చలామణీలో ఉన్న రూ.2 వేల నోట్లు 98.45 శాతం తిరిగి బ్యాంకులకు చేరాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఇంకా రూ. 5,501 కోట్ల విలువ పెద్ద నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని తెలిపింది. రూ.2,000 నోట్ల ఉపసంహరణ చేసిన నాటికి వ్యవస్థలో మొత్తం రూ.3.56లక్షల కోట్ల విలువైన నోట్లు ఉన్నాయి. ఇప్పటికీ ఎవరి వద్దనైనా పెద్ద నోట్లు ఉంటే ఆర్బీఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు.
విమాన ప్రయాణికులపై గురువారం నుంచి ఇండిగో సంస్థ ఇంధన ఛార్జీలు వడ్డించనుంది. దేశీయ సర్వీసులపై రూ.275 నుంచి రూ.950 వరకు ఇంధన ఛార్జీలు ఉండనున్నాయి. అంతర్జాతీయ సర్వీసులపై రూ.900 నుంచి రూ.10 వేల వరకు ఉండనున్నాయి. ఇటీవల విమాన ఇంధనం ధరలు రెట్టింపు కావడంతో ఈమేరకు నిర్ణయం తీసుకుంది.
డిజిటల్ లావాదేవీలు మరింత భద్రం కానున్నాయి. RBI మార్గదర్శకాలు అనుసరించి ఇవాళ్టి నుంచి అన్ని డిజిటల్ లావాదేవీలకు టు-ఫ్యాక్టర్ అథంటికేషన్ అందుబాటులోకి వచ్చింది. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, వాలెట్లకు ఈ నిబంధన వర్తిస్తుంది. దీంతో ఇకపై లావాదేవీ పూర్తి చేయాలంటే రెండు వెరిఫికేషన్ అంచెలను పూర్తి చేయాలి. దీంతో ఎవరైనా మీ పిన్ తెలుసుకున్నా మీకు తెలీకుండా లావాదేవీ పూర్తి చేయడం సాధ్యం కాదు.
ప్రముఖ ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్‌కు చెందిన ‘క్లాడ్ కోడ్’ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోడ్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. అందులో క్లాడ్ కోడ్ ఎలా పనిచేస్తుంది? దాని ఆర్కిటెక్చర్ ఏంటి అనే వివరాలు ఉన్నాయి. లీక్‌ను ఆంథ్రోపిక్ కూడా ధ్రువీకరించింది. మానవ తప్పిదం వల్ల జరిగిందని వివరణ ఇచ్చింది. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది.
బ్లింకిట్‌తో అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ చేతులు కలిపింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇన్ టెర్మినల్ క్విక్ కామర్స్ సర్వీస్‌ను తీసుకొచ్చింది. ఈ సేవలు ఇప్పుడు టెర్మినల్ 2, డొమెస్టిక్ డిపార్చర్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. బ్లింకిట్ యాప్ ద్వారా విమానాశ్రయంలోని ప్రయాణికులు అవసరమైన వస్తువుల్ని ఆర్డర్ చేసుకోవచ్చు.
అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ ఒకేసారి 30 వేల మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఇందులో 12 వేల మంది భారత్‌లో పనిచేస్తున్నవారే కావడం గమనార్హం. ఇంకా మేనేజింగ్ హోదాలో ఉన్నవారినే ఎక్కువగా తొలగించినట్లు తెలుస్తోంది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వారి రోల్స్ ఇక అవసరం లేదని సదరు ఉద్యోగులకు మెయిల్‌లో తెలిపినట్లు సమాచారం. మరోసారి లేఆఫ్స్ ఉంటాయనే వార్తలూ వినిపిస్తున్నాయి.
నార్త్ ఇండియా టెక్నికల్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్ 100 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గలవారు ఈ నెల 8 వరకు అప్లై చేసుకోవచ్చు. నెలకు రూ.55,932 వేతనం ఉంటుంది. UR, OBC అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.885. SC/ST/PwBDలకు రూ.531
గ్యాస్ వినియోగదారులకు షాక్. కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. సిలిండర్‌పై రూ.195 పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. మార్చి 7న రూ.115 పెంచగా.. మూడు వారాల్లో రెండోసారి ధరలను పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో రూ.215 వరకు పెరగనుండటంతో సిలిండర్ ధర రూ.2321కి చేరనుంది. డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.
AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ఇవాళ్టి నుంచి ఒంటిపూట తరగతులు ప్రారంభం కానున్నాయి. ఉ.8 నుంచి మ.12:30 వరకు బోధన ఉంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులను ఇంటికి పంపుతారు. APR 23 వరకు తరగతులు కొనసాగుతాయి. ఆ తర్వాత వేసవి సెలవులు ఉంటాయి. JUNE 1 నుంచి కాలేజీలు పునఃప్రారంభమవుతాయి.
తెలంగాణలోని లా కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించే TG LAWCET(డిగ్రీ), TG PGLCET(మాస్టర్స్)కు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. అర్హులైనవారు ఎలాంటి రుసుము లేకుండా ఇవాళ అప్లై చేసుకోవచ్చు. మే 18న పరీక్ష జరగనుంది. లాసెట్ దరఖాస్తు ఫీజు రూ.900. SC/ST/PwBDలకు రూ.600. అలాగే PGLCET ఫీజు రూ.1100. SC/ST/PwBDలకు రూ.900. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
క్రియేటర్ల కోసం యూట్యూబ్.. మానిటైజేషన్ నిబంధనలను సవరించింది. 500 సబ్‌స్క్రైబర్లు, 3వేల గంటల వాచ్ టైమ్ ఉంటే సూపర్ థాంక్స్ వంటి ఫీచర్ల ద్వారా ఆదాయం పొందవచ్చు. అయితే, ప్రకటనల ద్వారా సంపాదించాలంటే పాత నిబంధనలే వర్తిస్తాయి. ముఖ్యంగా ఏఐ (AI) కంటెంట్ వాడితే తప్పనిసరిగా వెల్లడించాలి. కాపీ చేసిన లేదా కేవలం ఏఐతో సృష్టించిన వీడియోలకు ఇకపై మానిటైజేషన్ ఇవ్వదు.
క్రెడిట్ కార్డ్ అసురక్షిత రుణం కావడంతో, కార్డుదారుడు మరణిస్తే ఆ బకాయిలను చెల్లించాలని కుటుంబ సభ్యులను బ్యాంకులు ఒత్తిడి చేయకూడదు. అయితే, మరణించిన వ్యక్తి పేరిట ఉన్న ఆస్తులు లేదా డిపాజిట్ల నుంచి బ్యాంకులు బకాయిలు వసూలు చేసుకుంటాయి. వారసులపై వ్యక్తిగత ఆర్థిక భారం పడదు. RBI నిబంధనల ప్రకారం ఈ అప్పులు పూర్తిగా వారి ఎస్టేట్ బాధ్యతే.
దేశంలో మొబైల్ డేటా వినియోగం వేగంగా పెరుగుతోందని ప్రముఖ టెలికాం గేర్ తయారీ సంస్థ నోకియా వెల్లడించింది. 2025లో నెలవారీ సగటు వినియోగం 31జీబీగా ఉందని చెప్పింది. 2024లో మొబైల్ డేటా వినియోగం 27.5 జీబీ అని పేర్కొంది. దేశంలో 5జీ డేటా వినియోగం గతేడాదితో పోలిస్తే 70 శాతం పెరిగినట్లు వివరించింది. దేశంలో మొత్తం మొబైల్ బ్రాండ్ ట్రాఫిక్‌లో 5జీ వాటా 47 శాతంగా ఉందని నోకియా తెలిపింది.
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సీఈవోగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ మాజీ చీఫ్ విలియం వాల్ష్ నియమితులయ్యారు. గత సీఈవో పీటర్ తన పదవికి రాజీనామా చేయడంతో విలియంను సంస్థ భర్తీ చేసింది. పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత విలియం మాట్లాడుతూ.. ఇండిగో వంటి బలమైన సంస్థకు నాయకత్వం వహించడం సంతోషంగా ఉందన్నారు. విమానయాన రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సంస్థను ముందుకుతీసుకెళ్తానని చెప్పారు.
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(BARC-ముంబై)లో 105 జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఖాళీలకు దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళే చివరి రోజు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సెన్సెల్ విభాగాల్లో షెలోషిప్ అందించనుండగా.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైనవారికి తొలి రెండేళ్లు నెలకు రూ.37,000.. మూడో ఏడాది నుంచి రూ.42,000 స్టైఫండ్ లభిస్తుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.