JEE MAINలో అర్హత సాధించిన విద్యార్థులు ఈనెల 23 నుంచి MAY 2 వరకు అడ్వాన్స్డ్కు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 17న పరీక్ష జరగనుంది. ఇందులోనూ క్వాలిఫై అయిన వారు NIT, IIIT, IIT, ఇతర కేంద్ర సంస్థల్లో సీట్లు పొందుతారు. గత విద్యాసంవత్సరం మొత్తం 62,853 సీట్లను భర్తీ చేశారు. అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు వెల్లడైన మరుసటి రోజు నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.