TG: రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి నిర్వహించే పాలిసెట్-2026 ప్రవేశ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును అధికారులు పొడిగించారు. ఏప్రిల్ 20తో ముగియాల్సి ఉండగా.. లేట్ ఫీజు లేకుండా ఆన్లైన్ దరఖాస్తుల గడువును ఏప్రిల్ 22 వరకు పొడిగించారు. మే 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు మండలి స్పష్టం చేసింది. అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు.