• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

ప్రైవేట్ స్కూళ్లు ఒత్తిడి చేస్తున్నాయా?

TG: ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల దందా మొదలైంది. ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలకు విరుద్ధంగా, ప్రైవేట్ పబ్లిషర్స్ పుస్తకాలను అధిక ధరలకు కొనాలని తల్లిదండ్రులపై యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ప్రైవేటు పాఠశాలల తీరుపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలని విద్యాశాఖ కార్యదర్శిని ఆదేశించింది.

April 23, 2026 / 07:51 AM IST

నేడే TG EAPCET-2026 హాల్ టికెట్లు విడుదల

TG EAPCET-2026 హాల్ టికెట్లు ఇవాళ్టి నుంచి విడుదల కానున్నాయి. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ఉదయం 11 గంటల నుంచి వెబ్‌సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలు మే 4, 5 తేదీల్లో జరుగుతాయి. అలాగే ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులకు హాల్ టికెట్లు ఏప్రిల్ 27న విడుదల కానుండగా, పరీక్షలు మే 9, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నారు.

April 23, 2026 / 06:54 AM IST

రేపటి నుంచి సెలవులు.. విద్యాశాఖ హెచ్చరికలు

TG: రేపటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానుండటంతో విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని చూస్తే ఆయా పాఠశాలల మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక ఎండలు విపరీతంగా ఉన్న కారణంగా పిల్లలు మధ్యాహ్నం బయటికి వెళ్లకుండా, అలాగే ఈత కోసం బావులు, చెరువుల వద్దకు వెళ్లకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించింది.

April 23, 2026 / 06:38 AM IST

GOOD NEWS: రేపటి నుంచి వేసవి సెలవులు

TG, APలోని విద్యార్థులకు వేసవి సెలవులు వచ్చేశాయి. రేపటి నుంచి జూన్ 11 వరకు స్కూళ్లు మూతపడనున్నాయి. దాదాపు 48 రోజుల పాటు సెలవులు కొనసాగనున్నాయి. ఇవాళ పాఠశాలలకు చివరి పని దినం కావడంతో విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్స్ అందించనున్నారు. కాగా, వేసవి సెలవులు అన్ని ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థలకు కూడా వర్తిస్తాయని విద్యాశాఖ స్పష్టం చేసింది.

April 23, 2026 / 06:31 AM IST

‘గత ఏడాది కంటే 20% ఎక్కువగా అడ్మిషన్లు జరగాలి’

NTR: విసన్నపేట జడ్పీ పాఠశాలను డీఈవో చంద్రకళ సందర్శించారు. బడి పిలుస్తుంది వారోత్సవాల సందర్భంగా ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేశారు. గత ఏడాదికంటే 20% ఎక్కువగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం రుచి చూశారు.

April 22, 2026 / 05:28 PM IST

మార్కెట్లోకి మోటో ఎడ్జ్ 70 ప్రో

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటో.. ఎడ్జ్ 70 ప్రో పేరిట స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఐ, 6.8 అంగుళాల సూపర్ HD ఎక్స్ ట్రీమ్ అమోలెడ్+ డిస్ ప్లే, 144Hz, వెనక వైపు 50MP+ 50MP కెమెరా, 50 MP సెల్ఫీ కెమెరా, 6,500mah బ్యాటరీ, IP68 రేటింగ్‌తో వస్తుంది. 8GB+256GB వేరియంట్ ధరను రూ.38,999గా కంపెనీ నిర్ణయించింది.

April 22, 2026 / 03:10 PM IST

రోజువారీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

TG: ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో RTCలో రోజువారి వేతనంతో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 10వ తరగతి పాసైన వారికి డిపో మేనేజర్లు టీమ్స్ మిషన్లపై అవగాహన కల్పిస్తున్నారు. అలాగే, డ్రైవర్ల‌కు కనీస విద్యార్హత ఉండి 18 నెలల డ్రైవింగ్‌పై అనుభవం ఉంటే అవకాశాలు కల్పిస్తున్నారు. రోజువారిగా కండక్టర్లకు రూ.800, డ్రైవర్లకు రూ.1,000 వేతనం ఇస్తున్నారు.

April 22, 2026 / 01:06 PM IST

పాలిసెట్ దరఖాస్తు.. నేడే లాస్ట్ డేట్

TG: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘పాలిసెట్’ దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులు.. ఇవాళ అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎలాంటి లేట్ ఫీజు లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా, షెడ్యూల్ ప్రకారమే మే 13న పాలిసెట్ పరీక్ష జరగనుంది.

April 22, 2026 / 07:43 AM IST

వీవో స్మార్ట్‌ఫోన్‌ మోడళ్లపై రూ.4వేల వరకు పెంపు

✦ వీవో T5x ..6GB+128GB వేరియంట్ ధర రూ.18,999 నుంచి రూ.22,999కు✦ వీవో V70 Elite.. 8GB+256GB వేరియంట్ ధర రూ.51,999 నుంచి రూ.55,999కు✦ వీవో V70.. 8GB+256GB వేరియంట్ ధర రూ.45,999 నుంచి రూ.49,999కు✦ వీవో Y400.. 8GB+256GB వేరియంట్ ధర రూ.27,999 నుంచి రూ. 31,999కు పెరిగింది

April 21, 2026 / 03:35 PM IST

24న రాజమండ్రిలో జాబ్ మేళా

E.G: రాజమండ్రిలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఏప్రిల్ 24న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీష్ చంద్ర ప్రసాద్ మంగళవారం తెలిపారు. మేడప్లస్ కంపెనీలోని జూనియర్ అసిస్టెంట్, ఆడిట్ అసిస్టెంట్ పోస్టల భర్తీ కొరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. టెన్త్, ఇంటర్, ITI, డిగ్రీ, MBA పూర్తి చేసి 19 – 30 సంవత్సరాల వయస్సు గలవారు అర్హులన్నారు.

April 21, 2026 / 01:30 PM IST

అందుబాటులోకి ఎల్‌ఈడీ క్రెడిట్ కార్డు

దేశంలో తొలి LED క్రెడిట్ కార్డు అందుబాటులోకి వచ్చింది. చెక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు దీనిని అందుబాటులోకి తీసుకువచ్చింది. ట్యాప్ టూ పే సమయంలో కార్డులో అమర్చిన దీపాలు వెలుగుతాయని ఇరు సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. ఈనెల 28 నుంచి కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. నగదు చెల్లింపులను స్పష్టంగా, ఆకర్షణీయంగా చేస్తుందని పేర్కొన్నారు.

April 21, 2026 / 11:58 AM IST

BREAKING: స్వల్పంగా తగ్గిన ధర

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉండగా.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ. 5000 తగ్గి 2,75,000కు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,55,290గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,350గా పలుకుతోంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

April 21, 2026 / 10:38 AM IST

BC గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు

TG: మహాత్మా జ్యోతిబా ఫూలే BC గురుకుల విద్యాలయాల సొసైటీ 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ అడ్మిషన్ల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈనెల 22 నుంచి మే 12 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. టెన్త్ మార్కుల ఆధారంగానే విద్యార్థుల సెలక్షన్ ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా బాలురకు 12,640, బాలికలకు 12,080 సీట్లు ఉన్నాయి. ఇప్పటికే BC గురుకుల స్కూళ్లలో చదువుతున్న వారు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదు.

April 21, 2026 / 07:50 AM IST

23 నుంచి JEE అడ్వాన్స్‌డ్ దరఖాస్తులు

JEE MAINలో అర్హత సాధించిన విద్యార్థులు ఈనెల 23 నుంచి MAY 2 వరకు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 17న పరీక్ష జరగనుంది. ఇందులోనూ క్వాలిఫై అయిన వారు NIT, IIIT, IIT, ఇతర కేంద్ర సంస్థల్లో సీట్లు పొందుతారు. గత విద్యాసంవత్సరం మొత్తం 62,853 సీట్లను భర్తీ చేశారు. అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలు వెల్లడైన మరుసటి రోజు నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

April 21, 2026 / 07:13 AM IST

ALERT: రేపటి వరకే లాస్ట్ ఛాన్స్

TG: రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి నిర్వహించే పాలిసెట్-2026 ప్రవేశ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును అధికారులు పొడిగించారు. ఏప్రిల్ 20తో ముగియాల్సి ఉండగా.. లేట్ ఫీజు లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును ఏప్రిల్ 22 వరకు పొడిగించారు. మే 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు మండలి స్పష్టం చేసింది. అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు.

April 21, 2026 / 07:06 AM IST