హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,340 తగ్గి రూ.1,51,480కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.2,150 తగ్గి రూ.1,38,850గా పలుకుతోంది. కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ.2,60,000 ఉంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.