER OFFER: రూపాయికే అన్నీ ఉచితం!

BSNL కొత్త కస్టమర్ల కోసం అదిరిపోయే ‘ఫ్రీడమ్ ప్లాన్’ను మళ్లీ ప్రవేశపెట్టింది. కేవలం ఒక్క రూపాయికే నెల రోజుల పాటు అపరిమిత కాల్స్, రోజుకు 2GB డేటా, ఉచిత సిమ్ కార్డు లభిస్తాయి. ఈ అద్భుత అవకాశం కేవలం కొత్త యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఆఫర్ ఏప్రిల్ 30, 2026 వరకే అందుబాటులో ఉంటుంది అని X వేదికగా బీఎస్ఎన్ఎల్ ఇండియా పోస్ట్ చేసింది.

April 7, 2026 / 10:50 AM IST

నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 700కి పైగా, నిఫ్టీ 200కి పైగా కోల్పోయాయి. ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్‌ 73,420 స్థాయి వద్ద, నిఫ్టీ 22,770 వద్ద కదలాడుతున్నాయి. ఇక డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి 17 పైసలు నష్టపోయి రూ.93.07 వద్ద కొనసాగుతోంది.

April 7, 2026 / 09:28 AM IST